మళ్లీ కరోనా టెన్షన్‌..

మళ్లీ కరోనా టెన్షన్‌ మొదలైంది..ఇప్పటికే ఢల్లీి సహా కేరళ , మహారాష్ట్ర లను టెన్షన్‌ పెడుతున్న వైరస్‌ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది కరోనా మహమ్మారి..అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో కొత్తగా మరో ఏడు కేసులు నమోదు కావడంతో..జిల్లావ్యాప్తంగా పాజిటివ్‌ వచ్చిన వారి సంఖ్య 54కి చేరడం ఆందోళన కలిగిస్తోంది..జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రతికూల వాతావరణమే రోజు రోజుకు పెరుగుతున్న కేసులకు కారణం అని చెప్పారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్‌ అయ్యి 20 లక్షల బూస్టర్‌ డోస్‌లు కావాలని కేంద్రానికి లేఖ రాసింది.తెలంగాణలో మళ్లీ కరోనా భయం స్టార్ట్‌ అయ్యింది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 9మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే.. ఇలాంటి నేపథ్యంలో.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నుంచి బూస్టర్‌ డోస్‌ ఇవ్వనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇందు కోసం 5 లక్షల డోసులను సిద్ధం చేసినట్టు వివరించారు.పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు పెట్టుకోవాలి, చేతులు శానిటైజ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. భయపడాల్సిన పనిలేదు కానీ.. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా బడుల్లో భయం నెలకుంది. అక్కడక్కడా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఫైనల్‌ ఎగ్జామ్స్‌ జరుగుతున్న సమయంలో విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రజంట్‌ కరోనా టెన్షన్‌ పెడుతుంది. లక్షణాలు ఉంటే వారిని స్కూళ్లకు పంపవద్దని తల్లిదండ్రులకు.. వైద్య, విద్యా శాఖల అధికారులు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *