టీజర్‌కు ముహూర్తం కుదిరింది

ప్రభాస్‌ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీలక పాత్రలపై చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడు డార్లింగ్‌ అభిమానులంతా ఈ చిత్రం గురించే చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంలోనే నిర్మాణ సంస్థ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ట్రీట్‌ ఇవ్వనుంది. ఈ వారంలోనే ‘సలార్‌’ టీజర్‌ను విడుదల చేయనున్నారు. దానికి ఈ నెల 7న ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ పేజీల్లో చక్కర్లు కొడుతోంది.ప్రభాస్‌, శ్రుతీహాసన్‌ జంటగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ‘కె.జి.ఎఫ్‌.’ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ – హోంబలే సంస్థ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ చిత్రంలో పాటు ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కె, మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *