కమ్ముకొస్తున్న యుద్ధమేఘాలు..

రెండిళ్ల మధ్య ఓ యింటిని బెదిరించి ఖాళీచేయించాలన్న గొడవలా ఉంది అమెరికా, చైనా గోల. తైవాన్‌ ప్రజలు అసలు చైనానే ఇష్టపడటం లేదు. చైనాలో కలిసేందుకు వారు ససెమిరా అంగీకరించడం లేదు. కానీ చైనా మాత్రం తైవాన్‌ అనాదిగా మాదేనని దాని విూద సర్వహక్కులూ మావేనన్నట్టుగా వ్యవ హరిస్తోంది. ఇక అంతర్జాతీయ పెద్దన్న అమెరికా మాత్రం బుల్లి తైవాన్‌కు అండగా మేమున్నామని చైనాను హెచ్చరిస్తోంది. ఇటీవల ఏకంగా తమ చట్టసభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ని తైవాన్‌ పర్యటనకు పంపించింది. ఇన్నాళ్లూ తనదేనని అనుకున్నది వేరొకరు ఆక్రమించేందుకు దూకుడుగా వ్యవహరిస్తే ఎవరు మాత్రం మిన్నకుంటారు. చైనా పరిస్థితి అదే. నాన్సీ పర్యటన పట్ల చైనా ఆగ్రహించింది. చైనా విషయంలో కలగ జేసుకోవద్దని అమెరికాకు చిన్న హెచ్చరికా చేసింది. అయితే చైనాకు యుద్దానికి తలపడే అంత సీన్‌ లేదు, కేవలం గోల చేయడమేనని అమెరికా అన్నది. కానీ తైవాన్‌ జలసంధి చుట్టూ చైనా సైనిక పటా లంత దిగ్బంధనం చేసింది. ఇపుడు తైవాన్‌ జోలికి ఎవరు వచ్చినా తమతో తలపడాల్సిందేనని యుద్ధ వాతావరణమే చైనా సృష్టించింది. కానీ చెప్పకుండా తమ ఇంటి చుట్టూ కంచె వేస్తే యజమానికి కోపం వచ్చినట్టు తైవాన్‌ కూడా చైనా వ్యవహారం పట్ల మండిపడుతోంది. చైనా తమను తమ భూభాగంలోనిదే నని అనుకుంటోందే గాని వాస్తవానికి వారికి తమకూ సంబంధం లేదన్నది తైవాన్‌ వాదన. తైవాన్‌ ను అడ్డుపెట్టుకుని అమెరికా మళ్లీ ప్రపంచదేశాలకు తమ ఆధిపత్యాన్ని రుజువు చేయడాని ప్రయ త్నిస్తోంది. చైనాకు తన యుద్ధ కౌశలం ఎటు వంటిదో చూపించేం దుకే అమెరికా ఈ వారారంభంలో అఫ్ఘనిస్తాన్‌ లో అల్‌ఖైదా అధినేత జవహరి తలదాచుకున్న స్థావరంపై మిసైల్‌ దాడిచేసి ఆతడిని మట్టు బెట్టిన సంగతి భారీగా ప్రచారం చేసు కుంటోంది. తాము ప్రపంచంలో ఏ మూలకయినా వెళ్లగల మన్న ధీమా వ్యక్తం చేసింది. కానీ తమ శక్తినేవిూ తక్కువ వేయద్దని తైవాన్‌ జలసంధి సవిూపంలో ని దేశాలూ బాంబుల మోతలతో, మిసైళ్ళ శబ్దాలతో హోరెత్తి పోతున్నాయి. చైనాది కేవలం తాటాకుల శబ్దం తప్ప వాస్త వానికి యుద్ధం చేసే సత్తా చైనాకు లేదని అమెరికా రక్షణ నిపుణుల సమాచారం. ఇదిలా ఉండగా, తైవాన్‌ పొరుగుదేశాల అభ్యర్ధన మేరకు అమెరికా రంగంలోకి దిగింది. తైవాన్‌ని ఒంటరి చేయాలనుకుంటే చైనా పొరబడినట్టేనని అమెరికా పార్లమెంటు స్పీకర్‌ నాన్సీ పెలోసీ హెచ్చరించారు. తైవాన్‌కు అంతర్జాతీయం గా అన్ని దేశాల వారూ రాకపోకలు సాగించేందుకు స్వాతంత్య్రం ఉందనీ, దానిని ఎవరూ అడ్డగించలేరని ఆమె చైనాని దృష్టిలో ఉంచుకుని హెచ్చరించారు. చైనా చర్యలు తైవాన్‌ నూ, దాని పొరుగు దేశాలనూ భయపెట్టే రీతిలో ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటో నీ బ్లింకన్‌ వ్యాఖ్యానించారు. చైనా తన ధోరణిని మార్చు కోకపోతే తదుపరి చర్యలకు తమ దేశం వెనుకాడ బోదని బ్లింకన్‌ హెచ్చరించారు. తైవాన్‌ ఎల్ల కాలం తమ దేశంపై ఆధారపడి ఉండాలని చైనా కోరు కుంటోంది. ఒకప్పుడు చైనా విూద ఆధారపడినా తైవాన్‌ ఇప్పుడు అనేక విషయాల్లో చైనాను మించి పోతుండటమే చైనాకు మింగుడు పడటం లేదు. మరోవంక హాంకాంగ్‌ విషయంలోనూ చైనా ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నది.ఈ రెండూ తమ అంతర్భాగాలేనని, తమ ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలని చైనా ఆకాంక్షిస్తున్నది. అందుకే చైనా వైఖరిని ప్రపంచంలోని పలు దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. రష్యాది కూడా ఇదే తంతు. ఉక్రె యిన్‌ ఒక నాడు సోవియట్‌ రష్యాలో అంతర్భాగమైన మాట నిజమే కావచ్చు, కానీ, సోవియట్‌ యూనియన్‌ కకా వికలైన తర్వాత అజర్‌బైజా న్‌ వంటి ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా మనుగడ సాగి స్తున్నప్పుడు ఉక్రె యిన్‌ని తొక్కి పట్టాలన్న ఆధిపత్య ధోరణిని రష్యా ప్రదర్శిస్తున్నట్టే, తైవాన్‌ని తొక్కి పట్టి ఉంచాలని చైనా చూస్తోంది. తైవాన్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేరకుండా చైనా అడ్డుకునే ప్రయత్నం చేసిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లో చేరలేకపోవడం వల్ల తమ దేశం కరోనా సమయంలో ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్‌లు, మందులను తెప్పించు కోలేకపోయిందని తైవాన్‌ అధ్యక్షురాలు త్సై లింగ్‌ వెన్‌ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *