అప్పుల లెక్కలపై మాటాల మంటలు

న్యూఢల్లీి, జూలై 30, (న్యూస్‌ పల్స్‌)
కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు మాటలు ఆసక్తిని రేపుతున్నాయి. అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాలను నిందిస్తుంటే.. గురివింద గింజ సామెతలా ఉంది కేంద్రం తీరు అంటూ రాష్ట్రాలు నిప్పులు చెరుగుతున్నాయి. అప్పుల విషయంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య నడుస్తున్న రగడ నేను చవటనే కానీ నాకంటే విూరు మరింత పెద్ద చవట అని పరస్పర నిందన యుద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం రాష్ట్రాల అప్పులను ప్రశ్నిస్తుంటే.. మా సంగతి సరే విూ సంగతేంటని రాష్ట్రాలు కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. విూరు అప్పులు ఎక్కువ చేశారంటే విూరు ఎక్కువ అప్పులు చేశారంటూ పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రజలు దొందూ దొందే అనుకుని పరిస్థితి కల్పించారు. అప్పుల తగాదాలోకి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలాగూ చేరవు. అలా చేరాల్సిన అవసరమూ వాటికి లేదు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలున్న చోట ఆయా రాష్ట్రాల నిబంధనల ఉల్లంఘనను, అప్పుల అరాచకాన్ని కేంద్రం ఎత్తి చూపుతుంటే… అప్పుల విషయంలో కేంద్రం చిల్లులను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిగ్గు తేలుస్తున్నాయి. రగడలో రాష్ట్రాల తప్పిదాల కంటే కేంద్రం తప్పిదమే ఎక్కువ ఉందని పరిశీలకులు ఖరాఖండీగా చెప్పేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రాల అప్పులకు కేంద్రం అనుమతి ఉండాలి. నిబంధనలకు మించి ఒక్క రూపాయిఎక్కువ అప్పు చేయాలన్నా గ్రీన్‌ సిగ్నల్‌ఇవ్వాలి. ఇంత కాలం గుట్టు చప్పుడు కాకుండా కేంద్రం, రాష్ట్రాలు ఇష్టారీతిన అప్పులు చేసేసి తీరా చేతులు కాలక తప్పదన్న పరిస్థితి వచ్చే సరికి ఆకుల కోసం వెదుక్కుంటున్నాయి. శ్రీలంక పరణామలు సంభవించి ఉండక పోతే కేంద్రం, రాష్ట్రాలూ కూడా తోడు దొంగల్లా అప్పు భారతీయాన్ని అలా కొనసాగిస్తూనే ఉండేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అప్పులపై పార్లమెంటు వేదికగా కేంద్రం ప్రకటన చేసిన రోజునే.. ఏపీకి పెద్ద మొత్తంలో అప్పుకు అనుమతించడమే నిదర్శనంగా పరిశీలకులు చూపిస్తున్నారు. నిజమే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఎఫ్‌ ఆర్‌ఎంబి( ఫెనాన్స్‌ రెస్బాన్స్‌ బులిటీ` బడ్జెట్‌ మేనేజ్‌ మెంట్‌)ను మించి అప్పులు చేశాయి. విచ్చల విడిగా ఆర్థిక క్రమశిక్షణకు తిలోదకాలిచ్చి మరీ ఉచిత హావిూలు నెరవేర్చి తదుపరి ఎన్నికలలో విజయానికి పెట్టుబడిగా ఉపయోగించేశాయి.కానీ ఆ రాష్ట్రాలు అలా చేయడానికి కారణం కేంద్రం చూసీ చూడనట్లు వ్యవహరించడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేంద్రం, రాష్ట్రాలూ రెండూ కారణమేనని వారు వివరిస్తున్నారు. ఇంత కాలం కేంద్రం, రాష్ట్రాలూ కూడా తేలుకుట్టిన దొంగల్లా అప్పుల విచ్చలవిడితనంపై మౌనంగా ఉండి.. శ్రీలంక సంఘటనలతో ఒక్కసారి ఉలిక్కిపడి తప్పు విూదంటే విూదని తప్పించుకునేందుకు చేసే ప్రయత్నమే ఈ పంచాయతీ అని విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి పరిమితిని మించి అప్పులు చేశాశాయంటే కేంద్రం, ఆర్బీఐ ఎత్తి చూపిన రాష్ట్రాలలో దాదాపు అన్నీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలే కావడం వెనుక ఉన్నది రాజకీయ కారణమే తప్ప మరొకటి కాదనడంలో సందేహాలకు తావులేదని వాస్తవమే అయినా.. ఆయా రాష్ట్రాలు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయనడంలోనూ, అందుకు పరిమితికి మించిన అప్పులే కారణమనడంలోనూ ఎటువంటి సందేహమూ లేదు. రాష్ట్రాల పరిస్థితి ఎలా తయారైందంటే.. చేసిన అప్పులు తీర్చడం మాట అటుంచి వాటికి వడ్డీలు కట్టడానికే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది రాష్ట్రం పరిస్థితి అయితే కేంద్రం ఏం తక్కువ తినలేదు. ఈ సంగతీ తమను వేలెత్తి చూపిన కేంద్రంపై రాష్ట్రాలు ప్రతి విమర్శలు చేయడంతోనే బయట పడిరది.కేంద్రం రుణాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్ల చేతనే ఇంత కాలం కేంద్రం రాష్ట్రాల అప్పులపై నోరెత్తలేదు. అలాగే కేంద్రం రుణాలపై రాష్ట్రాలు నోరెత్త లేదు. ఇప్పుడైనా కేంద్రం, రాష్ట్రాల బండారం బయటపడటానికి శ్రీలంక పరిణామాలే కారణం అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందో జనాలకు వెల్లడయ్యేందుకు కారణమైన శ్రీలంకకు ప్రజలు ధ్యాంక్స్‌ చెప్పుకోవాలి.కేంద్రం అప్పులూ దేశాన్ని దివాళా దిశగా తీసుకు వెళ్లేలాగే ఉన్నాయనడానికి ఆ అప్పులు దేశ స్థూల జాతీయోత్పత్తిలో 60 శాతానికి మించిపోవడమే తార్కానం. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వకుండా కేంద్రం తన ఖాతాలోనే జమ వేసుకుంటూ రాష్ట్రాలు ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోవడానికి పరోక్షంగా కేంద్రమే కారణమైంది. అవి చాలవన్నట్లు విదేశీ బాండ్ల రూపంలో అప్పుల సేకరణ లేదా సవిూకరణకు కేంద్రం తెరతీసింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వేగవంతం చేసింది.ఇవన్నీదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా సంక్షోభం దిశగా పయనిస్తున్నదనడాకి తార్కానాలు. ఇంత పంచాయతీ జరుగుతున్నా కేంద్రం, కానీ రాష్ట్రాలు కానీ అప్పులను నియంత్రించుకుని పొదుపు పాటించాలని భావించడం లేదు. వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అటు కేంద్రం.. ఇటు రాష్ట్రాలూ కూడా జనాలకు నగదు పంపిణీయే పెట్టుబడి అని భావిస్తున్నాయి. దేశం మరో శ్రీలంక అయినా వాటికి పట్టింపు లేదు. అధికారం చేజిక్కించుకుంటే చాలు అన్న ధోరణిలోనే ఉన్నాయి. ఒక చేత్తో ఉచితాల పేరున ప్రజలకు పంపిణీ చేస్తున్న ప్రభుత్వాలే మరో వైపునుంచి జనం నుంచి పన్నుల రూపంలో రెండు చేతులా పిండేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *