ఏపీ, తెలంగాణ నేతల కాపీ ట్వీట్లు

ఇప్పుడు రాజకీయ నేతలందరూ తాము ఏం చెప్పాలనుకుంటున్నారో సోషల్‌ విూడియా ద్వారా చెబుతున్నారు. రాజకీయంగా ప్రకటనలే కాదు.. ఎవరకైనా శుభాకాంక్షలు చెప్పాలన్నా సోషల్‌ విూడియానే ఉపయోగిస్తున్నారు. టెన్త్‌ పరీక్షల ప్రారంభం సందర్భంగా రాజకీయ నేతలు విద్యార్థులను విష్‌ చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఇప్పుడీ ట్వీట్లు సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ట్రోలింగ్‌ కంటెంట్‌ ఏవిూ లేదు. కానీ అందరూ ఇదేమి చోద్యం అనుకుంటున్నారు. ఎందుకంటే ..సేమ్‌ టు సేమ్‌ పదాలతో ప్రముఖ నేతలందరూ ట్వీట్‌ చేయడం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటగా విద్యార్థులకు శుభాకాంక్షలు చె?బతూ ట్వీట్‌ చేశారు. తర్వాత చాలా మంది టీఆర్‌ఎస్‌ నేతలు సేమ్‌ టెక్ట్స్‌తో ట్వీట్‌ చేశారు. దీంతో అందరూ ఒకటే ఎలా చేశారబ్బా అని అనుకోవడం నెటిజన్ల వంతు అయింది. ఒక్క టీఆర్‌ఎస్‌ నేతలే కాదు చివరికి ఆంధ్రప్రదేశ్‌ నేతలు కూడా అదే ట్వీట్‌ టెక్ట్స్‌ తో ట్వీట్లు ప్రారంభించారు. ఏపీ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ సహా చాలా మంది ట్వీట్లు చేశారు. అయితే వీరు శుభాకాంక్షలు.. ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది తెలంగాణ విద్యార్థులకు కాదు. ఏపీ విద్యార్థులకు. ఎందుకంటే ఏపీలోనూ టెన్త్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభమయ్యాయి.ఇలా అందరూ ఒకే టెక్ట్స్‌ తో ట్వీట్స్‌ పెట్టడంపై నెటిజన్లలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా రాజకీయ నేతలు తమ ట్విట్టర్‌ అకౌంట్లను తాము నిర్వహించరు. వాటి కోసం ప్రత్యేకమైన ఏజెన్సీలను నియమించుకుంటారు. ఎలాంటి ట్వీట్లు పెట్టాలన్నది చెబితే వారు పెడతారు. ఇలాంటి ట్విట్టర్‌ అకౌంట్లు నిర్వహించే ఏజెన్సీలు ఇప్పుడు చాలా పుట్టుకు వచ్చాయి. కానీ ఎక్కువ మంది నేతల అకౌంట్లను మెయిన్‌ టెయిన్‌ చేసేది ఐ ప్యాక్‌ అనే ప్రచారం ఉంది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నేతలకు.. ఏపీలో వైసీపీకి ఐప్యాక్‌ సోషల్‌ విూడియా సర్వీస్‌ అందిస్తోంది. ఆయా పార్టీల నేతల ట్విట్టర్‌ అకౌంట్లు కూడా ఆ సంస్థనే మేనేజ్‌ చేస్తున్నట్లుగా తెలు?సతోంది. ఆ టీంకు చెందినవారే… బహుశా ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తో పాటు ఇతర బీఆర్‌ఎస్‌, వైసీపీ నేతలకు సోషల్‌ విూడియా అకౌంట్లను హ్యాండిల్‌ చేస్తూ ఉండి ఉండొచ్చు. రెండు చోట్లా పరీక్షలు ఒకే రోజున మొదలవటంతో…. ఆయా పార్టీల నేతల అకౌంట్ల నుంచి ఇదిగో ఇలా అచ్చు గుద్దినట్టు ఒకే మెసేజ్‌ ను పోస్ట్‌ చేసేశారని నెటిజన్లు అంటున్నారు. సోషల్‌ విూడియా యూజర్స్‌ చాలా యాక్టివ్‌ గా ఉంటారు. చిన్న తేడా కనబడినా పూర్వాపరాలు బయటకు తెస్తారు. ఇప్పుడీ ట్వీట్లపై ఇదే చర్చ జరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *