జీతాల కోసం ఉద్యోగుల ఆందోళన

ఏపీలో సవరించిన పిఆర్సీ మేరకు వేతనాలను పెంచకుండా ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోందని ఏపీజేఏసీ అమరావతి నాయకులు ఆరోపించారు. 11వ పిఆర్శీ కవిూషనర్‌ పెంచిన స్కేల్స్‌ అఫ్‌ గ్రేడ్‌ అమలు చేయకపోవడం వల్ల జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, సూపరింటెండెంట్‌ మరియు తత్సమానమైన ఉద్యోగులందరికీ తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల పేరివిజన్‌ కు సంబంధించి 11వ పిఆర్సీ కమిషన్‌ నివేదికలో సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో జిల్లాలలో పనిచేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్‌లకు ఆర్దికనష్టం జరుగుతుందని చెబుతున్నారు. 2018 తర్వాత చేరిన ఉద్యోగులకు తీవ్ర ఆర్ధిక నష్టం జరుగుతుందని, ఉద్యోగులకు అన్యాయం జరిగి నాలుగేళ్లు అవుతున్నా, వాటిని సంబందిత శాఖలకు చెందిన అధికారులు అమలు చేయనప్పుడు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వాటిని అమలు చేయించాల్సిన బాద్యత ప్రభుత్వనికి లేదా అని ప్రశ్నిస్తున్నారు.పీఆర్‌సీ అమలులో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఏప్రిల్‌ 17 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఐకాస నిర్ణయించింది.ఈ మేరకు విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇవ్వాలని ఇంజినీర్స్‌ భవన్‌లో నిర్వహించిన ఐకాస సమావేశంలో తీర్మానించారు.విద్యుత్‌ ఉద్యోగులకు వేతన సవరణ ఒప్పందంపై బుధవారం మధ్యాహ్నం అన్ని సంఘాల నేతలతో విద్యుత్‌ సంస్థల సీఎండీలు దేవులపల్లి ప్రభాకరరావు, రఘుమారెడ్డి చర్చలు జరిపారు. విద్యుత్‌ సంస్థలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున వేతనాలను 6 శాతం మాత్రమే పెంచగలమని సీఎండీలు స్పష్టం చేశారు. వేతన సవరణపై నియమించిన కమిటీ 5 శాతం పెంపును మాత్రమే సిఫార్సు చేసినట్లు తెలిపారు.తాము కోరినట్లుగా 30 శాతం పెంచాల్సిందేనని ఐకాస నేతలు డిమాండ్‌ చేశారు. 6 శాతానికి మించి పెంచలేమని యాజమాన్యాలు స్పష్టం చేయడంతో చర్చలు విఫలమయ్యాయి. అనంతరం ఐకాస నేతలు సమావేశమై తదుపరి కార్యక్రమాలపై చర్చించారు. సమ్మె నోటీసును సీఎండీలకు అందజేస్తామని ఐకాస ఛైర్మన్‌ సాయిబాబు, కన్వీనర్‌ రత్నాకర్‌రావు, నేతలు శ్రీధర్‌, బీసీరెడ్డి, సదానందం తదితరులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి వేతన సవరణ చేయాల్సి ఉందని, ఏడాది పాటు ఓపిక పట్టామని, ఇక సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *