రాంబాబు… నాగబాబు మధ్యలో గణేష్‌….

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, జనసేన నేత కొణిదెల నాగబాబు మధ్య ట్విట్టర్‌ వేదికగా ప్రాసలతో విమర్శలు పడుతున్నాయి. పంచ్‌ లు పేలుతున్నాయి. వీరి మధ్యలో అంబటిపై నటుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్‌, జనసేన శ్రేణులు, పవన్‌ ఫ్యాన్స్‌. వీరంతా తమ శైలిలో ట్వీట్ల వార్‌ రసవత్తరంగా కొనసాగిస్తున్నారు. సోషల్‌ విూడియా వేదికగా పోస్టులు, సెటైర్లతో ఏపీలో పొలిటికల్‌ హీట్‌ ను ఒక్కసారిగా పెంచేశారు. ఈ వార్‌ ప్రారంభించింది మంత్రి అంబటి రాంబాబు. వివాదానికి మూల కారణం చేనేత చాలెంజ్‌.చేనేత వస్త్రం ధరించి, ఫొటో పోస్ట్‌ చేయాలని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ చాలెంజ్‌ విసిరారు. ఆ చాలెంజ్‌ ను స్వీకరించిన పవన్‌ కళ్యాణ్‌ అదే చాలెంజ్‌ ను టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడికి మరో ఇద్దరికి విసిరారు. దీంతో తెర విూదకి వచ్చిన మంత్రి అంబటి.. ‘పవన్‌ కళ్యాణ్‌ 175 స్థానాల్లో పోటీ చేస్తారా? లేదా?’ అంటూ సెటైర్‌ వేయడంతో ట్వీట్ల వార్‌ స్టార్ట్‌ అయింది. అంబటి ట్వీట్‌ కు స్పందించిన జనసేన నేత నాగబాబు.. రాంబాబు మార్ఫింగ్‌ ఫొటోతో జవాబు ఇచ్చారు.దీనిపై స్పందించిన అంబటి ‘బాగా ఖాళీగా ఉన్నట్లున్నారు’ అంటూ నాగబాబుపై రీ ట్వీట్‌ చేయడం గమనార్హం. ‘పవన్‌ కళ్యాణ్‌ గారూ.. కాటన్‌ దుస్తులు చాలెంజ్‌ ఆపి ఇంతకీ 175 సీట్లలో పోటీ చేస్తున్నారా లేదా, ఇండిపెండెన్స్‌ డే రోజునైనా ప్రకటించండి’ అని అంబటి రాంబాబు చేసిన ట్వీట్‌ కు మార్ఫింగ్‌ ఫొటోతో నాగబాబు దీటుగా జవాబు ఇచ్చారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ను తన దేవుడిగా చెప్పుకునే సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా కౌంటర్‌ ఇచ్చారు. ‘అలాగే రంభల రాంబాబుగారు.. మా సారు త్వరలో విూకు సమాధానం చెబుతారు.. జై పవన్‌ కళ్యాణ్‌’ అంటూ కౌంటర్‌ ట్వీట్‌ చేశారు.మంత్రి అంబటి సెటైర్‌ కి జనసేన నేత నాగబాబు ఊహించని స్థాయిలో రీ ట్వీట్‌ చేశారు. ‘ఎన్నిసార్లు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా! బాబూ.. ఓ రాంబాబు.. జంబో సర్కస్‌ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్‌ కి, వైసీపీ సర్కస్‌ లో నీ లాంటి బఫూన్‌ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్‌ కి సమాధానం చెప్పే ఓపిక, తీరిక మా జనసైనికులకు గానీ, పవన్‌ కళ్యాణ్‌ కు గానీ లేదు’ అని ట్వీట్‌ చేస్తూ.. అంబటి ఫొటోను మార్ఫింగ్‌ చేసి, జతచేశారు. నాగబాబు రీ ట్వీట్‌ పై మళ్లీ అంబటి మరో సెటైర్‌ వేస్తూ.. ‘భలే ఓరండీ నాగబాబుగారు, ఎంత ఓపిగ్గా, ఎంత తీరిగ్గా నా బొమ్మేశారండి.. ఖాళీగా ఉన్నట్లున్నారు.. ధన్మవాదాలు’ అంటూ రీ ట్వీట్‌ చేయడం గమనార్హం.ఆపైన అంబటి రాంబాబుపై పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. ‘జై జనసేన.. జైజై పవన్‌ కళ్యాణ్‌.. బాబు ఓ రాంబాబు విూ బుద్ధి మారుదు రాంబాబు’ అంటూ ఓ అభిమాని అంబటిని ఏసుకున్నాడు. ‘నీలాంటి పాలేరు గాడికి సమాధానం చెప్పాలేంట్రా రంభల రాంబాబు’ అని మరో ఫ్యాన్‌ కౌంటర్‌ వేశాడు. ‘రాసలీలల రాంబాబు’ అని ఒకరు, ‘పాలేరు రాంబాబు’ అంటూ ఇంకొకరు, ‘గుడివెనుక నాసామి రాంబాబు’ అంటూ మరో అభిమాని అంబటి రాంబాబుపై విరుచుకుపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *