ఈ రోజు కూడా మ్యాచ్ రద్దయితే ఏం చేస్తారు?

ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 (IPL 2023) తుది అంకానికి చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (CSKvsGT) జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ వర్షం (Rain) కారణంగా రద్దయింది. కనీసం ఐదేసి ఓవర్ల చొప్పున అయినా ఆడించి విజేతను ప్రకటించాలని ఐపీఎల్ యాజమాన్యం భావించింది. అయితే వర్షం ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో వేలాదిగా స్టేడియంకు తరలివచ్చిన ప్రేక్షకులు నిరాశగా వెనుదిరిగారు.

ఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే (IPL 2023 Final Match) ఉండడంతో ఈ రోజు (సోమవారం) మ్యాచ్ జరగనుంది. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ రోజు కూడా అహ్మదాబాద్‌లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగేదీ, లేనిదీ అనుమానాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే పరిస్థితి ఏంటనే అనుమానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *