నెల్లూరు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

నెల్లూరు, జూలై 1
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు చాలా నెలల సమయం ఉంది.. అయినప్పటికీ.. ప్రాధాన పార్టీలు తగ్గేదేలే అంటూ.. ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభించాయి. ఓ వైపు అధికార పార్టీ వైసీపీ, మరోవైపు టీడీపీ, జనసేన ఇప్పటినుంచే ప్రజలకు చేరువయ్యేందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు.. నెల్లూరు రాజకీయాలను మరింత హీటెక్కించింది. నెల్లూరు సిటీలో పోటీకి మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సవాళ్లు.. ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ ప్రతిసవాళ్లు.. ఇలా వారం నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. వీరిద్దరి హాట్‌ కామెంట్ల మధ్య టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించింది. నెల్లురు సిటీ నుంచి పొంగూరు నారాయణ పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. గత ఎన్నికల్లోనూ అనిల్‌ కుమార్‌ ? నారాయణ పోటీపడ్డారు. ఈ పోటీలో అనిల్‌ గెలుపొందారు. ఈసారి.. అంటే 2024 ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరి మధ్యే హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది.ఈ మధ్యే నెల్లూరు సిటీ నుంచి ఆనం రాంనారాయణ పోటీ చేయాలని అనిల్‌ కుమార్‌ సవాల్‌ విసిరారు. ఈ కామెంట్లపై స్పందించిన ఆనం.. అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడినుంచైన పోటీకి రెడీ అంటూ అనిల్‌ కు కౌంటర్‌ ఇచ్చారు. మరో వైపు నెల్లూరు జిల్లా వైఎస్‌ఆర్సీపీలో అసమ్మతి చెలరేగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టిపోటీ ఇచ్చేలా కసరత్తు సాగిస్తోంది. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీల నియామకాలపై దృష్టి సారించింది. కీలకమైన నెల్లూరు సిటీ నియోజకవర్గానికి తాజాగా ఇన్‌ఛార్జీని నియమించింది. మాజీ మంత్రి పొంగూరు నారాయణకు నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించింది టీడీపీ. ఈ మేరకు పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జిగా నారాయణను నియమిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి ఘన విజయాలను సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీధర కృష్ణారెడ్డిని సుమారు 19 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు. 2019లో పొంగూరు నారాయణపై 1,988 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఏపీకి మరో తీపి కబురు చెప్పిన కేంద్రం` 19 రాష్ట్రాలకు నిధులు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన నారాయణకే మరోసారి అవకాశాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్రత్యక్ష ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినప్పటికీ.. అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు గట్టి పోటీ ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ మరోసారి నారాయణనే నమ్ముకుంది. ఈ నియోజకవర్గంలో వై?ఎస్‌ఆర్సీపీకి గట్టిపోటీ ఇచ్చే నాయకుడు మరొకరు లేకపోవడం, ఆర్థికంగా బలవంతుడు కావడం వల్ల నారాయణకే అవకాశం ఇచ్చింది. నిజానికి` ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైఎస్‌ఆర్సీపీ రెబెల్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి భావిస్తోన్నారు. 1983లో ఇదే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. మళ్లీ ఎప్పుడూ నెల్లూరు సిటీ సీటు గడప తొక్కలేదు. టీడీపీ ద్వారా ఆ కొరతను తీర్చుకోవాలని భావించినప్పటికీ..సాధ్యపడలేదు. టీడీపీలో చేరుతారా? లేదా? అనేది కూడా ఇప్పుడు అనుమానమేఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం అభ్యర్థిని ప్రకటించడం నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు రెండు రోజుల్లో నెల్లూరులోకి ప్రవేశించనుంది లోకేష్‌ యువగళం యాత్ర. దీంతో రాజకీయ సమరం మరింత వేడెక్కబోతుంది.
శ్రీధర్‌ రెడ్డి, నారాయణ కాంబినేషన్‌..
2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తుండగా, రూరల్‌ నుంచి దాదాపుగా కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఖరారైనట్టే లెక్క. ఈ ఇద్దరి కాంబినేషన్‌ నెల్లూరులో టీడీపీకి విజయం సాధించి పెడుతుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరూ ఈసారి కలసి పనిచేయబోతున్నారు. గతంలో నారాయణ ఓటమికోసం నెల్లూరు సిటీలో కూడా తన వ్యూహాలు అమలు చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇప్పుడు ఆయన గెలుపుకోసం కృషిచేయబోతున్నారు. అందులోనూ కోటంరెడ్డి వైసీపీని వీడి బయటకొచ్చాక… అనిల్‌ వర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్‌ పై బదులు తీర్చుకోవాలంటే అక్కడ నారాయణ గెలిచి తీరాలి. అందుకే కోటంరెడ్డి టీమ్‌ కూడా నారాయణకు ఫుల్‌ సపోర్ట్‌ చేయబోతోంది. సిటీలో తనకున్న పలుకుబడి ఉపయోగించి నారాయణ గెలుపుకోసం కోటంరెడ్డి ప్రయత్నాలు చేయబోతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణకు మంచి సంబంధాలున్నాయి. గత ఎన్నికల సమయంలో నెల్లూరు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వాటర్‌ పైప్‌ లైన్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. వాటి వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ రోడ్లు పగలగొట్టి పనులు మొదలు పెట్టడంతో.. ప్రజలు అవస్థలు పడ్డారు. ఆ అవస్థలన్నీ ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో నారాయణకు వ్యతిరేకంగా మారాయి. ఈసారి అనిల్‌ కి అలాంటి అభివృద్ధి పనులే ఆటంకంగా మారే అవకాశముంది. నెల్లూరు నగరంలో మొదలు పెట్టిన ఫ్లైఓవర్‌, ఇతర అభివృద్ధి పనులు పూర్తి కాలేదు. దీంతో అనిల్‌ పై ఆ వ్యతిరేకత కనిపించే అవకాశముందని తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *