8 నెలల్లో 1,739 విదేశీయులకు భారత పౌరసత్వం

న్యూఢల్లీి, అక్టోబరు 9
గత ఏడాది 1,739 మంది విదేశీయులకు భారత పౌరసత్వం ఇచ్చినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. ఏప్రిల్‌ 1, 2022 నుంచి డిసెంబర్‌ 31, 2022 వరకు తొమ్మిది రాష్ట్రాలు, 31 జిల్లాల్లో విదేశీయులకు పౌరసత్వం మంజూరు చేసినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది. సీఏఏ చట్టం కింద వీరందరికి పౌరసత్వం ఇచ్చామంది. మొత్తం 1739 మందికి పౌరసత్వం ఇవ్వగా.. ఇందులో 1386 మందికి సెక్షన్‌ 5 కింద పౌరసత్వం ఇచ్చామని, మిగతా 353 మందికి పౌరసత్వ చట్టం`1955 సెక్షన్‌ 6 ద్వారా పౌరసత్వం ఇచ్చినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్‌ 8(2) ప్రకారం భారతీయ పౌరసత్వం పునరుద్ధరించేందుకు దరఖాస్తుల ప్రాసెసింగ్‌ కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ ను డిసెంబర్‌8, 2022న ప్రారంభించారు. పౌరసత్వ దరఖాస్తులు అక్టోబర్‌ 15, 2019న పూర్తిగా పేపర్‌లెస్‌ గా మార్చినట్లు.. ఎండ్‌ టు ఎండ్‌ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్‌గానే జరుగుతున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడిరచింది.పౌరసత్వ సవరణ చట్టాన్ని(అంం)`2019.. డిసెంబర్‌ 12, 2019న నోటిఫై చేశారు. జనవరి 10, 2020 నుంచి అమల్లోకి వచ్చింది. డిసెంబర్‌ 31, 2014లోగా భారత్‌ కు వలస వచ్చిన, పాకిస్థాన్‌, అప్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ దేశాలకు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు ఈ చట్టం వర్తిస్తుంది. తమ దేశాల్లో మతపరమైన వేధింపులకు గురైన వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు. ఇతర దేశాలకు చెందిన వారికి, ఈ మూడు దేశాలు సహా, ఏ దేశం నుంచైన వలస వచ్చిన ముస్లింలకు ఈ చట్టం వర్తించదు. భారత్‌ లో ఆశ్రయం పొందిన విదేశీయులకు 11 ఏళ్లు దాటితే పౌరసత్వం ఇచ్చేవారు. వీరి విషయంలో దాన్ని ఐదేళ్లకు తగ్గించారు. పౌరసత్వ సవరణ చట్టం భారతీయులకు వర్తించదు. భారతీయులు తమ పౌరసత్వం కోల్పోవడం కోసం ఈ చట్టం చేయలేదు. పొరుగున ఉన్న మూడు దేశాల్లో మతపరంగా హింసను ఎదుర్కొంటున్న కొందరికి భారత పౌరసత్వం ఇవ్వడం కోసమే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని (అంం) రూపొందించారు.ఈశాన్య ప్రాంతంలోని గిరిజన, ఆదివాసీలకు రక్షణ కల్పించేందుకు రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌ లో ప్రత్యేక నిబంధనలు రూపొందంచారు. సీఏఏ రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌ లోని ప్రాంతాలను, బెంగాల్‌ ఈస్టర్న్‌ ఫ్రాంటియర్‌ రెగ్యులేషన్‌ కింద ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ సిస్టమ్‌ పరిధిలోకి వచ్చే ప్రాంతాలను మినహాయించింది. దీని వల్ల ఈశాన్య రాష్ట్రాల స్థానిక జనాభాకు రాజ్యాంగం మంజూరు చేసిన రక్షణను సీఏఏ ప్రభావితం చేయదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *