చనిపోతున్నకోళ్లు… కొండెక్కిన చికెన్‌

వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల చికెన్‌ ధరలు ఆకాశాన్నంటున్నాయి. ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు పడగా.. గత వారం రోజులుగా ఎండలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. వాతావరణంలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల కోళ్లు మృత్యువాత పడుతుండటంతో.. దీని ప్రభావం చికెన్‌ ధరలపై పడుతుందికేవలం నెల రోజుల వ్యవధిలోనే చికెన్‌ ధరలు బాగా పెరిగాయి. ఏప్రిల్‌ 1న కేజీ చికెన్‌ ధర రూ.154 ఉండగా.. ఇప్పుడు రూ.200కిపైగా చేరుకుంది. శుక్రవారం మార్కెట్‌లో స్కిన్‌తో కూడిన చికెన్‌ ధర కేజీ రూ.213 ఉంది. ఇక స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర నెల క్రితం కేజీ రూ.175 ఉండగా.. ఇప్పుడు రూ. 243కు చేరుకుంది. ఏప్రిల్‌ 1న రూ.84గా ఉన్న ఫామ్‌ చికెన్‌.. గురువారం నాటికి రూ.125కు పెరిగింది.స్కిన్‌తో కూడిన చికెన్‌ ధర ఏప్రిల్‌ 1న రూ.154, ఏప్రిల్‌ 15న రూ.175, మే 1న రూ.186 ఉండగా.. మే 18 నాటికి రూ.213కి పెరిగింది. ఇక స్కిన్‌లెన్‌ చికెన్‌ కేజీ ధర ఏప్రిల్‌ 1న రూ.175, ఏప్రిల్‌ 15న రూ.200, మే 1న రూ.211, మే 18న రూ.243గా ఉంది. ఫామ్‌ చికెన్‌ ధర ఏప్రిల్‌ 1న రూ.84, ఏప్రిల్‌ 15న రూ.95, మే1వ తేదీన రూ.106 ఉండగా.. మే 18వ తేదీకి రూ.124కి చేరుకుంది. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల కోడిపిల్లల్లో 40 నుంచి 60 శాతం మరణాలు జరుగుతున్నాయని, చికెన్‌ ధరలు పెరగడానికి ఇదే కారణమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. కోళ్ల ఫీడ్‌, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయని, ధరలు పెరగడానికి అది కూడా ఒక కారణమని చెబుతున్నాయి. ప్రతి ఏడాది కూడా వేసవిలో చికెన్‌ ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుందని అంటున్నారు.చికెన్‌ ధరలు క్రమక్రమంగా పెరుగుతుండటం నాన్‌ వెజ్‌ ప్రియులకు మింగుడుపడటం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు.. చికెన్‌ షాపుల ముందు నాన్‌వెజ్‌ ప్రియులు క్యూ కడతారు. మిగతా రోజుల్లో కూడా నాన్‌ వెజ్‌ విక్రయాలు భారీగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చికెన్‌ ధరలు భారీగా పెరగడంతో కొంతమంది తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తోన్నారు. రేట్లు భారీగా ఉండటంతో కొంతమంది సామాన్యులు కొనుగోలు చేసేందుకు కూ?డా వెనకడుగు వేస్తోన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *