తెగే దాకా లాగుతున్నారా…

దాదాపు నెల రోజులుగా ఢల్లీిలోని జంతర్‌మంతర్‌ వద్ద రెజ్లర్ల ఆందోళన కొనసాగుతూనే ఉంది. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన రెజ్లర్లు…ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ…ఇప్పటి వరకూ కేంద్రం దీనిపై స్పందించలేదు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా…అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
భారత దేశ కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడిరచిన రెజ్లర్లు న్యాయం కోసం రోడ్డెక్కారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ధర్నాకు దిగారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకునే వరకు ఇంటికెళ్లేది లేదంటూ పుత్‌ పాత్‌ లపైనే పడుకుంటున్నారు. తమను లైంగికంగా వేధించిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు మరోసారి ధర్నాకు దిగారు. ఢల్లీిలోని జంతర్‌ మంతర్‌?లో న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తొలగించాలని రెజ్లర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఆరోపణలు చేస్తూ గతంలోనూ రెజ్లర్లు ధర్నా చేశారు. దీనిపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని.. బాధితులకు న్యాయం చేస్తామని క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హావిూ కూడా ఇచ్చారు. ఈ ఆరోపణలపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీంతో రెజ్లర్లు శాంతించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రెజ్లర్లు మరోసారి ధర్నాకు దిగారు.
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బ్రిజ్‌ భూషణ్‌ ను అరెస్ట్‌ చేయాలని..అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌…కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారే తప్ప భరోసా అయితే ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు రెజ్లర్లు. మే 9 వ తేదీనే వీళ్లు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్‌లను నెరవేర్చకపోతే తాము మరింత అగ్రెసివ్‌గా పోరాటం చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. ఏప్రిల్‌ 23వ తేదీ నుంచి బజ్‌రంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌తో పాటు గోల్డ్‌ మెడల్‌ సాధించిన వినేష్‌ ఫోగట్‌ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీళ్లకి ప్రతిపక్షాలతో పాటు పలు రైతు సంఘాల మద్దతు కూడా లభించింది. ఇప్పుడు వాళ్ల ఆందోళనల్ని మరింత ఉద్దృతం చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తమ డిమాండ్‌లను వినిపిస్తామని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లోనూ ఒలింపిక్‌ మెడల్స్‌ సాధించిన వారందరి సపోర్ట్‌ కూడగట్టుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిజానికి గత వారమే ఢల్లీి పోలీసులు బ్రిజ్‌ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. అయితే…ఇప్పటి వరకూ కేసు ఇంకా కోర్టుల్లోనే నలుగుతోంది తప్ప తమకు న్యాయం జరగడం లేదని మండి పడుతున్నారు రెజ్లర్లు. ఈ ఏడాది జనవరిలోనూ నిరసనలు చేసిప్పటికీ…ఈ స్థాయిలో మద్దతు లభించలేదు. కానీ ఈ సారి మాత్రం రాజకీయ పార్టీల జోక్యంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వివాదంపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపిస్తామని వెల్లడిరచారు. ‘‘కమిటీ వేయాలన్న డిమాండ్‌ని పరిగణనలోకి తీసుకున్నాం. ప్యానెల్‌ని కూడా నియమించాం. ఇప్పటికే బ్రిజ్‌ భూషణ్‌పై ఢల్లీి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది. ఢల్లీి పోలీసులు పారదర్శకంగానే విచారణ జరుపుతున్నారు’’లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్‌ భూషణ్‌ మరోసారి స్పందించారు. తనపై వచ్చిన ఏ ఆరోపణ నిజమని తేలినా ఉరి వేసుకుని చచ్చిపోతానని వెల్లడిరచారు. అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇన్నేళ్లలో ఏ ఒక్క అమ్మాయిని కూడా తప్పుడు ఉద్దేశంతో చూడలేదని వెల్లడిరచారు. అయితే కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా బ్రిజ్‌ భూషణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారని వినేష్‌ ఫోగట్‌ మండి పడ్డారు. కమిటీ ఏర్పాటు పేరుతో కేసుని పక్కదోవ పట్టించేందుకు కుట్ర చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా పవర్‌ఫుల్‌గా ఉన్న బ్రిజ్‌ భూషణ్‌ని ఎదుర్కోడం కష్టంగా ఉందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అధిరాకాన్ని దుర్వినియోగం చేస్తున్న అలాంటి వ్యక్తితో పోరాటం అంత సులభం కాదని తేల్చి చెప్పారు. అయినా న్యాయం జరిగే వరకూ పోరాడతామని వెల్లడిరచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *