అధికారమే లక్ష్యంగా పార్టీల మార్పు

నిజామాబాద్‌
ఎలక్షన్స్‌ దగ్గర పడటంతో జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి… అధికామే లక్ష్యంగా రాజకీయ నాయకులు గోడ విూద ఫోటోలు మార్చినంత ఈజీగా పార్టీలు మారుస్తున్నారు. పార్టీలో తమకు టికెట్‌ వచ్చె అవకాశాలు లేవని తెలియగానే పార్టీలు మారుతున్నారు. ఎన్నో ఎళ్లుగా పార్టీని నమ్ముకుని సేవలు చేస్తు, జెండాలు మోసిన నాయకులు కొందరైతె, అధికారమే లక్ష్యంగా పనిచేసిన అవకాశవాదులు కొందరు. దీనితో జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

బీఆర్‌ఎస్‌కు దెబ్బ విూద దెబ్బ

బోధన్‌లో బీఆరెస్‌ పార్టీ సీనియర్‌ నేత, తన భార్య మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, కౌన్సిలర్లతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బోధన్‌లో ఎమ్మెల్యే ఆగడాలు, నరకయాతన భరించలేకే పార్టీ వీడుతున్నట్టు శరత్‌రెడ్డి ప్రకటించారు. అర్బన్‌లో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత .. బీఆరెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.. ఈ పరిణామం అర్బన్‌ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రాహుల్‌ గాంధీ నిజామాబాద్‌ పర్యటనను వేదిక చేసుకొని కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనితెలుస్తోంది. అర్బన్‌ టికెట్‌ ఆశించిన విఫలమైన మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆకుల లలిత టికెట్‌ కోసం డిల్లీ లెవెల్‌లో ట్రై చేస్తున్నారని వస్తున్న ప్రచారం నిజమేనని తెలుస్తోంది. దాదాపుగా అర్బన్‌ టికెట్‌ ఆకుల లలితకు కన్‌ఫాం అయినట్టుగా రాజకీయ వర్గాల వినికిడి.
ఎమ్మెల్సీ కవిత ఇన్చార్జిగా ఉన్న రెండు నియోజకవర్గాల్లో ఒకేసారి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జరగబోయే ప్రమాదాన్ని ముందే గ్రహించినా ఇటు కవిత గానీ, అటు అధిష్టానం గానీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు, బుజ్జగింపు చర్యలు తీసుకోకపోవడం బీఆరెస్‌ పార్టీ ఈ కీలక సమయంలో మరింత నష్టపోయేలా చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

క్రమంగా పుంజుకుంటున్న బిజెపి

ఇటు బీఆర్‌ఎస్‌ అటు కాంగ్రెస్‌ వారివారి సవిూకరణాలలో బిజీగా ఉంటే బీజేపీ మాత్రం తన పనిని చకచక కానిచ్చెస్తోంది. ఇప్పటికే నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ధన్‌పాల్‌ సూర్యనారాయణకు దాదాపు కన్‌ఫామ్‌గా భావించడంతో… చాపకింద నీరులా బిజెపి ప్రచారంలో దూసుకుపోతోంది. ధన్‌పాల్‌ సూర్యనారాయణ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికి సమాజంలోని అన్ని వర్గాలకు అతను సుపరిచితుడు.
రాజకీయాలకు అతీతంగా అతను చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా నియోజక వర్గంలోని ప్రజలు ముఖ్యంగా యువత అతని వెంట ఉన్నట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఎంపి అరవింద్‌ సహకారం దాంతో పాటు ఇటీవల ప్రకటించిన పసుపు బోర్డ్‌, మోడీ నిర్వహించిన బహిరంగ సభ బిజెపి యొక్క విజయావకాశాలనను మెరుగుపరిచే అంశాలని చెప్పుకోవచ్చు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలో కూడా బిజెపి నాయకులు ప్రచారంలో ముందున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌లలో ప్రకటించక పోవడంతో కొంత గందరగోల పరిస్థితులు నెలకొన్నప్పటికి మిగతా చోట్ల ప్రచారంలో పైచేయి గానే ఉన్నట్లు పార్టీ క్యాడర్‌ భావిస్తోంది.

సందిగ్దంలో కాంగ్రెస్‌

జిల్లాలో అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. బోధన్‌ నుంచి మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌ నుంచి వినయ్‌ రెడ్డి, బాల్కొండ నుంచి సునీల్‌రెడ్డిల పేర్లు డిక్లేర్‌ చేశారు. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌, ఆర్మూర్‌ నుంచి గోర్త రాజేందర్‌కు మొదటి లిస్ట్‌లో స్థానం దక్కలేదు. నిజామాబాద్‌ రూరల్‌లో మండవ వెంకటేశ్వరరావు వస్తాడనే ప్రచారం కొనసాగుతున్నది. అర్బన్‌లో ఆకుల లలితకు ఇస్తే మున్నూరుకాపులకు కొంత ఊరట లభించననున్నది. కానీ ఆకుల లలిత టికెట్‌ పై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు ఓ మైనార్టీ నేత కూడా అర్బన్‌ టికెట్‌ రేసులో కీలకంగా ఉన్నాడు. అయితే అతనికి ఇస్తే బీజేపీ గెలుపు మరింత సులవవుతుందనే సర్వే రిపోర్టుతో అర్బన్‌ బీసీకే ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం యోచిస్తోంది.

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుండి మండవ వెంకటేశ్వర్‌ రావుకి టికట్‌ విషయంలో ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇద్దరు నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, నగేశ్‌ రెడ్డి లు ఇద్దరూ మండవ రాకను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో ఆందోళనలకు దిగారు. ఇస్తే గిస్తే మాలో ఎవరికో ఒకరికి ఇవ్వాలి.. ఈ ఆంధ్ర నాయకుడు మధ్యలో ఎక్కడ్నుంచి వచ్చాడంటూ మండవ సీనియారిటీని, అధిష్టానం నిర్ణయాన్ని చీ కొడుతున్నారు. మొత్తం విూద కాంగ్రెస్‌లో టికెట్‌ విషయంలో ఎప్పటిలాగే అలకలు, నిరసనలు మొదలైనాయి…. వీటన్నింటిని అధిగమించి పార్టీ టికెట్‌ ఎవరికి వస్తాయో వేచిచూడాల్సిందే….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *