2న జనగర్జన…

ఖమ్మం, జూన్‌ 29
హై కమాండ్‌ ఆదేశంతోనే పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర చేస్తున్నారు భట్టి..108 రోజులు 1250 కిలోవిూటర్ల లక్ష్యంగా భట్టి ప్రజలతో మమేకమై నడుస్తున్నారు. జులై 2న ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టడంతో ఆయన పాదయాత్ర ముగుస్తుంది. వైఎస్‌ మహాప్రస్థానంతో భట్టి పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రను పోలుస్తున్న..ఆయన అభిమానులు ముగింపు సభను ఓ రేంజ్‌లో నిర్వహించాలనుకున్నారు. మహాప్రస్థానం ముగింపు సభలాగే భారీయెత్తున జన సవిూకరణ చేసి..రాహుల్‌ను చీఫ్‌ గెస్టుగా పిలిచి..సత్తా చాటాలనుకున్నారు. బట్‌ టోటల్‌ సీన్‌ మారింది. అనుకున్నదొక్కటి అవుతున్నదొక్కటి. బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పేసి చేతిలో చెయ్యి వెయ్యడానికి వస్తున్న పొంగులేటి కూడా..జులై 2నే ముహూర్తం ఫిక్స్‌ చేసుకున్నారు. తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వంద ఎకరాల్లో తెలంగాణ జన గర్జనపేరుతో అతిపెద్ద బహిరంగ సభను నిర్వహించి..తనేంటో తెలంగాణ మొత్తానికి తెలిసేలా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. రాహుల్‌ సమక్షంలో చేరడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.
ఇక్కడే పార్టీ పెద్దలకు ఓ చిక్కొచ్చి పడిరది. అటు భట్టి పార్టీలో సీనియర్‌..పొంగులేటి పొలిటికల్‌గా సీనియర్‌ అయినా..పార్టీకి కొత్తే..కానీ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు ఇద్దరూ అతి ముఖ్యులే..ఎవరి మాట కాదనలేం. తీసెయ్యలేం..అటు పాదయాత్ర ముగింపు సభ, ఇటు పొంగులేటి చేరిక ఒకే రోజు ఉండటంతో..రాహుల్‌ గాంధీ రెండు వేర్వేరు కార్యక్రమాలకు వెళ్లలేరు. పైగా?ఇలా చేయడం వల్ల అటు కేడర్‌, ఇటు పబ్లిక్‌లోకి రాంగ్‌ మెసేజ్‌ వెళ్తుంది. సో..ఇద్దరినీ ఒకే తాటిపైకి తీసుకురావాలని..రెండు కార్యక్రమాలు ఒకే వేదికపై చేయాలని..కాంగ్రెస్‌ స్ట్రాటజీ విూటింగ్‌లో రాహుల్‌ చెప్పారు. ఇందుకు భట్టిని ఒప్పించే బాధ్యతను ఠాక్రే భుజానికెత్తుకున్నారు. మామిళ్లగూడెంలో ఉన్న భట్టి శిబిరానికి వెళ్లారు.. వెంట పొంగులేటినీ తీసుకెళ్లారు. భట్టిని ఒప్పించారు. అంతవరకు తన పాదయాత్ర ముగింపు సభను సొంతంగా ఘనంగా నిర్వహించాలనుకున్న భట్టి..హైకమాండ్‌ఆదేశంతో ఒప్పుకోవాల్సి వచ్చిందిఆ తర్వాత జులై 2న జరిగే సభ విధివిధానాలపై ఠాక్రే, భట్టి, పొంగులేటి చర్చించారు. ఆ సభలో భట్టిని రాహుల్‌ ఘనంగా సన్మానించనున్నారని..అదే సమయంలో..పొంగులేటి చేరిక ఉంటుందని ఠాక్రే చెబుతున్నారు. జులై 2న ఖమ్మంలో అడుగు పెట్టే భట్టి పాదయాత్రకు పొంగులేటి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే..హై కమాండ్‌ మాట విని..ఒకే వేదికపై ముగింపు సభకు భట్టి ఒప్పుకున్నా..ఆయన అభిమానుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తూనే ఉన్నట్లు టాక్‌..
భట్టి లెక్క తప్పిందా
మూడు నాలుగు నెలల నుంచి మండుటెండల్లో భట్టి పాదయాత్ర నిర్వహించి, పార్టీని అధికారంలోకి తేవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు.ఈ సమయంలో భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపుగా ప్రత్యేక సభ ఉండాల్సిందేనని సీనియర్‌ నేతలు పట్టుబడుతున్నారు. భట్టికి మైలేజ్‌ వెళ్లకుండా మమ అనిపిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవర్గం నేతలు మాత్రం పొంగులేటి సభలోనే భట్టిని సన్మానిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. అయితే, భట్టి పాదయాత్ర ముగింపు సభకు రాహుల్‌ లేదా ప్రియాంకగాంధీ హాజరయ్యే ఛాన్స్‌ ఉంది. ఈ విషయంపై నిన్న కాంగ్రెస్‌ స్ట్రాటజీ విూటింగ్‌లో కూడా చర్చ జరిగింది. అదే సమయంలో ఖమ్మంలో భట్టి ముగింపు సభ, పొంగులేటి చేరిక విషయాన్ని కూడా కొందరు సీనియర్‌ నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.ఈ విషయంలో పీపుల్స్‌ మార్చ్‌ వర్సెస్‌ పొంగులేటి చేరికగా రెండు వర్గాలుగా మారిపోయాయి. దాంతో రాహుల్‌ కంప్లయింట్స్‌ వద్దే వద్దు.. పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పండి..గతంలో ఇదే చెప్పాను..విూడియా ముందు పార్టీ ఇంటర్నల్‌ ప్రాబ్లమ్స్‌ మాట్లడొద్దని సీరియస్‌ అయ్యారు. ఏదైనా ఉంటే ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ దగ్గర చెప్పుకోవాలని రాహుల్‌ గట్టిగానే చెప్పినట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *