రైల్వేలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌

ఇంత టెక్నాలజీ ఉంది. ఇంత నెట్‌వర్క్‌ ఉంది. అయినా ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగింది..? ఒడిశా ట్రైన్‌ యాక్సిడెంట్‌పై అందరి చర్చలూ ఇవే. రైల్వే వ్యవస్థలో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని గతంలోనే కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడిరచారు. కానీ…ఇది ఏ స్థాయిలో అమలవుతోందన్నదే అంతు తేలకుండా ఉంది. అయితే…ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ంఎ)తో ప్రమాదాలు నివారించవచ్చా..అన్న డిబేట్‌ కూడా జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో ఓ టెక్నికల్‌ సెమినార్‌కి హాజరైన అశ్వినీ వైష్ణవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేలో భద్రత, ప్రమాణాలు పెంచేందుకు కొత్త సాంకేతికత అందిపుచ్చుకోవాలని అభిప్రాయపడ్డారు. సెంటర్‌ ఆఫ్‌ రైల్వే సిస్టమ్‌ తో పాటు కృత్రి మేధనూ వినియోగించాల్సిన అవసరముందని తేల్చి చెప్పారు. అంతే కాదు. డేటా క్వాంటమ్‌, డేటా అనలిటిక్స్‌ లాంటి టెక్నాలజీల అవసరమూ ఉందని అన్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రైల్వే నెట్‌వర్క్‌లలో ంఎ వాడకం పెరుగుతోంది. ఆ స్థాయి ప్రమాణాలు అందుకోవాలంటే భారత్‌లోనూ ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావాల్సిందే. ఇండియన్‌ రైల్వేస్‌లో ఇప్పటికే ఈ టిక్కెటింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది కొంత వరకూ ప్రయాణికుల కష్టాల్ని తీర్చింది. దీంతో పాటు ఆర్టిఫిషియలన్‌ ఇంటిలిజెన్స్‌ కూడా తోడైతే చాలా విభాగాల్లో అనూహ్య మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. ట్రైన్‌ ఆపరేషన్స్‌, టికెట్‌ బుకింగ్స్‌తో పాటు రైల్వే ప్రాపర్టీస్‌ని కాపాడుకోవడానికి ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుంది. రియల్‌ టైమ్‌ డేటాని అనలైజ్‌ చేయగలిగితే…పాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ లో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ఇప్పటికే కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇండియాలోని ప్రముఖ బిజినెస్‌ స్కూల్‌ హైదరాబాద్‌ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌పై విస్తృతంగా చర్చలు జరుపుతోంది. ఈ టెక్నాలజీలన్నింటికీ కలిపి ఓ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ని నియమించాలన్న ఆలోచనలోనూ ఉంది రైల్వే శాఖ. రోజుకు లక్షలాది మంది దేశం నలుమూలల నుంచి రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఎలాంటి చిన్న ప్రమాదం జరిగినా ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగానే నమోదవుతున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌తో ఈ ప్రమాదాలను నియంత్రించేందుకు అవకాశముంటుంది. అయితే…ఇందుకు డేటా అనలిటిక్స్‌ కీలకంగా మారనుంది. ఈ డేటా అందుబాటులో ఉంటే…ఉన్నత స్థాయి అధికారులంతా రైళ్లు ఎందుకు ఆలస్యంగా నడుస్తున్నాయో తెలుసుకునేందుకు వీలవుతుంది. వీటితో పాటు బిజీ ట్రాక్స్‌ని మెయింటేన్‌ చేసేందుకూ మరింత తోడ్పతుంది. ట్రైన్‌ షెడ్యూల్స్‌ సరిగ్గా ఉంటే…ఆపరేషనల్‌ కాస్ట్‌ కూడా తగ్గిపోతుంది. ఏ రూట్‌లో ఎక్కువగా డిమాండ్‌ ఉంటోంది..? అన్నది తెలుసుకుని అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కునేందుకు అవకాశం కలుగుతుంది. వీటన్నింటితో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించొచ్చు. దేశ ప్రజల కోసం ఏం చేయడానికైనా మోదీ సర్కార్‌ సిద్ధంగా ఉందని గతంలోనే రైల్వేమంత్రి స్పష్టం చేశారు. కొన్ని చోట్ల ఇప్పటికే స్మార్ట్‌ కోచ్‌లను అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి కొన్ని రూట్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ కోచ్‌లలో సెక్యూరిటీతో పాటు మానిటరింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంటుంది. ఫలితంగా…ఆయా కోచ్‌ల పరిస్థితేంటి..? ఎక్కడున్నాయి..? ఏమైనా సమస్యలున్నాయా..? లాంటి వివరాలు తెలుసుకునేందుకు వీలవుతుంది. రానున్న రోజుల్లో నెట్‌వర్క్‌ మొత్తాన్ని ంఎతో అనుసంధానించే ఆలోచనలో ఉంది కేంద్రం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *