హార్దిక్ వస్తే బుమ్రా ముంబైను వీడుతాడా? బుమ్రా ఆవేదనకు కారణం అదేనా?..

టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సోషల మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇండియన్ ప్రీమియార్ లీగ్ (IPL)లో తను ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ (MI) టీమ్‌ను సోషల్ మీడియాలో అన్-ఫాలో చేయడం కూడా సందేహాస్పదంగా మారింది. ఆల్ రౌండర్ హార్దిక్ ప్యాండ్యాను (Hardik Pandya) తిరిగి వెనక్కి తీసుకోవాలన్న ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై అసంతృప్తితోనే బుమ్రా అలా చేశాడని అందరూ భావిస్తున్నారు. అంతేకాదు ముంబై టీమ్‌ను వీడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్‌కు వెళ్లాలని కూడా బుమ్రా అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) స్పందించాడు.

`వన్డేలైనా, టీ-20లైనా, టెస్ట్‌లైనా ప్రస్తుతానికి బుమ్రాను మించిన బౌలర్ లేడు. అలాంటి మరో బౌలర్‌ను తయారు చేయడం కష్టమైన పని. ఎన్నో ఏళ్లుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై టీమ్‌కు కెప్టెన్ అవ్వాలని బుమ్రా అనుకుంటున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు నాయకత్వం వహించాడు. అలాగే ముంబై టీమ్‌కు కూడా నాయకుడా కావాలనుకున్నాడు. అయితే టీమ్ మేనేజ్‌మెంట్ హార్దిక్ పాండ్యాను తిరిగి తీసుకురావాడం బుమ్రాను బాధించి ఉంటుంది. అందుకే అతడు టీమ్‌ను వీడాలనుకుంటున్నాడేమో.

గతంలో చెన్నై టీమ్‌లోని ఇలాంటి పరిస్థితే ఎదురైంది. రవీంద్ర జడేజా బయటకు వెళ్లాలనుకున్నప్పుడు కెప్టెన్ ధోనీ, టీమ్ మేనేజ్‌మెంట్ వెంటనే కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇప్పుడు ముంబై టీమ్ కూడా అలాగే చేయాలి. రోహిత్, పాండ్యా, బుమ్రాతో కలిసి కూర్చుని సమస్యను పరిష్కరించాలి. టీ-20ల్లో అద్భుతమైన ప్లేయర్ అయిన బుమ్రాను వదులుకోవడం తెలివైన నిర్ణయం కాద“ని శ్రీకాంత్ అన్నాడు. కాగా, పాండ్యాను ముంబై టీమ్ దక్కించుకున్న తర్వాత బుమ్రా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో “కొన్నిసార్లు మౌనంగా ఉండడమే అత్యుత్తమ సమాధానం“ అని పోస్ట్ పెట్టాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *