యావరేజ్‌ టాక్‌ తో హాయ్‌… నాన్న

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7
’దసరా’ విజయం తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని నటించిన సినిమా ‘హాయ్‌ నాన్న’. దసరా మాస్‌ అయితే… హాయ్‌ నాన్న క్లాస్‌! ఈ సినిమాలో ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌. ‘బేబీ’ కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. మనసుకు హాయినిచ్చేలా ప్రచార చిత్రాలు, పాటలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ రోజు సినిమా విడుదలైంది.
నాని ముంబైలో ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌. అతని ఆరేళ్ళ కుమార్తె పేరు మహి (’బేబీ’ కియారా ఖన్నా). పాపకు కథలు చెప్పడం తండ్రి అలవాటు. అమ్మ కథ చెప్పమని ప్రతిసారీ అడుగుతూ ఉంటుంది. క్లాస్‌ ఫస్ట్‌ వస్తే చెబుతానని మదర్‌ ప్రామిస్‌ చేస్తాడు విరాజ్‌. మహి ఫస్ట్‌ వస్తుంది. కానీ, అమ్మ కథ చెప్పడు. తెల్లారిన తర్వాత తండ్రికి చెప్పకుండా మహి బయటకు వెళుతుంది. ఆ చిన్నారిని ఓ ప్రమాదం నుంచి యష్ణ (మృణాల్‌ ఠాకూర్‌) కాపాడుతుంది. ఇద్దరు కలిసి కాఫీ షాపులో కూర్చుంటారు. అక్కడికి విరాజ్‌ వస్తాడు. కంపల్సరీ అమ్మ కథ చెప్పాలని పట్టుబట్టడంతో మరో దారి లేక చెప్పడం మొదలు పెడతాడు. విరాజ్‌ పెద్ద ఫోటోగ్రాఫర్‌ కాకముందు… అతడికి వర్ష (ఆ పాత్రలో యష్ణను మహి ఊహించుకుంటుంది ` అంటే మృణాల్‌ ఠాకూర్‌) పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. వర్ష సంపన్నురాలు. విరాజ్‌ మిడిల్‌ క్లాస్‌. తల్లి చెబుతున్నా వినకుండా విరాజ్‌ ఇంటికి వస్తుంది. పెళ్లి చేసుకుంటుంది. వాళ్ళకు ఓ అందమైన పాప జన్మిస్తుంది. విరాజ్‌ కథ చెబుతుంటే అతడు ప్రేమించిన అమ్మాయి పాత్రలో తనను తాను ఊహించుకుంటుంది యష్ణ. విరాజ్‌ను ప్రేమిస్తుంది. అసలు… పాప జన్మించిన తర్వాత ఏమైంది? విరాజ్‌, వర్ష ఎందుకు విడిపోయారు? వర్ష ఎక్కడికి వెళ్ళింది? వర్ష కుటుంబ నేపథ్యం ఏమిటి? తల్లిదండ్రులు ఎవరు? ఓ వారంలో అరవింద్‌ (అంగద్‌ బేడీ)తో పెళ్లి పెట్టుకుని విరాజ్‌తో ప్రేమలో పడిన యష్ణ… అతడికి తన మనసులో మాటను చెప్పిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. తండ్రి కుమార్తె అనుబంధం, ఇద్దరి మధ్య ప్రేమ నేపథ్యంలో తెలుగు తెరకు కొత్త కాదు. తల్లి లేని కుమార్తెను ఎంతో ప్రేమగా చూసుకునే తండ్రిని చూసి మనసు ఇచ్చిన అమ్మాయిల కథలు కూడా కొత్త కాదు. ఆల్రెడీ వచ్చిన కథల మధ్య ‘హాయ్‌ నాన్న’ను కొత్తగా నిలబెట్టిన అంశం ఏది? అని చూస్తే… తల్లి పాత్ర!’హాయ్‌ నాన్న’లో కథానాయకుడు, కుమార్తె కంటే తల్లి పాత్ర చాలా కీలకమైనది. ఆ పాత్రకు ఇచ్చిన ట్విస్ట్‌, ఆ ట్విస్ట్‌ చుట్టూ నడిచే సీన్లు కూడా! బహుశా… నానికి కూడా ఆ పాయింట్‌ నచ్చి కథ ఓకే చేశారేమో!? అయితే… ఆ ట్విస్ట్‌ వచ్చే వరకు నడిచే ప్రేమకథ రెగ్యులర్‌ డ రొటీన్‌ అనిపిస్తుంది. ఒక దశలో ‘సారొచ్చారు’ ఛాయలు సైతం కనిపిస్తాయి. మధ్యలో పాటలు కాస్త ఉపశమనం ఇస్తాయి. ఒక్కసారి ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక గుండె రaల్లుమంటుంది. ట్విస్ట్‌ రివీల్‌ చేసిన తర్వాత నుంచి ముగింపు వరకు కాస్తో కూస్తో ఆసక్తిగా కథను నడిపాడు దర్శకుడు. ప్రేమ, హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ. మన మనసులో బాధను, ప్రేమను అన్నిసార్లూ బయటకు వ్యక్తం చేయలేం. అలాగని, దాచుకోలేం. అటువంటి పరిస్థితిని తెరపై ఆవిష్కరించడానికి శౌర్యువ్‌ ట్రై చేశారు. మానసిక సంఘర్షణను హృద్యంగా ఆవిష్కరించిన దర్శకుడు… ప్రేక్షకులు సైతం ఆ ప్రేమను ఫీలయ్యేలా తీయడంలో ఫెయిల్‌ అయ్యారు. ఒక్కసారి ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక… హీరో కథ విని హీరోయిన్‌ ప్రేమలో పడిరదని తెలిశాక… తర్వాత జరిగే సన్నివేశాలను ఊహించడం పెద్ద కష్టం ఏవిూ కాదు. క్లైమాక్స్‌ కోసం వెయిట్‌ చేయడం తప్ప చేసేది ఏవిూ ఉండదు.శౌర్యువ్‌ కథకు, సన్నివేశాలకు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం ప్రాణం పోసింది. పాటల కంటే నేపథ్య సంగీతం ఎక్కువ బలంగా నిలిచింది. ప్రతి సన్నివేశం ఓ అందమైన పెయింటింగ్‌ ఉన్నట్లు ఉంది. సాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ సూపర్బ్‌. అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైన్‌ కూడా! నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. ప్రతి సన్నివేశంలో ఆ ఖర్చు కనిపించింది.నటీనటులు ఎలా చేశారంటే: స్టైలిష్‌ డ హ్యాండ్సమ్‌ నాని స్క్రీన్‌ విూద కనిపించారు. ఇప్పటివరకు నాని చేసిన సినిమాల్లో ‘హాయ్‌ నాన్న’ ది బెస్ట్‌ లుక్‌ అని చెప్పవచ్చు. నటన వస్తే… భావోద్వేగభరిత సన్నివేశాల్లో జీవించారు. ఆయనను చూసి భార్య, కుమార్తె అంటే ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌ అవుతారు. సహజ నటనతో నాని మరోసారి ఆకట్టుకున్నారు.వర్షగా ప్రేమ కథలో కంటే… యష్ణగా ప్రజెంట్‌ కథలో మృణాల్‌ ఠాకూర్‌ లుక్‌ డ స్టైలింగ్‌ బావున్నాయి. మృణాల్‌ సైతం కొన్ని సన్నివేశాల్లో ఏడిపిస్తారు. చిన్మయి డబ్బింగ్‌ కూడా అందుకు ఓ కారణం అని చెప్పాలి. అంత సహజంగా చెప్పారు. ‘బేబీ’ కియారా ఖన్నా నటన ముద్దొస్తుంది. అంత చిన్న వయసులో ఎమోషనల్‌ సీన్‌ చేసిన ఆమె ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. జయరామ్‌ నటన, ఆయన ఇమేజ్‌ వల్ల తండ్రి పాత్రకు హుందాతనం వచ్చింది. పతాక సన్నివేశాలకు బలం చేకూరింది. హీరో స్నేహితుడిగా ప్రియదర్శి మధ్యలో కాస్త నవ్వించారు. హిందీ నటుడు అంగద్‌ బేడీకి తొలి తెలుగు చిత్రమిది. అరవింద్‌ కృష్ణ పాత్రలో సెటిల్డ్‌ పెర్ఫార్మన్స్‌ చేశారు. ఆయన సోదరుడిగా ‘బేబీ’ ఫేమ్‌ విరాజ్‌ అశ్విన్‌ రెండు మూడు కీలక సన్నివేశాల్లో కనిపించారు. పాటలో శృతి హాసన్‌ డ్యాన్స్‌, ఆ గ్రేస్‌ సూపర్బ్‌. రితికా నాయక్‌ ఓ పాటలో ఓ పాటలో సందడి చేశారు. నేహా శర్మ ఓ సన్నివేశంలో తళుక్కున మెరిశారు. చివరగా చెప్పేది ఏంటంటే: ‘హాయ్‌ నాన్న’ ఓ ఎమోషనల్‌ జర్నీ! ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ సంథింగ్‌ డిఫరెంట్‌ డ కొత్తగా ఉంది. ట్విస్ట్‌ తీసి చూస్తే… ఇదొక రొటీన్‌ సినిమా.ఈ కథను నమ్మి ప్రాణం పెట్టి నటించిన మృణాల్‌ ఠాకూర్‌ డ నానికి… సంగీతంతో కథకు ప్రాణం పోసిన హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ కు రియల్లీ హ్యాట్సాఫ్‌. వాళ్ళ కోసం అయితే ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఓసారి థియేటర్లకు వెళ్లే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం గుర్తు పెట్టుకోండి… సినిమా చాలా నిదానంగా ముందుకు వెళుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *