పాత బస్తీలో బక్రీద్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, జూన్‌ 28
బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని గురువారం విూరాలం ఈద్గాలో నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. విూరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను ప్రార్థనలు ముగిసేంత వరకు దారి మళ్లించనున్నట్లు వెల్లడిరచారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ నుంచి ప్రార్థనల కోసం విూరాలం ఈద్గాకు వచ్చే వాహనాలను బహదూర్‌ఫురా ఎక్స్‌ రోడ్డు విూదుగా రావాలని తెలిపారు. వీరు తమ వాహనాలను జూపార్కు ఏరియాలో, ఓపెన్‌ స్పేస్‌ ఎదురుగా మసీదు అల్లాహో అక్బర్‌ వద్ద పార్క్‌ చేసుకోవాలని సూచించారు.
ఈ టైంలో సాధారణ వాహనాల రాకపోకలకు పర్మిషన్‌ లేదని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. వీరిని బహదూర్‌పురా ఎక్స్‌ రోడ్డు వద్ద కిషన్‌బాగ్‌, కామాటిపురా, పురానాపూల్‌ వైపు దారి మళ్లించామని అని చెప్పారు. శివరాంపల్లి, దానమ్మ హట్స్‌ నుంచి ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను దాన్నమ్మ హట్స్‌ ఎక్స్‌ రోడ్డు విూదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతి ఉంటుంది. వీరు తమ వాహనాలను ఈద్గా ప్రధాన రహదారి ముందు, మోడ్రన్‌ సా మిల్‌ పార్కింగ్‌తో పాటు విూరాలం ఫిల్టర్‌ బెడ్‌, విూరాలం బెడ్‌ పక్కన ఖాళీ ప్లేస్‌ లో, కార్లను, యాదవ్‌ పార్కింగ్‌ పక్కన పార్క్‌ చేసుకోవాలని తెలిపారు. ఈ టైంలో ఇతర వాహనాల రాకపోకలను ఈద్గా వైపు పర్మిషన్‌ లేదన్నారు.సాధారణ వెహికిల్స్‌ ను దానమ్మ హట్స్‌ ఎక్స్‌ రోడ్డు దగ్గర శాస్త్రిపురం, నవాబ్‌సాబ్‌కుంట తదితర ప్రాంతాల నుంచి దారి మళ్లించనున్నట్లు నగర పోలీసులు తెలిపారు. కాలాపత్తర్‌, విూరాలం ట్యాంక్‌ వైపు నుంచి వాహనాలను కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ విూదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతించమన్నారు. వీరు తమ వాహనాలను భయ్యా పార్కింగ్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద పార్క్‌ చేసుకోవాలని సూచించారు. సాధారణ వాహనాలను కాలాపత్తర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద మోచీ కాలనీ, బహదూర్‌పురా, షంషీర్‌గంజ్‌, నవాబ్‌సాబ్‌కుంట వైపు మళ్లించారు.పురానాపూల్‌, బహదూర్‌పురా వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు భారీ వాహనాలను పురానాపూల్‌ దర్వాజా వద్ద జియగూడ, సిటీ కాలేజీ వైపు దారి మళ్లించనున్నారన్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే అన్ని ఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలను ఆరాంఘర్‌ జంక్షన్‌ దగ్గర శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి వైపు దారి మళ్లించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *