కొంప ముంచిన డీకే ప్లాన్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 4
తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయి. తెలంగాణలో హ్యాట్రిక్‌ కోసం అనేక ప్రయత్నాలు చేసిన కేసీఆర్‌ కు ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్‌ పార్టీ చిత్తుగా ఓడిపోతందని అసలు ఊహించలేకపోయింది. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని బీఆర్‌ఎస్‌ నాయకులు అంటున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ పక్కా వ్యూహం రచించడంలో విఫలం అయ్యారని ఆదివారం నాటి ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడానికి సొంతపార్టీ నాయకుల అత్యుత్సాహం, నిరుద్యోగ సమస్యలు, ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేకత ఉన్నప్పటికి పార్టీ క్యాడర్‌ ను కాపాడుకోవడంతో ఆ పార్టీ నాయకులు విఫలం అయ్యారని ఆ పార్టీకి చెందిన నాయకులు మాట్లాడుకుంటున్నారు. అయితే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న సామెతలా ఇప్పటికే అంతా జరిగిపోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చితకలబడ్డారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడానికి కాంగ్రెస్‌ పార్టీ ఉచిత హావిూలు ప్రధాన కారణం అయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆరు ఉచిత హావిూల దెబ్బ తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీని ఊహించని రీతిలో దెబ్బతీశాయి. తెలంగాణ పక్కరాష్ట్రం కర్ణాటకలో ఇదే ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంతవరకు అధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి పంపించడానికి కాంగ్రెస్‌ పార్టీల ఉచిత హావిూలతో పాటు బీజేపీ చేసిన ప్రయోగాలే కారణం అనే విషయం తెలిసిందే. కర్ణాటక రాష్ట్రంలో ఉచిత హావిూలు ఇచ్చి అంతకాలంఅధికారంలో ఉన్న బీజేపీని ఇంటికి పంపించిన కాంగ్రెస్‌ పార్టీ అదే ఉచిత హావిూలను పక్కరాష్ట్రం తెలంగాణలో ప్రకటించింది. కర్ణాటకలో మేము అద్బుతంగా పరిపాలన అందిస్తున్నామని, ఇచ్చిన ఉచితహావిూలు అన్నీ 100 రోజుల్లో నెరవేర్చామని కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ఆదరిస్తే ఇక్కడా ఉచిత హావిూలను అమలు చేస్తామని సిద్దరామయ్య ప్రభుత్వం తెలంగాణలోని తెలుగు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. కాంగ్రెస్‌ ఉచిత హావిూలను నమ్మకూడదని బీఆర్‌ఎస్‌, బీజేపీలు చేసిన ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. డిసెంబర్‌ 30వ తేదీ పోలింగ్‌ జరిగిన రోజు తెలంగాణ ప్రజలు హస్తం గుర్తు విూద ఓట్లు గుద్దేయడంతో అక్కడ పరిస్థితులు మొత్తం కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మారిపోయాయి. ఏ ముహూర్తానా డీకే శివకుమార్‌ బ్యాచ్‌ ఉచిత హావిూలను కర్ణాటకలో తెరవిూదకు తీసుకు వచ్చిందో ఆరోజు కాంగ్రెస్‌ పార్టీకి మంచిరోజులు మొదలైనాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఉచిత హావిూలు పూర్తిగా ముంచేశాయి. తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత హావిూలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఉచిత హావిూలు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ పనిచేయలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *