శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం

హైదరాబాద్‌, జూన్‌ 30
బెల్లంపల్లి ఎమ్మెల్యేపై గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఆమె బ్యాగులో ఓ లేఖ లభ్యమైంది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు తనను లైంగికంగా వేధించిన బీఆర్‌ఎస్‌ బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నం దుర్గయ్యపై పోరాడుతున్న ఆరిజిన్‌ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్‌ మరోసారి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడి సవిూపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను కొందురు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో…. ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె బ్యాగులో ఓ లేఖతో పాటు నిద్రమాత్రలు దొరికాయి.దొరికిన లేఖలో ప్రధానంగా? తనకు జరిగిన అన్యాయంతో పాటు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవటం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని? ఢల్లీిలో కేసీఆర్‌ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేసినప్పుడు కేటీఆర్‌ తనను పిలిచి మాట్లాడారని రాసుకొచ్చారు. తన బాధ అంతా విని న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ హైదరాబాద్‌ కు వచ్చిన కేటీఆర్‌? తన విషయంపై స్పందిస్తూ? చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్నారు. తనకు వారం రోజుల్లోనే న్యాయం చేస్తామని చెప్పిన కేటీఆర్‌?. అసలు తన విూద లైంగిక దాడి జరగలేదు అని చెప్పటం నమ్మకద్రోహమే అనిపించిందని రాసుకొచ్చారు. తనన్ను చంపడానికి దుర్గం చిన్నయ్య ప్రయత్నిస్తున్నాడని.. ఎప్పుడు చంపుతారో తెలియదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కచ్చితంగా తన ఊసురు తగులుతుందటూ శాపనార్థలు పెట్టారు. దుర్గం చిన్నయ్య మంచోడని మంత్రి కేటీఆర్‌ ప్రకటించడంతో ఇక తనకు న్యాయం జరగదని భావిస్తున్నానని తెలిపారు. ఈ ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహానికి శేజల్‌ అను నేను బలవుతున్నాను? కనీసం నీదగ్గరయినా నాకు మనశాంతి దొరుకుతుందని భావిస్తున్నాను లేఖలో ప్రస్తావించారు. ఇక ఈ లేఖ సోషల్‌ విూడియాలో కూడా తెగ వైరల్‌ అవుతోంది.శేజల్‌ గత కొంతకాలంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఇటీవలనే ఢల్లీిలోని జాతీయ మహిళా కమిషన్‌, హెచ్‌ఆర్‌సీకి కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్‌ వద్ద ఆమె ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం శేజల్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *