మరో కొత్త పథకంతో సర్కార్‌

మహబూబ్‌ నగర్‌, అక్టోబరు 9
తెలంగాణ సర్కార్‌ మరో కొత్త స్కీమ్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని ఎరుకల సామాజిక వర్గానికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. రూ.60 కోట్ల నిధులతో ‘ఎరుకల సాధికారత’ పథకాన్ని ప్రకటించింది. ఈ స్కీమ్‌ ను ట్రైకార్‌ ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికలు సవిూపించిన వేళ బీఆర్‌ఎస్‌ సర్కార్‌ మరో కొత్త స్కీమ్‌ ను ప్రకటించింది. దళితబంధు తరహాలోనే ఎరుకల సామాజికవర్గం వారికోసం ఎరుకల సాధికారత పథకాన్ని తీసుకొచ్చింది.ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.60 కోట్లు కేటాయించింది. వైఈఎస్‌ పథకానికి సంబంధించిన విధివిధానాలను శనివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఈ స్కీమ్‌ కింద ముఖ్యంగా పందుల పెంపకం, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం , ప్యాకేజింగ్‌, రవాణా, దుకాణాల కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చూస్తే ఎస్టీ జనాభాలో 4.54 శాతంగా ఎరుకలు ఉన్నారు. వీరు ప్రధానంగా పందుల పెంపకంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 1.44 లక్షలు ఉన్న ఎరుకల జనాభా ఉంది. అయితే వీరి వృత్తిలో అనేక సవాళ్లను ఎదుర్కొనడంతో పాటు పట్టణాల్లో నిబంధనల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి సాధికారిత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్‌ ను తీసుకొచ్చింది. సామాజిక సంఘాల ద్వారా ఈ పథకం అమలు చేయాలని భావిస్తోంది.
గరిష్టంగా రూ 30 లక్షలు?.
`ఎరుకుల సాధికారిత పథకంలో చూస్తే ఒక్కో యూనిట్‌కు 50 శాతం (గరిష్ఠంగా రూ.30 లక్షలు) రాయితీగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మిగతా 50 శాతం వ్యయంలో 40 శాతం బ్యాంకు రుణంగా, 10 శాతం లబ్ధిదారుడి వాటా ఉంటుంది.
`పందుల పెంపకం యూనిట్‌ జనావాసాలకు 3 నుంచి 5 కిలోవిూటర్ల దూరంలో ఉండాలి.
`సొంతంగా రెండు ఎకరాల స్థలం ఉండాలి. లేదా ఏడేళ్ల కాలపరిమితితో లీజుకు ఒప్పందం చేసుకోవాలి.
`ఈ సరికొత్త పథకం మంజూరు కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ పని చేయనుంది.
`ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ రాష్ట్రస్థాయిలో పథకం అమలును పర్యవేక్షిస్తోంది.
`వైఈఎస్‌లో భాగంగా ప్రధానంగా మూడు క్యాటగిరీలు ఉంటాయి.
`ఈ పథకం కింద పందుల పెంపకం, శీతల గోదాముల నిర్మాణం, ప్యాకేజింగ్‌, రవాణా, దుకాణాల కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *