ఆకర్షిస్తున్న ఆయాలాన్‌

చెన్నై, అక్టోబరు 7
ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్‌ చేస్తున్న భారీ బడ్జెట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా ‘అయలాన్‌’. కోలీవుడ్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 సంక్రాంతికి ‘అయలాన్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ను ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు. ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే అత్యధిక సంఖ్యలో సీజీ షాట్స్‌ ‘అయలాన్‌’ కోసం ఉపయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్‌ రేంజ్‌లో ఈ సినిమా అవుట్‌ ఫుట్‌ ఉండనున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. బాలీవుడ్‌ అగ్ర హీరో హృతిక్‌ రోషన్‌ నటించిన ‘కోయి మిల్‌ గయా’ తరహాలోనే ఈ చిత్రం ఉండనుందని తెలుస్తోంది.సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌ లో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో సాగే ‘అయలాన్‌’ సినిమాలో శివ కార్తికేయన్‌ డిఫరెంట్‌ అవతారంలో కనిపించబోతున్నారు. శరద్‌ ఖేల్కర్‌, ఇషా కొప్పికర్‌, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్‌, బాల శరవణన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అయలాన్‌’ చిత్రానికి ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.కేజేఆర్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై కోటపాడి జయ రాజేష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2024 సంక్రాంతి కానుకగా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు రాజ్‌ కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు శివ కార్తికేయన్‌. ‘ూఐ21’ అనే వర్కింగ్‌ టైటిల్‌ తో పిలుస్తున్న ఈ సినిమాలో నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నాఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. కోలీవుడ్‌ సీనియర్‌ హీరో కమలహాసన్‌ రాజ్‌ కమల్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.’అయలాన్‌’ ఫస్ట్‌ లుక్‌ అందరినీ అట్రాక్ట్‌ చేసింది. ఈ పోస్టర్‌ను పరిశీలిస్తే ఏలియన్‌తో పాటు శివకార్తికేయన్‌ నీటిలో ఈదడం చూడవచ్చు. సౌత్‌ ఇండియాలోనే ఈ తరహా స్కేల్‌లో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా రావడం ఇదే తొలిసారి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంతకు ముందు కూడా సౌత్‌ ఇండియాలో కూడా కొన్ని సైన్స్‌ ఫిక్షన్‌ మూవీస్‌ వచ్చినప్పటికీ ఏలియన్‌ ప్రధాన పాత్రలో రావడం మాత్రం దక్షిణాది భాషల్లో రాలేదు. ఏలియన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో దక్షిణాది చిత్రసీమలో తెరకెక్కుతోన్న తొలి సినిమాగా ఈ మూవీ నిలవనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *