ఐక్యతా రాగం సాధ్యమేనా

2024 సాధారణ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ వరుసగా విపక్ష నేతలతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను సోమవారం కలుసుకుని చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ కూడా పాల్గొన్నారు. త్వరలోనే ప్రతిపక్షాల సమావేశం జరగనున్నట్లు కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. తేదీని ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఈ భేటీకి అన్ని పార్టీలు హాజరవుతాయని అన్నారు.మరోవైపు ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నీతీశ్‌ కుమార్‌, తేజస్వి యాదవ్‌, రaార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లాతోపాటు పలు విపక్ష నేతలు హాజరైన విషయం తెలిసిందే. దీని ద్వారా తాము ఐక్యంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం విపక్ష పార్టీలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నితీష్‌తో భేటీకి ముందు కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ట్వీట్‌ చేశారు. ఇప్పుడు దేశం సమైక్యంగా ఉంది.. ప్రజాస్వామ్య బలం మా సందేశం అని ట్వీట్‌ చేశారు. రాహుల్‌గాంధీతో కలిసి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నితీష్‌కుమార్‌తో చర్చించినట్లు తెలిపారు. దేశానికి కొత్త దిశను అందించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లామన్నారు. నితీష్‌ కుమార్‌ ఆదివారం ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలుసుకుని విపక్షాల ఐక్యతపై చర్చించారు. కేంద్రం జారీచేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాటంచేసేందుకు సిద్ధమైన కేజ్రీవాల్‌కు తన సంఫీుభావాన్ని ప్రకటించారు. ఆ మర్నాడే రాహుల్‌, ఖర్గేలతో ఈ సమావేశం జరగడం ప్రాముఖ్యత సంతరించుకుంది. కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న నితీష్‌… కేంద్రంతో ఢల్లీి ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభంపై ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. మరోవైపు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్‌ కీలక నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సమక్షంలో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఒక విధంగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం . బీజేపీయేతర పక్షాల ఐక్యతకు వేదికగా మారింది. అంతే కాకుండా కాంగ్రెస్‌ లో మారిన సంస్కృతికి దర్పణంగా కనిపించింది. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్‌ డిప్యూటీ ముఖ్యమంత్రిగా మరో ఎనిమిది మంది కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్‌ ఖర్గేకు ఇరువైపులా సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ లు చేతులు పట్టకుని నిలుచున్నారు.వీరికి వెనుకగా కాంగ్రెస్‌ కీలక నేతలు రాహుల్‌, ప్రియాంకలు నిలబడ్డారు. ఏ విధంగా చూసినా ఇది ఒక కొత్త దృశ్యం. కాంగ్రెస్‌ లో గాంధీ నెహ్రూ కుటుంబం స్వయంగా తమ ఆధిపత్యాన్ని తగ్గించుకుని పార్టీలో ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేసిన సందర్భంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదలా ఉంటే ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌, రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌, ఛత్తీస్‌గర్‌ సీఎం భూపేశ్‌ భగేల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రెసిడెంట్‌ ఫరూక్‌ అబ్దుల్లా తదితరులు హాజరయ్యారు.అలాగే రాజకీయవేత్తగా మారిన నటుడు కమల్‌ హసన్‌ కూడా హాజరయ్యారు. ఆహ్వానం అందినప్పటికీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢల్లీి సీఎం కేజ్రీవాల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ లు గైర్హాజరయ్యారు. అయితే కర్నాటకలో కాంగ్రెస్‌ విజయం, ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి పలు బీజేపీయేతర పార్టీల అధినేతల హాజరు జాతీయ స్థాయిలో బీజేపీయేతర కూటమి బలోపేతం అవుతోందనడానికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది గడువు ఉంది. ఈ లోగా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో పార్టీలూ ఏకమౌతాయన్న అంచనాకు రావడానికి సిద్ధరామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమం దోహదపడిరదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయాలని అంశంపైనా వారిద్దరి మధ్యా చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న విపక్షాలన్నీ త్వరలో సమావేశం కాబోతున్నాయి. అయితే, ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని ఒకట్రెండు రోజుల్లో వెల్లడిరచనున్నట్టు కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *