తెరపైకి రెండో రాజధాని… సాధ్యమేనా

హైదరాబాద్‌ విశ్వనగరం దిశగా పరుగులు పెడుతోంది. మహానగరం దినదినాభివృద్ధి చెందుతూ మరింత విస్తరిస్తోంది. ఆకాశాన్నంటేలా ఎత్తైన భవనాలతో వెలుగు జిలుగులు వెదజల్లుతోంది. హైటెక్‌ సిటీ అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తోంది. ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు ఇక్కడ కార్యాలయాలు నెలకొల్పుతున్నాయి. సైబర్‌ సిటీలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఎకరా ధర ఏకంగా వంద కోట్లు పలుకుతోంది. ఒక్కో లగ్జరీ ఫ్లాట్‌ రూ.20కోట్లకు పైనే ఉంది. అటు రాష్ట్ర రాజధానిగా.. తెలంగాణకు గుండెకాయగా మారింది మహానగరం. తెలంగాణ జనాభాలో దాదాపు పావువంతు ఇక్కడే నివాసం ఉంటున్నారు. కోటికిపైగా జనాభాతో నగరం కిటకిటలాడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైల్‌ తదితర సౌకర్యాలతో దేశంలోని మిగతా మెట్రో నగరాలతో భాగ్యనగరం పోటీ పడుతోంది. దేశరాజధాని ఢల్లీికి ధీటుగా హైదరాబాద్‌ దూసుకెళ్తోంది. భవిష్యత్‌ లో అన్ని నగరాల కంటే ముందు వరుసలో నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ రెండో రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో దానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో అప్పట్లో హైదరాబాద్‌ని రెండో రాజధాని చేయాలని, ఇది అంబేడ్కర్‌ ఆశయం అని ప్రచారం చేశారు. అట్లాగే మొన్న నెక్లెస్‌ రోడ్‌లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మనవడు ప్రకాశ్‌ యశ్వంత్‌ అంబేడ్కర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ రెండో రాజధానిగా చేయాలనేది అంబేడ్కర్‌ అభిమతం అని ప్రకటించారు. ఇప్పుడు ఈ ప్రసంగాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు హైదరాబాద్‌ని రెండో రాజధాని చేయాలని నినదించే అవకాశమున్నది70 ఏండ్ల కింద అంబేడ్కర్‌ ఈ ప్రతిపాదన చేసిన తర్వాత సమాజంలో చాలా మార్పులు జరిగినాయి. వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. హైదరాబాద్‌ని రెండో రాజధానిగా చేసినట్లయితే దక్షిణాది వారికి దగ్గరగా ఉంటుందనేది ఒక అంశం. అట్లాగే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల్లో ఇప్పటికే ఢల్లీి కన్నా మెరుగైన రెడీమేడ్‌ బిల్డింగ్స్‌ ఉన్నాయి. విూదు మిక్కిలి చవకగా కూడా దొరుకుతున్నాయి. ఒక్క పార్లమెంటు కట్టుకుంటే సరిపోతుంది. అని అంబేడ్కర్‌ ఆనాడు అభిప్రాయపడ్డారు. ఫ్లయిట్‌ కనెక్టివిటీ పెరిగిన తర్వాత దూరం అనేది పెద్ద సమస్య కాదు. అట్లాగే అటు చండీఘడ్‌ నుంచి ఇటు కలకత్తా వరకు హైదరాబాద్‌ దూరమే అవుతుంది. ప్రధానమైన విషయమేమిటంటే అంబేడ్కర్‌ ఈ ప్రతిపాదన చేసిన 1955లో హైదరాబాద్‌లో నిజంగానే కొన్ని లక్షల ఎకరాల ‘సర్ఫేఖాస్‌’ భూములు హైదరాబాద్‌ పరిపాలనా విభాగానికి అందుబాటులో ఉండేవి. బొల్లారం ప్రాంతం నిర్మానుష్యంగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లో అడుగు భూమి కొనాలన్నా వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నది. అట్లాగే బొల్లారం స్థలం మిలిటరీకే సరిపోవడం లేదు.బొల్లారం మిలిటరీ స్థలంలో జాతీయ రహదారి నిర్మించేందుకు జాగా కేటాయించాలని డిమాండ్‌ చేస్తే దానికి వందల కొర్రీలు వేసి కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ మిలిటరీ అడ్డుకుంటున్నది. అట్లాంటి సమయంలో రాజధానికి అవసరమైన ఖాళీ జాగా దొరికే పరిస్థితి లేదు. దీనికి తోడు ప్రపంచంలోనే అత్యధిక కాలుష్య రాజధానిగా ఢల్లీికి పేరున్నది. ఆ కాలుష్య కాసారాన్ని ఇప్పటికే సతమతమైతున్న హైదరాబాద్‌పై రుద్దుతామంటే కష్టమే! ఎందుకంటే హైదరాబాద్‌ రెండో రాజధాని అయినట్లయితే వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. పెరిగిన వాహనాలకు తగ్గట్టుగా రోడ్లు వేయడానికి వీలు లేకపోవడంతో కాలుష్యం పెరిగి పోతుంది. ం ఇది ఆచరణకు నోచుకునేది కష్టమనే భావనతోనే ఆనాడు ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెరవిూదికి వచ్చింది.1955లో ‘‘థాట్స్‌ ఆన్‌ లింగ్విస్టిక్‌ స్టేట్స్‌’ అనే పుస్తకంలో దేశానికి రెండో రాజధాని అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, బొల్లారం మూడిరటిని కలిపి చీఫ్‌ కమిషనర్‌ ప్రావిన్స్‌గా ఏర్పాటు చేయాలన్నారు. అంటే దాని ఉద్దేశం కేంద్ర పాలిత ప్రాంతం చేయడం. ప్రస్తుతం ఢల్లీి రాజధానిగా ఉంది. దానికి రాష్ట్ర స్థాయి హోదా కూడా ఉన్నది. అయితే అక్కడి పోలీస్‌ కానీ, భూ లావాదేవీలన్నీ లెఫ్టినెంట్‌ జనరల్‌ కార్యాలయమే చూస్తుంది. కానిస్టేబుల్‌ని బదిలీ చేయాలన్నా లెఫ్టినెంట్‌ జనరలే చేయాల్సి ఉంటుంది. అంటే అధికారాలు, ఆస్తులు అన్నీ కేంద్రానికి కట్టబెట్టి తెలంగాణకు ఏమి కావాలన్నా అడుక్కోవాల్సి ఉంటుంది.నిజానికి తెలంగాణ గుండెకాయ హైదరాబాద్‌.ఆ గుండెకాయను కోసి కేంద్రం చేతిలో పెట్టడమంటే మన ప్రాణాలను మనమే తర్పణం చేయడం. ఇప్పటికే తెలంగాణ నుంచి వచ్చే నిధులను జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలకు దోచిపెడుతున్న కేంద్ర ప్రభుత్వం 2026లో జరగబోయే పార్లమెంటు నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేసేలా ముందుకు వెళుతుంది. తాము దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడానికి బిజెపి హైదరాబాద్‌ని ఒక పావుగా వాడుకునే ప్రమాదమున్నది. దేశ సరిహద్దుల్లో తరచూ ఏర్పడుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలన్న అంశంపై యావద్దేశం దృష్టి సారించింది. డా. బీఆర్‌? అంబేద్కర్‌ హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చూడాలని అనుకున్నారని, 60 ఏళ్లయినా ఈ ప్రతిపాదన అమలులోకి రాలేదని అంబేద్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేద్కర్‌ హైదరాబాద్‌లో ఇటీవల అంబేద్కర్‌? జయంతి రోజున ప్రకటించడం మరోసారి చర్చకు దారి తీసింది. ఈ అంశాన్ని ఎవరో సాధారణ వ్యక్తి ప్రతిపాదిస్తే పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు కానీ, అంబేద్కర్‌ మనవడే చెప్పడంతో కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆనాడు అంబేద్కర్‌ హైదరాబాద్‌ను పలుమార్లు సందర్శించిన సందర్భంగా ఇక్కడి వాతావరణం ఆయనను కట్టిపడేసిందని, దేశంలోని అన్ని ప్రాంతాలకు కేంద్ర స్థానంలో ఉండటంతో రెండో రాజధానిగా చేయాలని తన పుస్తకంలో కూడా రాశారని ప్రకాష్‌ అంబేద్కర్‌ వేలాదిమంది ప్రజల హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు. హైదరాబాద్‌ రెండోరాజధానిగా మారాలని కోరుకుంటున్నానని కూడా ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *