గులాబీ సోషల్‌ విూడియా అలెర్ట్‌…

అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ విూడియా యాక్టివిటీస్‌ను అలర్ట్‌ చేసింది. నియోజకవర్గాల వారీగా కమిటీలతో ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని సోషల్‌ విూడియాలో మరింత ప్రచారం ఎలా చేయాలనే అంశాలపై వివరిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, అందుకు గ్రామాలవారీగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి మరింత వేగం పెంచాలని భావిస్తున్నది.రాబోయే అన్ని ఎన్నికల్లో సోషల్‌ విూడియా తీవ్ర ప్రభావం చూపనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తుండడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే గ్రామ, వార్డు, మండల, డివిజన్‌, నియోజకవర్గ, జిల్లా కమిటీలలో యాక్టివ్‌గా ఉన్న వారిని గుర్తించి సోషల్‌ విూడియా కమిటీని నియమించింది. అయితే వారికి పార్టీ కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలనే దానిపై పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగానే సెగ్మెంట్ల వారీగా సోషల్‌ విూడియా కమిటీలతో ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడుతోంది. ఈ సమ్మేళనాల్లో ఎవరు ఏ పోస్టు పెట్టాలి.. దానిని ఎలా విస్తృతం చేయాలనే దానిని వివరిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ నేతల్లో ఏమైనా గ్యాప్‌ ఉంటే వాటిని ఎలా పూడ్చాలి.. వారిపై వస్తున్న ఆరోపణలకు ఎలా చెక్‌ పెట్టాలనే దానిపై ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు తెలుస్తున్నది.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌, ఆయన కుటుంబం, నేతలపై వచ్చే ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే దానిపైన ఆత్మీయ సమ్మేళనాల్లో శ్రేణులకు వివరిస్తున్నారు. గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో ప్రతిపక్ష ప్రజాప్రతిధులు ఉంటే వారు చేయని పనులు, బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఉన్న దగ్గర చేసిన పనులను పోల్చుతూ పోస్టులు పెట్టేలా సమాయత్తం చేస్తున్నారు.గ్రామాల్లో ఒక వార్డులో రెండు వాట్సాప్‌ గ్రూపులను చేసి వాటిలో నిత్యం బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలను వివరించేలా ప్లాన్‌ చేస్తున్నారు. వారికి ప్రతి రోజూ రాష్ట్ర కమిటీ మానిటరింగ్‌తో పాటు ఏ పోస్టు పెట్టాలి.. దేనిని విస్తృతంగా వివరించాలనే దానిపై మార్గనిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే విపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాల్లో దూకుడు పెంచడంతో అధికార బీఆర్‌ఎస్‌ సైతం అదేస్థాయిలో దూకుడు పెంచాలని భావించి సోషల్‌ విూడియా కమిటీలతో ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుడుతున్నది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *