డ్యామేజ్‌ కంట్రోల్‌ పనిలో ముద్రగడ

కాకినాడ, జూలై 1
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు రాజకీయాలు హీట్‌ పుట్టిస్తున్నాయి? పవన్‌ వారాహి యాత్రతో జిల్లాలో కాపు సవిూకరణలు పీక్స్‌కి చేరాయి. పవన్‌ పరోక్ష, ముద్రగడ డైరెక్ట్‌ వార్‌తో కాకరేగి రచ్చ రచ్చ అవుతోంది. అదే ఊపులో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబాన్ని సపోర్ట్‌ చేస్తూ కొత్త రాజకీయానికి తెర దీశారు ముద్రగడ. పవన్‌ కళ్యాణ్‌ ద్వారంపూడి కుటుంబాన్ని విమర్శించడం కరెక్ట్‌ కాదని, వాళ్లు కాపు ఉద్యమానికి చాలా సాయం చేశారని, దశాబ్దాలుగా నేను చూస్తున్నానంటూ ఓపెన్‌ అయిపోయి ఓన్‌ చేసుకుందామనుకున్నారు పద్మనాభం.. అయితే ఆ వ్యాఖ్యలపై సొంత కులంలోనే అసహనం కనిపిస్తోందట. ఆదిలోనే ఖండిరచకుండా వదిలేస్తే?అసలుకే ఎసరొస్తుందని అలర్ట్‌ అయ్యారట అధికార పార్టీలోని కాపు నేతలు. రిజర్వేషన్ల కోసం ముద్రగడ పోరాటాన్ని ఎవరూ కాదనలేరని ప్రకటించేశారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. అదే సమయంలో ద్వారంపూడి కుటుంబం కాపు ఉద్యమానికి సహాయం చేసిందనే వ్యాఖ్యలను మాత్రం బహిరంగంగానే ఖండిరచేశారాయన. తాను పార్టీ తరఫున మాట్లాడడం లేదని కులం విూద అభిమానంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని కొత్త ట్విస్ట్‌ ఇచ్చారు.ముద్రగడ ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. ఆయన వ్యాఖ్యలు , లేఖలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్‌ ముందు ముందు పార్టీకి నష్టం చేస్తాయని లెక్కలు వేస్తోంది అధికార పార్టీ. అందుకే డ్యామేజ్‌ కంట్రోల్‌ మొదలుపెట్టినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు తోట త్రిమూర్తులు. అందుకే ఒకవైపు పవన్‌ను విమర్శిస్తూనే మరోవైపు కాపులకు దగ్గరయ్యే పనిలో ఉన్నారాయన. ముద్రగడ లేఖలో ప్రస్తావించిన అంశాలతో అధికార పార్టీలో కాపు నేతలంతా అవాక్కయినట్టు చెప్పుకుంటున్నారు. జనసేన అధ్యక్షుడిని ఆయన విధానాల వరకు విమర్శించడం ఓకే గానీ? రెడ్లు కాపు ఉద్యమానికి అండగా ఉన్నారన్న మాటలు కరెక్ట్‌ కాదని, అవి రాజకీయంగా మరోలా వెళ్తాయని అధినాయకత్వాన్ని కూడా హెచ్చరించారట. రేపు ముద్రగడ పార్టీలో చేరాక ఆ ముద్ర మనపై కూడా పడుతుందని, అందుకే ఆచితూచి స్పందించాలని చెప్పినట్టు తెలిసింది. అంతదాకా రాకూడదంటే ముందే వ్యక్తిగతంగా క్లోజ్‌ చేసుకుంటేనే మంచిదని పార్టీ భావించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న రాజకీయ సవిూకరణలతో కాపు ఓట్లు ఏ పార్టీకి గంప గుర్తుగా పడే అవకాశం లేదు. అందరూ పంచుకోవాల్సి ఉన్నందునే.. తోట త్రిమూర్తులు ఎంటరై.. ఒకవైపు ముద్రగడను దగ్గరికి తీసుకుంటూనే.. మరోవైపు ఆయన ప్రస్తావించిన అంశాలకు, కులానికి సంబంధం లేదన్నట్టుగా పిక్చర్‌ చూపిస్తున్నారట.కాపు ఉద్యమాన్ని కాపు నేతలే నడిపారని, అందరూ తలో రూపాయి వేసి రిజర్వేషన్ల కోసం పోరాడారు తప్ప ఎవరి దయాదాక్షిణ్యాలతోనో ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేయలేదంటూ సొంత సామాజిక వర్గం వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారట త్రిమూర్తులు. వ్యక్తిగతంగా ముద్రగడ చేసిన కార్యక్రమాలకు సపోర్ట్‌ చేసి ఉండొచ్చు గాని.. దాన్ని కులానికి ఆపాదించడం సరికాదంటూ?.రచ్చకు ఫుల్‌ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట తోట. మొత్తానికి ఉమ్మడి తూర్పు గోదావరిలో కాపు రాజకీయం రంజుగా జరుగుతోంది. ముద్రగడ చేసిన వ్యాఖ్యలతో డ్యామేజ్‌ అవుతోందని గ్రహించి ఆయింట్మెంట్‌ రాసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం తప్ప?ఎవరి సాయం అవసరంలేదని ఓపెన్‌ గానే ప్రకటించేస్తున్నారు.. కులం విూద అభిమానం వేరు, రాజకీయాలు వేరంటూ ఓపెన్‌ స్టేట్మెంట్స్‌ ఇచ్చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *