కలాం పేరు పొయో…జగన్‌ పేరు వచ్చే

స్వామి భక్తి ప్రదర్శించే ఆంధ్రప్రదేశ్‌ అధికారుల తీరు వల్ల తరచూ వివాదాలు తలెత్తుతూ ఉంటాయి. గతంలో అబ్దుల్‌ కలాం వ్యూ పాయింట్‌ పేరుతో వైజాగ్‌ లో ఉన్న ఓ ప్రాంతానికి వైఎస్‌ఆర్‌ వ్యూ పాయింట్‌ అని పేరు మార్చడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ అంశంపై ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వ్యూ పాయింట్‌ సీతంకొండ సవిూపంలో ఉంటుంది. నిజానికి ఈ వ్యూపాయింట్‌ ను గతంలో ప్రభుత్వం కాకుండా వైజాగ్‌ వాలంటీర్స్‌ అనే స్వచ్చంద సంస్థ .. అభివృద్ధి చేసింది. అబ్దుల్‌ కలాం పేరు పెట్టి.. వ్యూ పాయింట్‌ను ఓ మాదిరిగా అభివృద్ధి చేశారు. అయి?త ఇటీవల ఉ20 సదస్సు సుందరీకరణలో కేంద్ర నిధులు పెట్టి అభివృద్ధి చేశారు. కలాం పేరు తీసేసి.. వైఎస్‌ఆర్‌ పేరు పెట్టారు. అయితే కలాం పేరు గవర్నమెంట్‌ శాశ్వతంగా చట్టప్రకారం పెట్టాలని దీనివల్ల అబ్దుల్‌ కలాం సర్‌ కి మన వైజాగ్‌ ప్రజలు శాశ్వత గౌరవం ఇవ్వడానికి అందరి సహకారం మరియు ప్రోత్సాహం కోరుతున్నామని వైజాగ్‌ వాలంటీర్స్‌ కూడా సోషల్‌ విూడియాలో ప్రచారం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఇలా పేరు మార్పు విషయాల్లో అనేక వివాదాలు.. విమర్సలు ఎదుర్కొంటోంది. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరును వైఎస్‌ఆర్‌ హెల్త్‌ వర్శిటీగా పేరు మార్చడం పెను దుమారం రేపింది. అలాగే ప్రభుత్వ పథకాలన్నీ జగన్‌ లేదా వైఎస్‌ఆర్‌ పేరుతో ఉంటున్నాయి. చాలా భవనాలకు కూడా వైఎస్‌ఆర్‌ పేరు పెట్టారు. చివరికి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానానికి కూడా వైఎస్‌ఆర్‌ఏపీ అని పెట్టారు. ఇవన్నీ ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు పాలవుతున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. టెన్త్‌ పరీక్షల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారికి అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారాలు ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వంమారిన తర్వాత ఆ పురస్కారాల పేరును వైఎస్‌ఆర్‌ ప్రతిభా పురస్కారాలు అని మార్చారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో .. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ నిర్ణయం తీసుకున్నా ఓ అధికారిపై సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యారని .. వెంటనే మళ్లీ అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని ఆదేశించారని ప్రకంటించారు. తర్వాత ఆ అవార్డుల అబ్దుల్‌ కలాం పేరు విూదనే కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ బీచ్‌ పేరును కూడా కలాం పేరు తీసేసి వైఎస్‌ఆర్‌ పేరు పెట్టారని తెలిస్తే జగన్‌ సీరియస్‌ అవుతారమో చూడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *