తెలంగాణలో మహిళా లాభార్థి

కర్ణాటక ఎన్నికల అనంతరం బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి దృష్టిని తెలంగాణపైనే పెట్టింది. తెలంగాణను టార్గెట్‌గా ఫిక్స్‌ చేసుకుంది. ఏడాది చివరిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించే పనిలో పడిరది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్‌ను ప్రజలకు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఒక ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగింది. ‘కమల్‌ మిత్ర’ పేరుతో ఈ బృందం యాక్టివిటీని క్రమంగా పెంచనుంది.మహిళా ఓటర్లనే టార్గెట్‌గా పెట్టుకున్న కమలదళం వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలపై సవివరంగా వివరించేలా కార్యకర్తలకు శిక్షణనివ్వనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే మహిళలకు సంబంధించి ‘మహిళా లాభార్థి’ పేరిట కోటి సెల్ఫీల కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు మరో దఫా ‘కమల్‌ మిత్ర’తో చేరువవ్వాలని చూస్తోంది.‘కమల్‌ మిత్ర’ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాస్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. ఆపై మహిళా పలు రాష్ట్రాలకు చెందిన మోర్చా నేతలతోనూ మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలంగాణ బీజేపీకి చెందిన మహిళా కార్యకర్తలకు తొలిరోజు ట్రైనింగ్‌లో ఉజ్వల్‌ స్కీమ్‌పై శిక్షణనిచ్చారు. కేవలం మహిళలకు చెందిన పలు పథకాల్లో అతి ముఖ్యమైన 15 స్కీమ్స్‌ను ఎంచుకుని లబ్ధిదారులకు చేరువ చేసేలా ప్లాన్‌ చేస్తోంది.దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో పథకాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని చెబుతున్న బీజేపీ.. ఇంకా ఆ పథకాలు అందనివారెవరైనా ఉన్నారా? అని ఆరా తీయనుంది. సెంట్రల్‌ స్కీమ్స్‌ అందని వారికి పథకాలను అందించడమే టార్గెట్‌గా పెట్టుకుంది. సెంట్రల్‌ స్కీమ్స్‌లో అతి ప్రధానమైన 15 స్కీమ్స్‌ను అర్హులందరికీ అందించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది.ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ముద్ర, సపోర్ట్‌ టు ట్రైనింగ్‌ అండ్‌ ఎంప్లాయ్మెంట్‌ ప్రోగ్రాం ఫర్‌ విమెన్‌, నేషనల్‌ సోషల్‌ అసిస్టెంట్‌ ప్రోగ్రాం, సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్‌ సేవింగ్‌ స్కీం, గవర్నమెంట్‌ ఈ ` మార్కెట్‌ ప్లేస్‌, ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం, సంపూర్ణ పోషకాహారం కోసం ప్రధానమంత్రి విస్తృత పథకం, ఉద్యం సఖి తదితర స్కీమ్స్‌ ఉన్నాయి. వీటితో ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? ఎంతమందికి అందించాల్సి ఉందనే ప్రాతిపదికన లిస్ట్‌ ఔట్‌ చేయనున్నారు.ఒక్కో లోక్‌ సభకు దాదాపు 200 మంది మహిళా కార్యకర్తలను బీజేపీ ఎంపిక చేయనుంది. వారికి 15 రోజుల పాటు శిక్షణ అందించనుంది. ఒక్కో రోజు ఒక్కో స్కీమ్‌పై వర్చువల్‌ పద్ధతిలో వారికి ట్రైనింగ్‌ ఇవ్వనున్నారు. అర్హత ఉండి కూడా ఇప్పటి వరకు సెంట్రల్‌ స్కీమ్స్‌ లబ్ధికి ఎందుకు దూరమయ్యారనే కారణాలను విశ్లేషించుకున్న కాషాయ పార్టీ ఆ సమస్యకు చెక్‌ పెట్టేలా ప్రణాళికలు చేస్తోంది.ఆయా స్కీమ్స్‌ దరఖాస్తుకు కావాల్సినవేంటి? అనే చిన్న అంశం నుంచి మొదలు స్కీమ్‌ లబ్ధిదారుకు అందేవరకు నేతలు శ్రమించాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఆపై లబ్ధిదారుల డేటాను ఆన్‌ లైన్‌ ద్వారా ఎన్‌ రోల్‌ చేయాలని నేతలకు హైకమాండ్‌ దిశానిర్దేశం చేసింది. ‘కమల్‌ మిత్ర’ బృందం పూర్తిగా మహిళలకు సంబంధించిన పథకాలపైనే పని చేయనుంది. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *