దేశంలో కరువు పరిస్థితులు

న్యూఢల్లీి, ఆగస్టు 24
దేశవ్యాప్తంగా పలు జిల్లాలో ఈ వానాకాలంలో సరైన వర్షాలు లేక కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో ఈసారి జూన్‌లో ఆశించినంత వర్షాలు పడలేదు. కానీ జులైలో వానలు బాగా పడడంతో ఆ లోటు తీరింది. కానీ మళ్లీ ఆగస్టు ప్రారంభమైనప్పటి నుంచి వర్షాల జాడ లేదు. ఆగస్టు నెలలో ఇంత ఎక్కువగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం గత 124 ఏళ్లలో తొలి సారిగా జరుగుతోంది. ఈ నెలలో పలు రాష్ట్రాల్లో సగటు వర్షపాతంతో పోలిస్తే 35 శాతానికి మించి లోటు ఏర్పడిరది. రుతుపవనాల రాకను ఈ సారి ఎల్‌నిన్‌ దెబ్బ తీసిందని, దీంతో వర్షాభావ పరిస్థితులు వచ్చాయని వాతావరణ శాఖ కూడా వెల్లడిరచింది. సరైన వర్షాలు లేక దేశ వ్యాప్తంగా దాదాపు 289 జిల్లాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. 1899 ఆగస్టు నెలలో దేశ వ్యాప్తంగా అత్యధిక వర్షపాత లోటు 40 శాతం ఏర్పడిరది. ఆ తర్వాత 1931 లో ఆగస్టు నెలలో 31 శాతం నమోదైంది. కాగా ఈ ఏడాది మరోసారి అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఈ నెలాఖరుకి వచ్చేశాం. రానున్న అయిదు రోజుల్లో పెద్దగా భారీ వర్షాలు, తుపాన్లు కురిసే అవకాశాలు కూడా లేవని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. కాబట్టి ఈ నెలలో ఇలాగే వర్షాభావం కొనసాగితే ఈ నెల లోటు 40 శాతం దాటి పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత 124 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలకు వర్షాభావం ఏర్పడనుంది.తెలంగాణలోనూ ఆగస్టులో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి. ఈ నెల 1 వ తేదీ నుంచి 22 వ తేదీ వరకు రాష్ట్రంలో వర్షపాతం 166.6 మిల్లీవిూటర్లు. అంటే రాష్ట్ర సగటు వర్షపాతం కంటే 66 శాతం లోటు ఏర్పడిరది. జిల్లాల విషయానికొస్తే.. వికారాబాద్‌ జిల్లాలో ఆగస్టులో అధికంగా 93 శాతం లోటు ఏర్పడిరది. జనగామలో 90 శాతం, సిద్ధిపేటలో 83 శాతం, రంగారెడ్డి, సంగారెడ్డిలలో 82 శాతాల చొప్పున వర్షపాత లోటు ఏర్పడిరది. రాష్ట్రంలో దాదాపు ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు 42 మండలాలు వర్షపాత లోటులోనే ఉన్నాయి. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. అవి కొన్ని జిల్లాలకే పరిమతవుతున్నాయి. నెలాఖరు వరకు వర్షాలు కురవకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సగటున వర్షపాత లోటు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణ శాఖ వెల్లడిరచిన వివరాల ప్రకారం తెలంగాణలో ఈ నెలలో ఏ ఒక్క జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. జూన్‌ 1 నుంచి ఆగస్టు 22 వరకు వర్షపాత లోటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగానే ఉంది. మణిపూర్‌లో వర్షపాత లోటు 47, కేరళలో 46, రaార్ఖండ్‌లో 37, బిహార్‌లో 31, ఉత్తరప్రదేశ్‌లో 23, అస్సాంలో 18, కర్ణాటకలో 17, ఆంధ్రప్రదేశ్‌లో 16 శాతంగా నమోదైంది. ఈ ఏడాది వానాకాలంలో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందుగానే అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరించాయని, పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది. వానాకాలంలో రెండు సార్లు కురిసే వర్షాల మధ్య కొంత సమయం ఉంటుంది. ఆ సమయం పెరిగితే పంటల పెరుగుదలకు ఇబ్బంది ఏర్పడుతుంది. దేశ వ్యాప్తంగా వందల జిల్లాల్లో ఈ సమయం 20 రోజుల కంటే ఎక్కువ పెరిగింది. మామూలుగా అయితే ఇది పది రోజులే ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *