అవినీతి, అక్రమాలకు అడ్డాగా డీఐసీ

కాకినాడ కర్మాగార కార్యాలయం అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. అధికారులకు కార్యాలయం సొంతిల్లైపోయింది. ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్‌ లు వేయించుకుంటున్నారు. వారికి నచ్చినట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. లంచాలు మింగి సస్పెండైనా మళ్లీ అదే కార్యాలయంలో తిష్ట వేస్తున్నారు. దీనికిగాను లక్షలు పోసి పోస్టింగ్‌ లు కొనుగోలు చేస్తున్నారు. అసలు ఇక్కడ సిబ్బందికి విధులపట్ల బాధ్యతగానీ, నిబంధనల పట్ల గౌరవంగానీ, ప్రభుత్వమంటే భయంగానీ లేదు. దీనిపై అనేక ఫిర్యాదులు అందినా పట్టించుకునే నాథుడు లేకపోవడం గమనార్హం.కాకినాడ కర్మాగారాల శాఖ కార్యాలయలో సన్యాసిరావు అనే జూనియర్‌ అసిస్టెంటు చాలా కాలం నుంచి పని చేస్తున్నారు. ఆయన రూ.20 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడ్డారు. దీంతో సన్యాసిరావును ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. కొద్ది కాలానికి సదరు అధికారి సస్పెండ్‌ అయిన కాకినాడలోనే అదే సీటులో పోస్టింగు వేయించుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా పోస్టింగు వేయడంతో అనేక మంది ముక్కున వేలేసుకున్నారు. ఇది ఎలా జరిగిందని ఆరా తీస్తే సన్యాసిరావు జాయింట్‌ డైరెక్టరుకు దగ్గర బంధువు అని తెలిసింది. ఇంకేముంది సదరు జాయింట్‌ డైరెక్టర్‌ పలుకుబడి ఉపయోగించుకుని ఎక్కడైతే బల్ల కింద చేతులు పెట్టాడో.. అక్కడే సన్యాసిరావు దర్జాగా పోస్టింగ్‌ లో కూర్చున్నారు.కార్యాలయంలో పార్వతి అనే టైపిస్టు పని చేస్తున్నారు. తండ్రి చనిపోతే కారుణ్య నియామకం కింద పార్వతికి అటెండరుగా పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే ఈమె టైపిస్టుగా సేవలు అందిస్తున్నారు. ఏడాది కాలంలో తెలుగు టైపింగ్‌ లో ప్రావీణ్యం పొంది ధ్రువీకరణ పత్రం కూడా సంపాదించి టైపిస్టుగా కొనసాగాలని ఆదేశాలు ఇచ్చారు. నేటికి రెండో ఏడాది దగ్గర పడుతున్నా ఈమె తెలుగు టైపింగులో ప్రావీణ్యం పొందలేదు. ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించలేదు. దీంతో పార్వతి అనధికారికంగా టైపిస్టుగానే కొనసాగుతున్నారు.గోపాల్‌ అనే వ్యక్తి జూనియర్‌ అసిస్టెంటుగా సేవలు అందిస్తున్నారు. ఈయన 17 సంవత్సరాల నుంచి ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాతుకుపోయారు.అయితే ఇతనికి అంధత్వం 70 శాతం ఉందని సర్టిఫికెట్‌ సంపాదించారు. కానీ వాస్తవానికి ఇతనికి అంతగా అంధత్వం లేదు. అయితే 2019లో దొంగ ధ్రువీకరణ పత్రాలు వస్తున్నాయనే కారణంతో వికలాంగులకు సదరమ్‌ ద్వారా సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గోపాల్‌ మాత్రం సదరమ్‌ లో ధ్రువీకరణ పత్రం పొందకుండా తప్పించుకొని తిరుగుతున్నారు.కాకినాడలో ఉన్న పరిశ్రమల శాఖలో అవినీతి విూద ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. కానీ ఫలితం లేదు. కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను. ఇకనైనా ఉన్నాధికారి ఆజాద్‌ జవహర్‌ లాల్‌ స్పందించి సమగ్రమైన విచారణ చేసి అవినీతి అధికారుల భరతం పట్టాలని కోరుతున్నానని తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *