కేసులతో సమస్య పరిష్కారమా

సీపీఎస్‌ ఉద్యోగ సంఘ నేతలను కేసులతో భయపెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. చర్చల్లో ఎలాంటి పురోగతి ఉండదని తెలిసినా బొత్స, బుగ్గన నేతృత్వంలోని కమిటీ తరచూ ఉద్యోగ సంఘ నేతలను చర్చలకు పిలుస్తున్నారు. వారు అడుగుతున్నట్లుగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ను రద్దు చేయబోమని.. జీపీఎస్‌ అమలు చేస్తామని అంగీకరించాలని పట్టుబడుతున్నారు. సీపీఎస్‌ రద్దుపై మాత్రమే చర్చలకు వస్తామని వారు ఖరాఖండిగా తేల్చి చెప్పి బయటకు వచ్చేశారు. కానీ ఈ విూటింగ్‌ల వెనుక వేరే వ్యూహం ఉందని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం రేపు కేబినెట్‌ సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో సీపీఎస్‌కు బదులుగా అమలు చేయాలనుకుంటున్న జీపీఎస్‌కు ఆమోద ముద్ర వేసి.. వెంటనే అసెంబ్లీలో ఆమోదించాలనుకుంటున్నారు. అదే జరిగితే ఉద్యోగులు శాశ్వతంగా నష్టపోతారు. ఇలా చేయడానికే ఉద్యోగ సంఘాల నేతలపై కేసు కత్తి వేలాడదీశారు. ఇటీవల ఎవరూ చలో విజయవాడకు రాకపోయినా.. ఉద్యోగ సంఘాల నేతలందరిపై కుట్ర కేసులు పెట్టారు. దీంతో వారందరికీ అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తమపై పెట్టిన తప్పుడు కేసులు తొలగించాలని వారు కోరుతున్నారు. డీజీపీని కలుస్తామని చెబుతున్నారు. అయితే ఆ కేసులు తీసేయాలంటే.. సీపీఎస్‌ రద్దు డిమాండ్‌ చేయకూడదని.. జీపీఎస్‌ కు అంగీకరించాలని షరతును పరోక్షంగా పంపుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు లొంగిపోతే.. ప్రభుత్వం చిన్న చిన్న నిరసనలతో అనుకున్నట్లుగా జీపీఎస్‌ అమలు చేసేస్తుంది.
చర్చల్లేవంటున్న మంత్రి
ప్రస్తుతానికి పరిస్థితులను అర్ధంచేసుకుని జీపీఎస్‌ను అంగీకరించాలని ఏపీ మంత్రులు బొగ్గన, బొత్స సీపీఎస్‌ నాయకులను కోరారు. కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించమని వారు తెగేసి చెప్పారు. జీపీఎస్‌ సంబంధించి చాలారోజులుగా నలుగుతున్న సమస్యను పరిష్కరించేందుకు మంగళ వారం ఉద్యోగ సంఘాల నాయకులతో ఏపీ మంత్రులు చర్చకు మరోసారి ఆహ్వానించారు. కానీ వారి చర్చ లు విఫల మయ్యాయి. పాత పెన్షన్‌పై చర్చిద్దాం అన్న విూదటే చర్చలకు వచ్చామని తెలిపారు. సీపీఎస్‌లో గవర్నమెంట్‌ షేర్‌ ఈ రోజుకు ఇవ్వడం లేద న్నారు. పిలిచి మరలా జీపీఎస్‌ గురించే మాట్లాడుతున్నారని.. ఇకపై అసలు చర్చలకు పిలవవద్దు అని చెప్పామని అన్నారు.వేలాది మంది ఏపీసీపీఎస్‌యూఎస్‌ నాయకులు, టీచర్‌లపై కేసులు నమోదు చేశా రని మండిపడ్డారు. అక్రమ కేసులను రద్దు చేయాలని కోరామన్నారు. డీజీపీని కలిసి కేసులు ఎత్తి వేయా లని కోరనున్నట్లు చెప్పారు. అక్రమ కేసులు పెట్టినందున మంత్రులు బొత్స, బుగ్గనలకు వినతి పత్రం ఇచ్చామని దాసు తెలిపారు. ఏపీసీపీఎస్‌ఈఏ రాష్ట్ర అధ్యక్షులు అప్పలరాజు మాట్లాడుతూ మరో మిలియన్‌ మార్చ్‌ ద్వారా సీపీఎస్‌ మహమ్మారిని తరిమి కొట్టాలని బావించామన్నారు. గత ఏడేళ్లలో పోలీసుల అనుమతి లేకపోతే ఏ కార్య క్రమం చేయలేదని తెలిపారు. సీఎం ఇల్లు ముట్టడి నెప్పాన్ని చూపి తమకు సంబంధం లేకపోయినా కేసులు పెట్టారని మండిపడ్డారు. జిల్లా ప్రెసిడెంట్‌ను తీసుకు వెళ్లి కేసులు పెట్టారన్నారు. నిజానికి ఆరోజు స్కూల్‌లో ఉన్న నాపై సీఎం ఇంటిని ముట్టడికి కుట్రచేశానంటూ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశా రు.ఈ కేసులను వెంటనే తొలగించాలని బొత్సను కోరామన్నారు. సెప్టెంబర్‌ 11న మిలియన్‌ మార్చ్‌, చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి ఇస్తే చేస్తాము లేకపోతే మరల వాయిదా వేస్తామని అప్పలరాజు వెల్లడిరచారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *