‘జ‌వాన్‌’లో దీపికాతో.. ‘డంకీ’లో తాప్సీతో..!

షారూక్ ఖాన్‌ (Shah Rukh Khan), రాజ్‌కుమార్ హిరాణి (Rajkumar Hirani) కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’ (Dunki). రీసెంట్‌గా ‘లుట్ పుట్ గయా..’ అనే సాంగ్‌ను ‘డంకీ డ్రాప్ 2’గా మేక‌ర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. హార్డీ పాత్ర‌లో షారూక్‌, మ‌ను పాత్ర‌లో తాప్సీ మ‌ధ్య ఉండే ప్రేమ‌ను తెలియ‌జేసే ఈ పాట‌ ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందనను రాబట్టుకుంది. ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు సంగీతాభిమానులు సైతం ఈ పాట‌కు ఫిదా అయ్యారు. అయితే […]

వంద రోజుల్లో డబుల్‌ ఇస్మార్ట్‌

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న సీక్వెల్‌ మూవీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొనగా ముఖ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ పాత్ర పోషిస్తున్నారు. సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదనీ, 2024 మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు స్సష్టం చేశారు. ఈ సందర్భంగా వంద రోజుల కౌంట్‌ డౌన్‌ పోస్టర్‌ను […]

ఛీ.. ఛీ.. ఈమె అసలు తల్లేనా..? కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా..!

Woman sentenced: కేరళలో అమానుష ఘటన వెలుగుచూసింది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. తన కళ్ల ముందే ఆమెపై దారుణం జరుగుతున్నా చూసి ఉరుకుంది. కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా.. ఏమీ చెప్పలేదు. తాజాగా ఈ కేసు తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు రాగా.. న్యాయస్థానం ఆ తల్లికి 40ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే రూ.20వేల జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఫైన్ చెల్లించని పక్షంలో మరో […]

గ్యాంగ్‌స్టర్లకు బ్రూమ్‌స్టిక్‌తో చుక్కలు చూపించిన సాహస వనిత..

భివాని: రీల్ స్టోరీకి ఏమాత్రం తగ్గని రియల్ లైఫ్ ఘటన ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పిస్తోళ్లు పట్టుకున్న గ్యాంగ్‌స్టర్లు సైతం బూజుల కర్ర (Broom stick) ముందు బలాదూర్ అయ్యారు. బ్రూమ్ స్టిక్ దెబ్బకి గ్యాంగ్‌స్టర్లు కాళ్లకు బుద్ధి చెప్పారు. ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. బ్రూమ్ స్టిక్ పట్టిన హర్యానా వీర మహిళ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో హైలైట్ అయింది. ఆసక్తి రేకెత్తించిన ఈ ఘటన హర్యానాలోని భివానీలో జరిగింది. భివానీలోని దర్బార్ […]

అంజు కేసులో కొత్త ట్విస్ట్.. భర్త బయటపెట్టిన సంచలన రహస్యాలు.. మరో రెండు రోజుల్లో..

Anju Pakistan: రాజస్థాన్‌కు చెందిన అంజు అనే మహిళ గుర్తుందా? అదేనండి.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా అనే వ్యక్తి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్తాన్‌కి వెళ్లింది. మొదట్లో అతడు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పిన అంజు, ఆ తర్వాత అతడ్ని పెళ్లి చేసుకుంది. అప్పుడే ఇస్లాం మతంని స్వీకరించి, ఫాతిమాగా మారింది. అప్పటి నుంచి ఫాతిమా, నస్రుల్లా దాంపత్య జీవితం సజావుగానే సాగింది. ఇప్పుడు వీరి వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మరో రెండు […]

మసీదులను కూల్చివేయాలన్న స్వీడిష్ నాయకుడి ప్రకటనపై వివాదం.. ప్రధానికి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి

ఒక హోదాలో ఉన్న నాయకులు అప్పుడప్పుడు తమ నోటికి పని చెప్తుంటారు. సున్నితమైన విషయాలపై సంచలన వ్యాఖ్యలు చేసి, సరికొత్త వివాదాలకు తెరలేపుతుంటారు. ముఖ్యంగా.. మతపరమైన అంశాల జోలికి వెళ్లి, లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తుంటారు. తాజాగా స్వీడెన్‌కి చెందిన జిమ్మీ అకెసన్ అనే నాయకుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రజాస్వామ్య వ్యతిరేక, స్వీడిష్ వ్యతిరేక, యూదు వ్యతిరేక ప్రచారాన్ని వ్యాప్తి చేసే మసీదులను ఆక్రమించుకొని.. వాటిని కూల్చివేయాలని కుండబద్దలు కొట్టాడు. దీంతో.. ఈ వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా పెను […]

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌ ఆపరేషన్‌కు శ్రీసిటీలోని ‘బీ-రోలెక్స్‌’ సాంకేతిక సహకారం

ఉత్తరాఖండ్‌ టన్నెల్‌లో చిక్కుకుపోయిన కూలీలను కాపాడిన బృందంలో తిరుపతి జిల్లా శ్రీసిటీలోని బీ-రోలెక్స్‌ పరిశ్రమ టీమ్‌ కీలక పాత్ర పోషించింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా వద్ద నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో 41 మంది కూలీలు టన్నెల్‌లోనే చిక్కుకుని, 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. అయితే వారిని బయటకు తీసుకొచ్చేందుకు అవిశ్రాంతంగా చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌కు శ్రీసిటీలోని బీ-రోలెక్స్‌ పరిశ్రమ సాంకేతిక సహకారం అందించింది. నవంబరు […]

ద్రవిడ్‌ కాంట్రాక్టు పొడిగింపు

భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కాంట్రాక్టును బీసీసీఐ బుధవారం పొడిగించింది. ద్రవిడ్‌ రెండేళ్ల పదవీకాలం వరల్డ్‌ కప్‌ ఫైనల్‌తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే మెగా టోర్నమెంట్‌లో రోహిత్‌ సేన అద్భుతంగా ఆడిన నేపథ్యంలో..ఆ జోరును కొనసాగించేందుకు ద్రవిడ్‌ కాంట్రాక్టును పొడిగించాలని బోర్డు నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఈ పొడిగింపు ఎన్ని సంవత్సరాలనేది మాత్రం వెల్లడించలేదు. ద్రవిడ్‌తోపాటు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ […]

హార్దిక్ వస్తే బుమ్రా ముంబైను వీడుతాడా? బుమ్రా ఆవేదనకు కారణం అదేనా?..

టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సోషల మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇండియన్ ప్రీమియార్ లీగ్ (IPL)లో తను ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ (MI) టీమ్‌ను సోషల్ మీడియాలో అన్-ఫాలో చేయడం కూడా సందేహాస్పదంగా మారింది. ఆల్ రౌండర్ హార్దిక్ ప్యాండ్యాను (Hardik Pandya) తిరిగి వెనక్కి తీసుకోవాలన్న ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై అసంతృప్తితోనే బుమ్రా అలా చేశాడని అందరూ […]

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్‌

హైదరాబాద్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ఏడు గంటలకు ప్రారంభమైంది. పోలింగ్‌ ప్రక్రియకు ముందు ఎన్నికల సిబ్బంది మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యా ప్తంగా 119 నియోజకవర్గాల్లో 2,290 మంది ఎన్నికల పోటీలో ఉన్నారు. మొత్తం పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 2,067 మంది పురుషులు కాగా, 222 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇద్దరు థర్డ్‌ జెండర్లు పోటీలో ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.రాష్ట్రంలో 3,26,18,205 మంది ఓటర్లలో 1,63,13,268 మంది పురుషు […]