హైకోర్టు నుంచి ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ

మద్రాస్‌ హైకోర్టు(Madras High Court)కు చెందిన ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గురువారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ టి.రాజాను రాజస్థాన్‌కు, న్యాయమూర్తి జస్టిస్‌ వీఎం వేలును కోల్‌కతాకు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ బట్టు దేవానంద్‌ను, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ డాక్టర్‌ డి.నాగార్జునను మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది. అంతేగాక ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(High Court of Andhra Pradesh) న్యాయమూర్తిగా వున్న జస్టిస్‌ డి.రమే్‌షను అలహాబాద్‌కు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులైన జస్టిస్‌ కన్నెగంటి లలితను కర్ణాటకకు, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిని పాట్నాకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. వాటిని పరిశీలించిన కేంద్రం.. రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం ఈ సిఫారసులు అమలులోకి వస్తాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *