ఆసీస్‌దే ఆధిక్యం
లండన: యాషెస్ రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. భారీ స్కోరు ఖాయమనుకున్న ఇంగ్లండ్ జట్టును బౌలర్లు కట్టడి చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ నిలకడ ప్రదర్శిస్తోంది. వెరసి ఇప్పటికే కంగారూల ఆధిక్యం 221 పరుగులకు చేరింది. వర్షం కారణంగా మూడో రోజు ఆటను కాస్త ముందుగా నిలిపివేసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 45.4 ఓవర్లలో 2 వికెట్లకు 130 పరుగులు చేసింది. క్రీజులో ఖవాజా (58 బ్యాటింగ్), స్మిత (6 బ్యాటింగ్) ఉన్నారు. వార్నర్ (25), లబుషేన (30) అవుటయ్యారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (50) అర్ధసెంచరీ సాధించాడు. స్టార్క్‌కు మూడు, హాజెల్‌వుడ్‌కు రెండు వికెట్లు దక్కాయి. గురువారం ఆఖరి సెషనలో గాయపడిన స్పిన్నర్ లియాన.. ఈ సిరీ్‌సలో ఆడేది సందేహంగా మారింది.
వికెట్లు టపటపా:
రెండో రోజు ఆటలో వేగం కనబర్చిన ఇంగ్లండ్ శుక్రవారం మాత్రం దారుణంగా తడబడింది. 278/4 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించగా.. క్రీజులో బ్రూక్, స్టోక్స్ ఉండడంతో భారీ స్కోరు ఖాయమే అనిపించింది. కానీ ఆసీస్ బౌలర్ల తడాఖాకు తొలి సెషన కూడా పూర్తిగా ఆడలేకపోయింది. చివరి ఆరు వికెట్లను 47 పరుగులకే కోల్పోవడం గమనార్హం. ఆకాశం మబ్బు పట్టి ఉండడం, చల్లటి వాతావరణం కారణంగా పిచ బౌలర్లకు అనుకూలించడంతో ఆతిథ్య జట్టుకు పరుగులు రావడం కష్టంగా మారాయి. సెషన రెండో బంతికే స్టోక్స్‌ను స్టార్క్ అవుట్ చేయడంతో వికెట్ల పతనం ఆరంభమైంది. ఇక తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో ఐదు రన్స జోడించిన బ్రూక్ కూడా కమిన్స షార్ట్ పిచ బాల్‌కు వెనుదిరిగాడు. అలాగే బెయిర్‌స్టో (16) స్వల్ప స్కోరుకే వెనుదిరగడంతో ఇక టెయిలెండర్ల ఆట ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో ఆసీ్‌సకు 91 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్:
416 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 325 ఆలౌట్ (డకెట్ 98, బ్రూక్ 50, క్రాలే 48; స్టార్క్ 3/88, హెడ్ 2/17, హాజెల్‌వుడ్ 2/71); ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 45.4 ఓవర్లలో 130/2 (ఖవాజా 58 బ్యాటింగ్; లబుషేన 30, వార్నర్ 25; టంగ్ 1/21).