బలపడుతున్న జనసేన

గత ఎన్నికల్లో జనసేన పార్టీకి ఘోరమైన ఫలితాలు వచ్చిన విషయం తెల్సిందే?కేవలం ఆ పార్టీకి ఒక సీటు మాత్రమే దక్కింది?అలాగే పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. అయితే ఇదంతా గత ఎన్నికల విషయం?కానీ ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార వైసీపీ బలం నిదానంగా తగ్గుతూ వస్తుంది?అదే సమయంలో టీడీపీ బలం కాస్త పెరుగుతుంది. అలాగే జనసేన బలం కూడా కొద్దిగా పెరుగుతూ వస్తుంది.వైసీపీకి మైనస్‌ అయ్యే ప్రతి ఓటు?టీడీపీకి లేదా జనసేనకు ప్లస్‌ అవుతుంది. అయితే నెక్స్ట్‌ ఎన్నికల్లో జనసేన ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ తో పొత్తు ఉంటే రాజకీయం వేరుగా ఉంటుంది..అప్పుడు జనసేనకు మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ సింగిల్‌ గా పోటీ చేస్తే గత ఎన్నికల్లో మాదిరిగా దారుణమైన ఫలితాలు రావు గాని?ఈ సారి కాస్త బెటర్‌ ఫలితాలు వస్తాయని తెలుస్తోంది.ముఖ్యంగా కొన్ని సీట్లలో వైసీపీ`టీడీపీలకు ధీటుగా జనసేన ఎదుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో జనసేన?ఓ రెండు సీట్లలో మాత్రం ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన రాజోలులో మరోసారి జనసేనకు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వైసీపీపై నెగిటివ్‌ ఉంది..అటు టీడీపీ పెద్దగా బలపడలేదు. అదే సమయంలో జనసేనకు స్ట్రాంగ్‌ ఓటింగ్‌ ఉంది. ఇక్కడ జనసేనకు గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక రెండోది..గత ఎన్నికల్లో జనసేన తక్కువ ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన నరసాపురం అసెంబ్లీ?ఇక్కడ జనసేన పక్కాగా గెలవచ్చని సర్వేలు చెబుతున్నాయి. పవన్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలవడం సులువే అని చెప్పొచ్చు. మొత్తానికైతే జనసేనకు ఆ రెండు సీట్లలో డౌట్‌ లేదు
జనసేనలోకి బాలినేని
ట్విట్టర్‌ వేదికగా పవన్‌ కళ్యాణ్‌ విసిరిన చేనేత ఛాలెంజ్‌ ను వైసీపీ నేత బాలినేని స్వీకరించారు. చేనేత వస్త్రాలతో రూపొందించిన చొక్కా ధరించి ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు బాలినేని. ట్విటర్‌ వేదికగా చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత దుస్తులు ధరించి ఫొటోలు దిగాలంటూ పవన్‌ కళ్యాణ్‌ చేసిన చేనేత సవాల్‌ ను స్వీకరించానని వెల్లడిరచారు వైసీపీ సీనియర్‌ నేత బాలినేని.నేను చిత్తశుద్ధితో చేనేత మంత్రిగా వైఎస్‌ ప్రభుత్వంలో పని చేశానని.. ఆనాడు వైఎస్సార్‌ రూ. 300 కోట్లు చేనేతల కోసం రుణమాఫీ చేశారని వెల్లడిరచారు. ఇవాళ మా నాయకుడు జగన్‌ ప్రభుత్వంలోనూ నేతన్నల సంక్షేమం కోసం వైఎస్సార్‌ నేస్తం దగ్గర నుంచి ఎన్నో పథకాలు అందిస్తున్నామని వివరించారు.అప్పుడైనా, ఇప్పుడైనా చేనేతల సంక్షేమంకోసం, వారి అభివృద్ధికోసం నిజాయితీతో పని చేస్తున్నామన్నారు. అందరూ చేనేత వస్త్రాలు ధరించండని పిలుపునిచ్చారు. అయితే.. పవన్‌ కళ్యాణ్‌ ఛాలెంజ్‌ విసరగానే వైసీపీ సీనియర్‌ నేత బాలినేని.. స్వీకరించడంతో.. ఏపీ రాజకీయాలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. జనసేన పార్టీలోకి బాలినేని వెళుతాడంటూ ప్రచారం మొదలైంది. కాగా.. మంత్రి వర్గ విస్తరణ తర్వాత వైసీపీపై బాలినేని అసంతృప్తిలో ఉన్నట్లు సమచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *