లోకేష్‌ వర్సెస్‌ కేతిరెడ్డి…

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, టీడీపీ నాయకుడు నారా లోకేస్‌ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూ అక్రమాలపై విచారణ జరిపిస్తామని లోకేష్‌ ప్రకటించారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సవిూపంలోని ఎర్రగుట్టను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆక్రమించి విలాసవంతమైన ఫామ్‌ హౌస్‌ నిర్మించుకున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేతిరెడ్డి భూకబ్జాలపై ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తామని ప్రకటించారు. గుట్టపై విలాసవంతమైన భవనంతో పాటు అందులో రేసింగ్‌ ట్రాక్‌, గుర్రపు స్వారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారని లోకేష్‌ ఆరోపించారు.ధర్మవరం రెవెన్యూ పరిధిలోని 902 నుంచి 909 సర్వే నంబర్లలో ఎర్రగుట్ట పైన ఉన్న 15 ఎకరాలను దొంగ పత్రాలు సృష్టించి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాజేశారని ఆరోపించారు. ఎర్రగుట్టపై భూములను కొట్టేయడానికి అక్రమంగా లింకు డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిపారు. హైదరాబాదుకు చెందిన ఓ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి సదరు సర్వేనెంబర్‌ పై రుణాలు తీసుకున్నట్లు డాక్యుమెంట్లు తయారుచేశారని.. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో వాటిని వేలంలో తమ కుటుంబ సభ్యులు కొన్నట్లు రికార్డులు తయారుచేసి భూములను కొట్టేశారని ఆరోపించారు.ఎర్రగుట్టపై మరో 5 ఎకరాలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కుటుంబంలోని మహిళ పేరుతో ఆన్లైన్లో నమోదు చేశారని.. ఇవి పిత్రార్జితంగా ఆమెకు సంక్రమించినట్లు రికార్డుల్లో చూపారన్నారు. ఆమెది కర్నూలు జిల్లా అయితే ఇక్కడి వారికి వివాహం చేశారని లోకేష్‌ ఆరోపించారు. కర్నూలు జిల్లాకు చెందిన మహిళ తండ్రికి ఇక్కడ గుట్టపై భూమి ఎలా సంక్రమించిందని అధికారుల్ని ప్రశ్నించారు.ఎర్రగుట్టపై ఉన్న సర్వే నంబర్లకు సంబంధించి రికార్డులు సమర్పించాలని ఆర్‌.టి.ఐ ద్వారా అడగితే వాటికి సంబంధించిన రికార్డులు లేవంటూ అధికారులు సమాధానం ఇస్తున్నారని చెప్పారు. రికార్డుల్లో లేని భూమి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పేరుతో ఎలా నమోదు అయిందని ప్రశ్నించారు. తెదేపా అధికారంలోకి రాగానే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భూ అక్రమాలతో పాటు రాష్ట్రంలోని వైకాపా ఎమ్మెల్యేలందరి అవినీతిపై ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.నారా లోకేష్‌ ఆరోపణలతో ధర్మవరం ఎమ్మెల్యే ఉండవల్లిలో ప్రత్యక్షమయ్యారు. కరకట్ట విూద సిఎం నివాసం ఎలా కట్టారని ప్రశ్నించారు. నదిని ఆక్రమించి నిర్మించిన ఇంట్లో చంద్రబాబు నాయుడు ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. కృష్ణా నదిలో అక్రమ కట్టడాలని చెప్పిన చోట ఎలా నివాసం ఏర్పరచుకున్నారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు నివాసమే అక్రమమమని, కబ్జా చేసిన ఇంట్లో చంద్రబాబు నాయుడు కుటుంబం నివాసాన్ని ఏర్పాటు చేసుకుందని ఆరో?పించారు. ధర్మవరంలో తన భూములకు రికార్డులు ఉన్నాయని ప్రకటించారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎర్రగుట్ట విూద ఉన్న భూముల్ని రైతుల నుంచి కొన్నానని పేర్కొన్నారని, రికార్డులు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్స్‌ ప్రకారం.. కేతిరెడ్డి తమ్ముడు భార్య గాలి వసుమతి పేరుతో కొన్నది కేవలం 25.38 ఎకరాలు మాత్రమేనని లోకేష్‌ చెప్పారు. గుట్టపైన మొత్తం 45 ఎకరాలు ఆక్రమణలో ఉందని, మిగిలిన 20 ఎకరాలు మొత్తం కబ్జా చేశారన్నారు. గూగుల్‌ మ్యాప్స్‌ ఆధారంగా కేతిరెడ్డి ల్యాండ్‌ ను కొలవగా 45.47 ఎకరాలుగా చూపిస్తోందని, మిగిలిన 20 ఎకరాలు ఎక్కడినుంచి వచ్చిందని ప్రవ్నించారు. దమ్ముంటేఎర్రగుట్టపై ఉన్న భూమిని కొలిపించే దమ్ము ఉందా అని లోకేష్‌ నిలదీశారు.ఎర్రగుట్టపై సర్వే నంబర్లు 904, 905, 908, 909 లో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ్ముడి భార్య గాలి వసుమతి పేరుతో రైతుల నుంచి భూములు కొన్నట్టు రికార్డులో ఉందని, . మొత్తం రైతుల నుంచి 25.38 ఎకరాలు కొన్నట్టు రికార్డుల్లో ఉందని, ఇందులో 8 ఎకరాలు పిత్రార్జితంగా వచ్చినట్లు రికార్డులో ఉందని, కర్నూలుకు చెందిన గాలి వసుమతికి ఇక్కడ వంశపారపరంగా భూములు ఎలా సంక్రమించాయని ప్రశ్నించారు. మొత్తం రికార్డుల ప్రకారం కేతిరెడ్డి కుటుంబం కొనుగోలు చేసింది కేవలం 25.38 ఎకరాలు మాత్రమే అని వివరించారు.ఎర్రగుట్టపై మొత్తం 45.47 ఎకరాలు ఆక్రమించుకొని విలాసమంతమైన ఫామ్‌ హౌస్‌, తోటలు, బోటింగ్‌ లాంటివి ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు. . కేతిరెడ్డి అక్రమాన్ని గూగుల్‌ మ్యాప్‌ పట్టించింది. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా కేతిరెడ్డి స్వాధీనంలో ఉన్న భూమిని కొలువగా 45.47 ఎకరాలు చూపిస్తోంది. రికార్డుల్లో 25.38 ఎకరాలు మాత్రమే ఉందని, మిగిలిన 20 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందని, దీనికి ఏం సమాధానం చెప్తావు కేతిరెడ్డి అని నిలదీశారు. అధికారులు అబద్ధం చెప్పినా గూగుల్‌ అబద్ధం చెప్పదుగా అన్నారు.ప్రతీ రోజూ ధర్మవరం వీధుల్లో కేతిరెడ్డి యాక్టింగ్‌ మంగళగిరి కరకట్ట కమల్‌ హాసన్‌ని మించి పోతోందని నియోజకవర్గంలో ఏ అక్రమం అడ్రస్‌ లాగినా నీ దగ్గరే తేలుతోందన్నారు. ఏ కబ్జా కదిపినా గుడ్‌ మార్నింగ్‌ కేటురెడ్డిదేనని స్పష్టం అవుతోందని, చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్‌ నుంచి తరలించే టిప్పర్లన్నీ కేటువేనంటున్నారని గుడ్‌ మార్నింగ్‌ షూటింగ్‌లో ఎర్రగుట్ట కబ్జా, చెరువు పూడ్చి ఫాంహౌస్‌ కట్టుకోవడం, వందల ఎకరాల కబ్జా, చిత్రావతి నది నుంచి ఇసుక మాఫియా ఎపిసోడ్ల స్కిట్ల షూట్‌కి ఎప్పుడూ ప్లాన్‌ చేయలేదా అని లోకేష్‌ ఎద్దేవా చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *