పొలిటికల్‌ బ్రాండిరగ్‌ లో పార్టీలు

విజయవాడ, ఆగస్టు 18
ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన రాజకీయ పార్టీలు బ్రాండిరగ్‌ వలలో చిక్కుకున్నాయి. ప్రజల్లో తమ పార్టీకే బలముందని నిరూపించుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో బలాన్ని నిరూపించుకోడానికి కోట్లాది రుపాయల ఖర్చుకు వెరవడం లేదు. ఆంధ?రప్రదేశ్‌ రాజకీయాలను ఇప్పుడు బ్రాండిరగ్‌ వెంటాడుతోంది. పొలిటికల్‌ కన్సల్టెంట్లు, సెఫాలజిస్టులు, సర్వేలు, చెల్లింపు వార్తల శకం ముగిసి పార్టీలకు జనంలో గుర్తింపు తెచ్చే బాధ్యతను ప్రముఖ బ్రాండ్లకు అప్పగిస్తున్నారు. సామాన్య జనాలకు అంతుచికక్ని ఈ కొత్త తరం వ్యూహాలను తెరపైకి తెస్తున్నారు.కొన్నేళ్ల క్రితం ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో చంద్రబాబుకు రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని భావించి ఓ అంతర్జాతీయ పిఆర్‌ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. నెలకు దాదాపు రెండున్నర కోట్ల వరకు ఆ సంస్థకు చెల్లించేవారు. 2019 ఎన్నికలకు ఏడాదిన్నర నుంచి ఈ తంతు మొదలైంది. పత్రికల్లో వార్తల నుంచి ప్రకటనల వరకు, ముఖ్యమంత్రి పర్యటనల నుంచి ప్రసంగాల వరకు ప్రతి విషయంలో ఈ కన్సల్టెంట్లు జోక్యం చేసుకునే వాళ్లు. చివరకు మొత్తం గందరగోళం చేసి చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి పాలవడం వేరే విషయం.
ఏపీలో 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి బ్రాండిరగ్‌ తీసుకురావాలనే ఆలోచన ఆయన చుట్టూ ఉండే అధికారులకు వచ్చింది. ఆలోచన రావడం ఆలశ్యమన్నట్లు ముఖ్యమంత్రిని అందుకు ఒప్పించారు. ఢల్లీి స్థాయిలో వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ప్రభుత్వానికి సానుకూలంగా జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడానికి పేరున్న ఓ పిఆర్‌ సంస్థ ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంస్థకు ఇప్పటికీ ప్రతి నెల లక్షల్లో చెల్లింపులు జరుగుతున్నాయి. విూడియాలో ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం కల్పించడంతో పాటు ఢల్లీి స్థాయిలో వివిధ శాఖలో పనులు చక్కబెట్టే బాధ్యతలు ఆ సంస్థ చూస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఈ సంస్థ సేవలు అందిస్తుండగానే 2020 తొలినాళ్లలో ఏపీ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో బ్రాండిరగ్‌ తీసుకొచ్చేందుకు ఓ జాతీయ టీవీ ఛానల్‌తో ఒప్పందం చేసుకున్నారు. ప్రతినెల ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడంతో పాటు ప్రభుత్వం తరపున చేపట్టే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించే బాధ్యతల్ని ఆ సంస్థకు అప్పగించారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ సంస్థతో ఏపీ ప్రభుత్వానికి ఒప్పందం నడుస్తోంది. ఈ సేవల్ని అందించేందుకు టెండర్లు పిలిచిన సమయంలో దాదాపు రూ.11కోట్ల రుపాయలకు ఖరారైనా ఆ తర్వాత దానిని రూ.8.5కోట్లకు పరిమితం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టే సమ్మిట్‌లు, ఇతర రాష్ట్రాల్లో నిర్వహించే సదస్సులు, సమావేశాలు, ఒప్పంద కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు ఈ సంస్థకు అప్పగించారు. ఈవెంట్‌ మేనేజ్మెంట్‌లో పేరొందిన ఈ సంస్థ అతిథుల్ని ఆహ్వానించడం నుంచి కార్యక్రమ నిర్వహణ వరకు అంతా తానై చూసుకుంటుంది. విశాఖలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని కూడా ఇదే సంస్థ చేపట్టింది. అందుకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించారు.ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. నెలల దూరంలోకి సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారాలు కూడా ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీల బలాబలాల విూద సర్వే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరి బలం ఏమిటనే అంచనాలు వెలువడుతున్నాయి. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంస్థల నుంచి సైతం సర్వేలు వెలువడుతుండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా ప్రధానంగా పార్టీ క్యాడర్‌లో మనోస్థైర్యాన్ని నింపడం, ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధమయ్యేలా చూడటం, వలసల్ని నిరోధించడం, గెలుపుపై భరోసా ఇచ్చే లక్ష్యాలతో కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల నెల రోజుల వ్యవధిలోనే వెలువడిన పలు సంస్థల సర్వే ఫలితాలు ఒకే తరహాలో ఉండటం వెనుక ఇదే కారణమని చెబుతున్నారు.ఇటీవల వెలువడుతున్న సర్వేల్లో ప్రముఖ సంస్థల పేర్లకు విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో పేరున్న ఓ పత్రిక తమకు ఏపీలో జరుగుతున్న ఎన్నికల సర్వేలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వానికి సేవలు అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు సదరు పత్రికకు ఎలాంటి సంబంధం ప్రతిపక్ష పార్టీల నేతలకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది.ఒకే గ్రూప్‌కు చెందిన ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌ సంస్థలు గత మార్చిలోనే విడిపోయినట్లు చెబుతున్నారు. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పంపకంలో భాగంగా సర్వేలు నిర్వహించే టీవీ, డిజిటల్‌ సంస్థలకు తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోడానికి వీలుగా డిజిటల్‌ కాంపెయిన్‌ చేయడం, ప్రజల మైండ్‌ సెట్‌ను అందుకు సిద్దం చేయడం, గెలుపు ధీమా కల్పించడం ద్వారా ప్రత్యర్థుల్ని గందరగోళానికి గురి చేయడం వంటి వ్యూహాలను ప్రధాన రాజకీయ పార్టీ అమలు చేస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల మానసిక స్థైర్యం దెబ్బతీయడంతో పాటు తామే గెలవబోతున్నామనే విశ్వాసాన్ని పార్టీ శ్రేణుల్లో నింపే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల ప్రయత్నాలు తెరపైకి వస్తున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *