సుబ్బారెడ్డికి కీలక బాధ్యతలు

ఒంగోలు, ఆగస్టు 7
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నారు. ఒక పదవి మార్పుతో పార్టీలో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయితిరుమల తిరుపది దేవస్థానం ఛైర్మన్‌ గా భూమన కరుణాకర్‌ రెడ్డి రెండో సారి బాధ్యతలను స్వీకరించనున్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో టీటీడీ ఛైర్మన్‌ గా పని చేసిన ఆయన ఇప్పుడు మరోసారి ఛైర్మన్‌ గా నియమితులయ్యారు. ఛైర్మన్‌ గా భూమన కరుణాకర్‌ రెడ్డి నియామకం పార్టీలో హాట్‌ టాపిక్‌ గా మారింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా భూమన కరుణా కర్‌ రెడ్డి ఛైర్మన్‌ గా పని చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో భూమన కరుణాకర్‌ రెడ్డి ఛైర్మన్‌ గా ఛార్జ్‌ తీసుకోనున్నారు. తిరుపతి శాసన సభ్యుడిగా ఉన్న భూమన టీటీడీ ఛైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టనున్న క్రమంలో ఇప్పటి వరకు ఛైర్మన్‌ గా సేవలు అందిస్తోన్న వై.వి. సుబ్బారెడ్డి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. 2019 నుండి టీటీడీ ఛైర్మన్‌ గా వై.వి. సుబ్బారెడ్డి పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన స్దానంలో భూమన కరుణాకర్‌ రెడ్డికి భాద్యతలను అప్పగించారు. దీంతో సుబ్బారెడ్డి రిలీవ్‌ కాబోతున్నారు. అయితే తరువాత రోజుల్లో సుబ్బారెడ్డి పాత్ర ఎలా ఉంటుందన్న అంశంపై పార్టీ నేతల్లో చర్చ మొదలైందివై.వి. సుబ్బారెడ్డికి వైఎస్‌ కుటుంబంతో అత్యంత దగ్గర బంధుత్వం ఉంది. అంతే కాదు పార్టి వ్యవహరాల్లో ఇప్పటి వరకు సుబ్బారెడ్డి కీలకంగా ఉంటున్నారు. అటు పార్టీ కార్యకలాపాలు, ఇటు ప్రభుత్వ వ్యహరాలను సైతం, సుబ్బారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఇక ఢల్లీి వేదికగా పార్టీ వ్యవహరాలు, రాజకీయ పరిణామాలు పరిశీలించి తిరిగి మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావటం కీలకంగా సుబ్బారెడ్డి భాద్యతలు ఉంటాయని అంటున్నారు. పార్లమెంట్‌ లో అత్యధిక ఎంపీలు ఉన్న పార్టీగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టి నాలుగో స్దానంలో ఉంది. దీంతో కేంద్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టి కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పార్టి కార్యకలాపాలపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టేందుకు జగన్‌ వ్యూహ రచన చేస్తున్నారు. దీంతో ఢల్లీిలో కీలకంగా వ్యహరించాలంటే, అత్యంత నమ్మకస్తులు, పార్టీకి విధేయులు కావాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్‌ కేంద్ర బాధ్యతలను అప్పగించనున్నారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ ఫ్రెండ్‌ షిప్‌ చేస్తోంది. కీలక వ్యవహరాల్లో సైతం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టికి చెందిన ఎంపీలు బీజేపీకి సపోర్ట్‌ చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో ఉన్న పరిచయాలతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర స్దాయిలో పొత్తుల వ్యవహరం కూడా కీలకం కానుంది. కనుక కేంద్రంతో ఎప్పటికప్పుడు టచ్‌ లో ఉంటూ, అక్కడ పరిస్థితులు, రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని అంచనాలు వేసుకుంటూ రాజకీయాలు నడపాలంటే, ప్రస్తుతం ఉన్న విజయసాయి రెడ్డికి తోడుగా సుబ్బారెడ్డి పార్టీ కోసం జాతీయ స్థాయిలో పనిచేసే అవకాశం కనిపిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *