కారులోనే కామ్రేడ్లు

హైదరాబాద్‌, జూలై 1
మునుగోడు ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన సీపీఐ, సీపీఎం?ఆ తర్వాత గులాబీ పార్టీతో పొత్తు మాట కోసం తెగ వెయిట్‌ చేశారు. అయితే ఎత్తిపొడుపు మాటలే తప్ప పొత్తుపొడుపు మాటలు వినిపించలేదు. పొత్తుల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ తమకు సీట్లు కేటాయిస్తుందనే సీటు న్యూస్‌ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూశారు కామ్రేడ్లు.అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ మగ్దూం భవన్‌లో వామపక్షాల నేతలు భేటీ అయ్యారు. ఎన్నికలు, పొత్తులు, సీట్ల కేటాయింపులపై ప్రధానంగా చర్చించారు. పది రోజుల వ్యవధిలో వామపక్షాల నేతలు రెండోసారి భేటీ అయ్యారు. ఎన్నికల్లో సింగిల్‌గా వెళ్లాలా.. అధికార పార్టీతో వెళ్లాలా అన్న దానిపై సమాలోచనలు చేశారు. సమావేశం తర్వాత బీఆర్‌ఎస్‌తోనే కలిసి ప్రయాణం చేయాలని వామపక్షాలు నిర్ణయించాయి. కేసీఆర్‌తో మైత్రి కొనసాగుతుందని స్పష్టం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తులు ఉండవంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతోపాటు వామపక్ష పార్టీలు రెండు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. బీజేపిని ఓడిరచగలిగేది బీఆర్‌ఎస్సే అంటున్నాయి వామపక్షాలు.సమయం వచ్చినప్పుడు బీఆర్‌ఎస్‌తో పొత్తులు, సీట్ల లెక్కలు తేలతాయంటున్నారు తమ్మినేని. బీఆర్‌ఎస్‌తో కలిసి ముందుకు సాగాలని కామ్రేడ్లు నిర్ణయించడంతో తెలంగాణలో పొలిటికల్‌ ఈక్వేషన్లు మారే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక మరో వైపు వామపక్షాలు, ఇంకోవైపు ఎంఐఎం పార్టీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరం జరగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఓటమి పాలవుతుందన్న అంఛనాలో వున్న కమ్యూనిస్టులు కాంగ్రెస్‌ పార్టీతో దోస్తీ కట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. చెరి 5 అసెంబ్లీ సీట్లు ఇస్తే చాలన్న సంకేతాలను సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు టీపీసీసీ అధినాయకత్వానికి పంపినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న కొత్త అలయెన్సులో కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేస్తున్న కమ్యూనిస్టులు రాష్ట్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీతో కల్వడం మంచిది కాదన్న అభిప్రాయంలో కమ్యూనిస్టు పార్టీల నేతలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత తొమ్మిదేళ్ళుగా కేసీఆర్‌తో అవగాహనతో పని చేస్తున్న ఎంఐఎం పార్టీ కూడా బలం పెంచుకునేందుకు అధికార పార్టీని టార్గెట్‌ చేస్తోంది. తెలంగాణవ్యాప్తంగా 40 సీట్లలో పోటీకి దిగాలని అసదుద్దీన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముస్లింల జనాభా ఎక్కువగా వున్న నియోజకవర్గాలను ఎంచుకుని పోటీకి దిగాలని, ప్రస్తుతమున్న ఏడు సీట్లను కనీసం 15కు పెంచుకుని, తెలంగాణలో కింగ్‌ మేకర్‌ కావాలన్న వ్యూహంలో ఓవైసీ సోదరులున్నట్లు తెలుస్తోంది. మొత్తవ్మిూద తెలంగాణ రాజకీయం రోజురోజుకూ పసందుగా మారుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *