ఆసీస్‌కు జోష్‌

లఖ్‌నవూ: వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియా స్థాయికి తగ్గ ఆటతీరుతో చెలరేగింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ పుంజుకుని తాజా ప్రపంచక్‌పలో తొలి విజయాన్ని రుచి చూసింది. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. అటు లంకకిది హ్యాట్రిక్‌ పరాజయం. స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా (4/47) కీలక వికెట్లతో లంకను కట్టడి చేయగా.. ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ (51 బంతుల్లో 9 ఫోర్లతో 52) ఫామ్‌ను చాటుకున్నాడు. అలాగే జోష్‌ ఇన్‌గ్లి్‌స (59 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 58) అర్ధసెంచరీ చేయడంతో ఆసీస్‌ సునాయాసంగా మ్యాచ్‌ను ముగించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్లు కుశాల్‌ పెరీర (78), నిస్సాంక (61), అసలంక (25) మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగా.. మిగతా ఎనిమిది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కమిన్స్‌, స్టార్క్‌లకు రెండేసి వికెట్లు తగ్గాయి. అనంతరం స్వల్ప ఛేదనలో ఆసీస్‌ 35.2 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది. లబుషేన్‌ (40), మ్యాక్స్‌వెల్‌ (31 నాటౌట్‌) రాణించారు. మధుశంకకు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా జంపా నిలిచాడు.

సునాయాసంగా..: స్వల్ప ఛేదనను ఆసీస్‌ పెద్దగా ఇబ్బందిపడకుండానే ముగించింది. ఇటీవలి కాలంలో అంతగా ఆకట్టుకోలేకపోతున్న ఓపెనర్‌ మార్ష్‌ లంకపై చెలరేగాడు. వార్నర్‌ (11), స్మిత్‌ (0)లను మూడో ఓవర్‌లోనే మధుశంక పెవిలియన్‌కు చేర్చినా ఆసీస్‌ ఒత్తిడికి లోను కాలేదు. మార్ష్‌ స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించగా.. లబుషేన్‌ చక్కగా సహకరించాడు. ఇద్దరూ మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించాక, 15వ ఓవర్‌లో రెండో పరుగు కోసం వెళ్లి మార్ష్‌ రనౌటయ్యాడు. ఆ తర్వాత లబుషేన్‌కు ఇన్‌గ్లి్‌స జత కలవడంతో స్కోరులో మరింత వేగం పెరిగింది. ఇన్‌గ్లి్‌స బంతికో పరుగు చొప్పున ఆడి లంకపై ఒత్తిడి పెంచుతూ అర్ధసెంచరీ సాధించాడు. నాలుగో వికెట్‌కు 77 పరుగులందించి ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగినా.. మ్యాక్స్‌వెల్‌, స్టొయినిస్‌ (20 నాటౌట్‌) ధనాధన్‌ ఆటతీరుతో 107 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించారు.

చేజేతులా..: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్‌ ఆరంభం అద్భుతంగా సాగింది. ఓపెనర్లు కుశాల్‌ పెరీర, నిస్సాంక తొలి వికెట్‌కు అందించిన సెంచరీ భాగస్వామ్యాన్ని మిగతా బ్యాటర్లు ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేదు. ఆసీస్‌ బౌలర్ల జోరుకు వారంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో 157/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన జట్టు కేవలం 52 పరుగుల వ్యవధిలోనే చివరి 9 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా తన వరుస ఓవర్లలో ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ కుశాల్‌ మెండిస్‌ (9), సమరవిక్రమ (8) వికెట్లు తీయడం లంక స్వల్ప స్కోరుకు కారణమైంది. అయితే అంతకుముందు ఓపెనర్ల నిలకడను చూస్తే జట్టు 300+ పరుగులను సాధిస్తుందనిపించింది. ఈ జోడీని విడదీసేందుకు కమిన్స్‌ బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివరికి 22వ ఓవర్‌లో ఆసీ్‌సకు కావాల్సిన బ్రేక్‌ లభించింది. కమిన్స్‌ వేసిన షార్ట్‌ బాల్‌ను ఆడిన నిస్సాంక.. వార్నర్‌ రన్నింగ్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. అప్పటికి తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం లభించడం విశేషం. 27వ ఓవర్‌లో పెరీరను సైతం కమిన్స్‌ అవుట్‌ చేయడంతో లంక వికెట్ల పతనం మొదలైంది. తర్వాతి ఓవర్‌ నుంచే జంపా షో ఆరంభమైంది. తన ఓవర్‌లోనే మెండిస్‌ క్యాచ్‌ను డీప్‌ మిడ్‌వికెట్‌ నుంచి వార్నర్‌ పరిగెత్తుకుంటూ డైవింగ్‌ క్యాచ్‌ తీసుకోవడం టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. సమరవిక్రమ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా ఇక లంక కోలుకోలేదు. ఐదో నెంబర్‌ బ్యాటర్‌ అసంలక కాసేపు పోరాడి చివరి వికెట్‌గా వెనుదిరగగా మధ్యలో వికెట్లన్నీ టపటపా నేలకూలాయి.

స్కోరుబోర్డు

శ్రీలంక: నిస్సాంక (సి) వార్నర్‌ (బి) కమిన్స్‌ 61; పెరీర (బి) కమిన్స్‌ 78; కుశాల్‌ మెండిస్‌ (సి) వార్నర్‌ (బి) జంపా 9; సమరవిక్రమ (ఎల్బీ) జంపా 8; అసలంక (సి) లబుషేన్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 25; డిసిల్వ (బి) స్టార్క్‌ 7; వెల్లలగె (రనౌట్‌) 2; కరుణరత్నె (ఎల్బీ) జంపా 2; తీక్షణ (ఎల్బీ) జంపా 0; లాహిరు (బి) స్టార్క్‌ 4; మధుశంక (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 43.3 ఓవర్లలో 209 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-125, 2-157, 3-165, 4-166, 5-178, 6-184, 7-196, 8-199, 9-204, 10-209. బౌలింగ్‌: స్టార్క్‌ 10-0-43-2; హాజెల్‌వుడ్‌ 7-1-36-0; కమిన్స్‌ 7-0-32-2; మ్యాక్స్‌వెల్‌ 9.3-0-36-1; జంపా 8-1-47-4; స్టొయినిస్‌ 2-0-11-0.

ఆస్ట్రేలియా: మార్ష్‌ (రనౌట్‌) 52; వార్నర్‌ (ఎల్బీ) మధుశంక 11; స్మిత్‌ (ఎల్బీ) మధుశంక 0; లబుషేన్‌ (సి) కరుణరత్నె (బి) మధుశంక 40; ఇన్‌గ్లి్‌స (సి) తీక్షణ (బి) వెల్లలగె 58; మ్యాక్స్‌వెల్‌ (నాటౌట్‌) 31; స్టొయినిస్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 35.2 ఓవర్లలో 215/5. వికెట్ల పతనం: 1-24, 2-24, 3-81, 4-158, 5-192.బౌలింగ్‌: లాహిరు 4-0-47-1; మధుశంక 9-2-38-3; తీక్షణ 7-0-49-0; వెల్లలగె 9.2-0-53-1; కరుణరత్నె 3-0-15-0; ధనంజయ 3-0-13-0.

పాయింట్ల పట్టిక

జట్లు ఆ గె ఓ ఫ.తే పా ర.రే.

భారత్‌ 3 3 0 0 6 1.821

న్యూజిలాండ్‌ 3 3 0 0 6 1.604

దక్షిణాఫ్రికా 2 2 0 0 4 2.360

పాకిస్థాన్‌ 3 2 1 0 4 -0.137

ఇంగ్లండ్‌ 3 1 2 0 2 -0.084

అఫ్ఘానిస్థాన్‌ 3 1 2 0 2 -0.652

బంగ్లాదేశ్‌ 3 1 2 0 2 -0.699

ఆస్ట్రేలియా 3 1 2 0 2 -0.734

శ్రీలంక 3 0 3 0 0 -1.532

నెదర్లాండ్స్‌ 2 0 2 0 0 -1.800

1

వరల్డ్‌క్‌పలో ఒకే ప్రత్యర్థి(శ్రీలంక)పై ఎక్కువ విజయాలు (9) సాధించిన జట్టుగా ఆసీస్‌.

ప్రపంచక్‌పల్లో ఎక్కువ మ్యాచ్‌లు (42) ఓడిన జట్టుగా జింబాబ్వేతో సమంగా నిలిచిన శ్రీలంక.

భారత్‌లో అత్యధిక సిక్సర్లు (51) బాదిన విదేశీ బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్‌ (అన్ని ఫార్మాట్లలో).

వరల్డ్‌కప్‌లో నేటి మ్యాచ్‌

దక్షిణాఫ్రికా ్ఠ నెదర్లాండ్స్‌

Leave a comment

Your email address will not be published. Required fields are marked *