గడప గడపలో డేంజర్‌ బెల్స్‌

వైసీపీ అధినేత జగన్‌ ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. పార్టీపై పూర్తి స్థాయి ఫోకస్‌ పెడుతున్నారు. మూడేళ్ల నుంచి పాలనపై దృష్టి పెట్టిన జగన్‌ ఇప్పుడు పార్టీని పూర్తి స్థాయిలో గాడిన పడేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం పై ఇప్పటికే రెండు దఫాలు వర్క్‌ షాప్‌ లు నిర్వహించారు. రెండు రోజుల క్రితం పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో ఆర్డినేటర్లతో సమావేశమయ్యారు. ఈ రెండు సమావేశాల్లో కొంత సీరియస్‌ గానే జగన్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. తొలుత నేతలను సరైన మార్గంలో పయనించేలా దిశా నిర్దేశం చేశారు. ఇక వచ్చే నెల నాలుగో తేదీ నుంచి కార్యకర్తలతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం నియోజకవర్గానికి యాభై మంది కార్యకర్తలను ఎంపిక చేయనున్నారు. వారితో నేరుగా జగన్‌ ఇంట్రాక్ట్‌ అవ్వనున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగ నెలకొన్న సమస్యల గురించి తెలుసుకోనున్నారు. అంతే కాకుండా కార్యకర్తలు వచ్చే రెండేళ్లు ఏం చేయాల్సి ఉంటుందో కూడా దిశా నిర్దేశం చేయనున్నారని తెలిసింది. కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్ల తర్వాత కార్యకర్తలతను జగన్‌ కలవనున్నారు. అయితే జగన్‌ గతంలో జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో కాని, నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో జరిపిన విూట్‌ లో గాని వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జగన్‌ తన వద్దకు వచ్చిన నివేదికల ప్రకారం సమావేశంలో పేర్కొన్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. గడప గడపలో ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి వారిని అడిగి తెలుసుకోలేదు. అలాగే నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాల విషయంలోనూ ఇన్‌ఛార్జులను అడగలేదు. తాను చెప్పదలచుకున్న విషయాలను చెప్పి వెళ్లిపోయారు. ఎప్పటిలాగే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని కోరారు. సీరియస్‌ గా పనిచేయాలని సూచించారు. ఇన్‌ ఛార్జిగా పనిచేయాలని ఇష్టపడక పోతే కొత్త వారికి అవకాశం కల్పిస్తానని హావిూ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *