13 నుంచి 19 వరకు జరాభద్రం

ఈ ఏడాదిలో తొలిసారిగా ‘హీట్‌ వేవ్‌ ’ అలర్ట్‌ జారీ చేసింది భారత వాతావరణశాఖ (ఐఎండీ). వాయువ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 13 నుంచి 19 వరకు హీట్‌ వేవ్‌ కండీషన్‌ కొనసాగుతుందని వెల్లడిరచింది. ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2`3 డిగ్రీలు పెరుగుతాయని స్పష్టం చేసింది. అయితే.. మధ్య భారత ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయని పేర్కొంది.’’వాయువ్య, మధ్య భారత ప్రాంతాల్లో డ్రై కండీషన్లు కనిపిస్తున్నాయి. ఉరుములు కూడా తగ్గిపోయాయి. వెస్టెర్న్‌ టర్బ్యూలెన్స్‌ ఉంటుందని మేము అనుకోవడం లేదు. ఇక ఇప్పుడు ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. అయితే.. డ్రై కండీషన్‌ కారణంగా వేడి పెరుగుతుంది. అందుకే వారం రోజుల తర్వాత.. వాయువ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్‌ వేవ్‌ రావొచ్చు,’’ అని ఐఎండీ శాస్త్రవేత్త నరేశ్‌ కుమార్‌ వెల్లడిరచారు.: ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 38`40 డిగ్రీల సెల్సియెస్‌ గా నమోదవుతోంది. వాయువ్య భారతం, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2`3 డిగ్రీలు తక్కువగా ఉన్నాయి. అయితే.. రానున్న ఐదు రోజుల్లో వాయువ్య, మధ్య, ఈశాన్య భారతంలోని అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 2`4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ, మధ్య ఒడిశాలో 2`3 డిగ్రీలు పెరగొచ్చు.అయితే మహారాష్ట్రలో మాత్రం రానున్న 3 రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.’’ఇక్కడి నుంచి ఉష్ణోగ్రతలు నిదానంగా పెరుగుతాయి. మధ్య, వాయువ్య భారతంలో వాతావరణ మార్పులు కనిపిస్తున్నాయి. రానున్న 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం, సాధారణం కన్నా కాస్త ఎక్కువగా ఉంటాయి. 5`7 రోజుల తర్వాత.. వాయువ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్‌?వేవ్‌? వస్తుంది. ఈ నెల మూడో వారానికి ఆ హీట్‌ వేవ్‌ ఢల్లీికి విస్తరించే అవకాశంఉంది,’’ అని స్కైమెట్‌ పేర్కొంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది వాతావరణశాఖ. జూన్‌ వరకు పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని పేర్కొంది. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ్లల్లో బయటకు వెళ్లొద్దని సూచించింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టాలని వివరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *