ముందస్తు సర్వేలతో పార్టీలు

విజయవాడ, ఆగస్టు 16
ముందస్తు సర్వే ఫలితాలపై అత్యుత్సాహం ప్రదర్శించకూడదని ఏపీలో అధికార పార్టీ భావిస్తోంది. ఇటీవల కాలంలో వరుస సర్వేల్లో సానుకూల ఫలితాల రావడాన్ని ఎక్కువ హైలైట్‌ చేయకూడదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. అధికార వైఎస్సార్సీపీకి అనుకూలంగా వచ్చే ఎన్నికల ఫలితాలపై అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇటీవల కొంత కాలంగా రకరకాల సంస్థలు వైసీపీ విజయావకాశాలపై అనుకూలంగా ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ఈ ఫలితాలను వైసీపీ సోషల్‌ విూడియా బృందాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో పోల్చి అయా సర్వే సంస్థలు వెలువరించిన నివేదికలు నిజమేనని వైసీపీ సోషల్‌ విూడియా బృందాలు కాంపెయిన్‌ చేస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం ఏపీలో వైసీపీ గెలుపు ఖాయం అంటూ ఓ సంస్థ సర్వే ఫలితాలను ప్రకటించింది. 135 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుస్తారంటూ ఫలితాలను ప్రకటించారు. గతంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ఆ సంస్థ వెలువరించిన ఫలితాలకు అనుగుణంగానే ఎన్నికల్లో రిజల్ట్‌ రావడంతో చూడ్డానికి విశ్వసనీయంగానే ఉందని వైసీపీ వర్గాలు భావించాయి. దీంతో పెద్ద ఎత్తున ఆ సర్వే ఫలితాలను సోషల్‌ విూడియాలో ట్రోల్‌ చేశాయి.ఇలా ఒక సర్వే ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే ఇంకో సంస్థకు చెందిన సర్వే ఫలితాలు వెలువడ్డాయి. అందులో కూడా వైసీపీకి అనుకూలంగా కాస్త అటుఇటుగా ఫలితాలను ప్రకటించారు. ఒకే సమయంలో వేర్వేరు సంస్థలు తమ పార్టీకి అనుకూలంగా ముందస్తు ఫలితాల సరళిని ప్రకటించడంతో వైసీపీ నేతల సంతోషానికి అడ్డు లేకుండా పోయింది.2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది. వచ్చే ఎన్నికల్లో వై నాట్‌ 175 అంటూ ముఖ్యమంత్రి పార్టీ క్యాడర్‌ను ఉత్సాహ పరుస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోను తమ పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వే ఫలితాలు ముఖ్యమంత్రి చెబుతున్నట్లు 175కు, గత ఎన్నికల్లో గెలిచిన 151 స్థానాలకు దగ్గరగా లేకపోయినా సర్దుకుపోతున్నారు. మళ్లీ తమ పార్టీకే గెలుపు అనే ఉత్సాహం విూద ఉన్న ఆ పార్టీ నేతలకు ఈ సర్వే ఫలితాలు తమను ట్రాప్‌లో?కి దింపే ప్రయత్నాలు అని అనుమానం వచ్చినట్టు చెబుతున్నారు.ప్రస్తుతం ఏపీలో టీడీపీ, జనసేన మధ్య ఎలాంటి అవగాహన కుదరలేదు. ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనివ్వకూడదని మాత్రం పవన్‌ కళ్యాణ్‌ పదేపదే చెబుతున్నారు. ప్రస్తుతం వెలువడుతున్న సర్వే ఫలితాలన్ని పార్టీలు వేర్వేరుగా పోటీ చేసినప్పుడు వచ్చే ఫలితాలని అయా సంస్థలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడే సమయానికి పార్టీల మధ్య రాజకీయ అవగాహన, ఒప్పందం కుదిరి ఫలితాలు తారుమారైనట్లు సర్వే ఫలితాల్లో చూపిస్తారనే సందేహం తలెత్తింది.ప్రస్తుతం తమకు అనుకూలంగా చూపించే సర్వే ఫలితాల్లో భవిష్యత్తులో రాజకీయ సవిూకరణల దృష్ట్యా మారినట్టు చూపిస్తారనే సందేహం తలెత్తింది. దీంతో స్పష్టతలేని సర్వేలను భుజాన మోయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేలతో సంబంధం లేకుండానే కాంపెయిన్‌ నిర్వహించాలని నిర్ణయానికి ఆ పార్టీ వర్గాలు వచ్చాయని చెబుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *