పనులు ఫుల్‌.. సేవలు నిల్‌, గ్రామ సచివాలయాలతో చిక్కులు

ప్రజల ముందుకే పౌర సేవల లక్ష్యంతో ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలు పడకేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో గత ఏడాది చివర్లో ఆధార్‌ సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. పనుల భారంతో అవి కాస్త మూలన పడ్డాయి.ప్రైవేట్‌ ప్రాంగణాల్లో ఆధార్‌ సేవల్ని నిలిపి వేయాలనే యూఐడిఏఐ సంస్థ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ విూ సేవా కేంద్రాల్లో దాదాపు ఏడాది క్రితం ఆధార్‌ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు, తాసీల్దార్‌ కార్యాలయాల్లో, అనుమతించిన కేంద్రాల్లో మాత్రమే ఆధార్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో చాలా కాలం పాటు ఆధార్‌ సేవల విషయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయి.ఆధార్‌ దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పర్యవేక్షణ ఉండేలా ఆధార్‌ సంస్థ సంస్కరణలు చేపట్టింది. దీంతో గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్‌ సేవలు నిలిచపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆధీకృత కేంద్రాల్లో ఆధార్‌ సేవల్ని పొందడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మధ్య ఆధార్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలోనే అన్ని రకాల ఆధార్‌ సేవల్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. ఇందుకోసం ప్రతి సచివాలయంలో ఉన్న డిజిటల్‌ అసిస్టెంట్‌లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.సచివాలయాల్లో ఆధార్‌ సేవలు అందిస్తున్నామని విస్తృతంగా ప్రచారం చేశారు. కొద్ది నెలల పాటు ఈ కార్యక్రమం సజావుగానే సాగిన తర్వాత సాంకేతిక కారణాలతో అది కాస్త మూలన పడిరది. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైంది. స్కూళ్లలో చేరే విద్యార్ధులతో పాటు, నర్సరీల నుంచి మొదటి తరగతిలో ప్రవేశించే వారికి కూడా ఆధార్‌ డేటా అప్డేట్‌ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రావిూణ ప్రాంతాల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలు అరకొరగా అందుతున్నాయి.విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వం అందించే పథకాలను పర్యవేక్షించడం, లబ్దిదారులను ఎంపిక చేయడం, వారికి సంబంధించిన వివరాలను పొందుపరచడంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డేటా అప్డేట్‌ చేసే పనుల భారం కంప్యూటర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగులపై పడిరది.దీంతో సచివాలయాల్లో ఆధార్‌ సేవలకు తాత్కలికంగా స్వస్తి చెప్పారు. ప్రస్తుతం సచివాలయాల్లో ఆధార్‌ సేవలు అందించలేమని, కొద్ది రోజుల తర్వాత వాటిని ప్రారంభిస్తామనే చెబుతున్నారు. దీంతో బ్యాంకులు, పోస్టాఫీసుల వంటి వాటిపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు కార్వీ వంటి ఆధీకృత సంస్థల్లో మినహా మిగిలన చోట్ల సర్వర్‌ సమస్యలతో ఆధార్‌ పొందడం, పాత వాటిలో వివరాలు మార్చడం సాధ్యపడటం లేదు.విజయవాడ వంటి నగరాల్లో కొన్ని కేంద్రాల్లోనే గంటల తరబడి ఎదురు చూపులు చూడాల్సి వస్తోంది. సచివాలయ ఉద్యోగులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఆధార్‌ సేవల్ని తాత్కలికంగా నిలిపివేసినట్లు చెబుతున్నారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం మాత్రమే ఆధార్‌ సేవలు అందిస్తున్నట్లు చెబుతున్నారు. సచివాలయాల్లో అన్ని హంగులతో ఆధార్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో అవి కాస్త నిరుపయోగంగా మారాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *