యుద్ధానికి సిద్ధం చేస్తున్న టీడీపీ

రాజ్యానికి దూరమైన రాకుమారుడు పది మందిని పోగేసి యుద్ధానికి సన్నద్ధం కావడానికి అందరినీ ఉత్సాహపరిచాడు. ఆ పదిమంది తమ బంధువర్గాన్నీ, స్నేహితులనీ పోగేసి పెద్ద సైన్యమే సిద్ధం చేశారు. ఇదంతా రాజ్యాన్ని తిరిగి సాధించాలన్న పట్టు దల, రాజ్యంలో తలెత్తిన దారుణ పరిస్థితులే కారణం. అందుకే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి మనలోని పొరపాట్లను, నిరాశను వదిలేసుకుని రెండిరతల ఉత్సాహాంతో ఉరకండి అంటూ ఆ రాకుమారుడు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చి మరీ రణరంగానికి సన్నద్ధులను చేశాడు…ఇది అనేక తరాల క్రితం జరిగిన కథ. ఇపుడు ఇందుకు దాదాపు దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్‌ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడానికి తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటి రాష్ట్ర రాజకీయ, సామాజిక పరిస్థితులన్నీ ఆయన శక్తిసామర్ధ్యాలను ద్విగుణీకృతం చేశాయి. కొత్త శక్తితో ఆయన కుర్రాడిలా ఉరకలు వేస్తున్నారు. అలాంటపుడు పార్టీ నాయకులు, హితులు, కార్యకర్తలు నీరుగారినట్టు ఉండడం, నిరుత్సాహంగా ఉండడం ఆయనకు ససేవిూరా ఇష్టం లేదు. అందుకే అందరినీ పిలచి క్లాసు పీకుతున్నారు. ఇది సామాన్యమైనది కాదు యుద్ధోన్ముఖులను చేసే స్పెషల్‌ క్లాసు. దీనికి అందరూ అటెండ్‌ కావాలి. అధికారంలోకి వచ్చి మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసికెళ్లాలంటే ఇదే మంచి తరుణం. అధికారంలో ఉన్న జగన్‌, వైసీపీ నాయకులు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. అందువల్ల విపక్షంగా బలవంతులమై వారిని పీఠం నుంచి దించాలన్న ఏకైక లక్ష్యంతోనే బతకాలి, ఉరకాలి, మాట్లాడాలి, ఎదిరిం చాలి.. అన్న నినాదాలను బాబు ఇప్పుడు తమ ఎమ్మెల్యేలకు నూరి పోయడంలో తలమునకలయ్యారు. చంద్రబాబులో గతంలో ఎన్నడూ చూడని కొత్త కోణం ఇపుడు బయటపడిరది. ఆయనలో ఒక గొప్ప నూతనోత్సాహంతో కూడు కున్న మార్పు కనపడుతోంది. కానీ కొన్ని జిల్లాల్లో పార్టీ నేతలు సమస్యలు ఎదుర్కొనడం ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన డమే ఆయన్ను ఇబ్బందిపెడుతోంది. వారినీ అధికారం వేపు కదలమని, అందుకు తగ్గట్టు మారాలని హెచ్చరిస్తున్నారు. మాటలో, ఆరోపణల్లో వేగం పెంచారు. అందరినీ అలానే దూకుడుగా వ్యవహరించమని హెచ్చరిస్తున్నారు. ప్రచారంలో, రోడ్డు షోలలో ఆయన సాధారణంగా మాట్లాడే తీరులో ఎంతో మార్పు వచ్చింది. మాటల తూటాలు వదులుతున్నారు. ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ఈసారి నలభై శాతం యువతకు అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీలో కొత్త శక్తికి అవకాశం కల్పించి పార్టీపరంగా తమ శక్తి సామర్ధ్యాల్ని మరింత ప్రదర్శించి ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేయాలన్నదే ఆయన లక్ష్యంగా ఉంది. అందుకే కష్టపడిన వాళ్ళని పార్టీ గుర్తిస్తుందని, ఈసారి ఎన్నికలలో ఎలాంటి లాబీయింగ్‌ లు పని చేయవని స్పష్టం చేసిన నేపద్యం లో కార్యకర్తలలో కొత్త ఉత్సాహం నింపారు.ఆంధ్రప్రదేశ్‌ లో మళ్లీ అధికారం చేజిక్కుంచుకోవడమే టార్గెట్‌ గా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రమిస్తు న్నారు. వయసు విూద పడుతున్నారు. యువతకు పోటీగా విరామం లేకుండా జిల్లాల బాట పడుతున్నారు. ఇబు బాదుడే బాదుడు అంటూ జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన వరద ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గాల వారీగా భేటీ నిర్వహిస్తున్నారు. నిత్యం కార్యకర్తలకు టచ్‌ లో ఉంటున్నారు. వారి నుంచి నేరుగా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటున్నారు. మరోవైపు టికెట్ల కేటాయింపు విషయంలోనూ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అధికారులు, వ్యహకర్తలతో మాట్లాడినట్టు కాకుండా యువత మనసును తాకేట్టు క్లుప్తంగా, సూటిగా మాట్లాడుతూ పార్టీవర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది.. ఏ నేత ఏం చేస్తున్నారో.. ఏనేత పై ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం ఏంటన్నది ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ తీసు కుంటున్నారు.చాలా మంది నేతలు మొదట రెండు మూడు రోజులు చేయడం, ఆ తరువాత ఎప్పుడో తమకు కుదిరినప్పుడు జనంలోకి వెళ్లడం లేదా.. పార్టీ పిలుపునిచ్చినప్పుడు కనిపించడం ఆ తరువాత ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా పోతున్నారని క్లాస్‌ పీకారు. ఇది కేవలం ఒకరిద్దరు కాదు జిల్లా నేతలం దరి పరిస్థితి ఇలానే ఉంది. విూరు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎప్పుడు జనంలోకి వెళ్లారు.. ఎంత సేపు అక్కడుంటున్నారు.. అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారనే విషయాలు తనకు స్పష్టంగా తెలుస్తున్నాయన్నారు. పార్టీ అధినేత ఇంత స్పష్టంగా, సూటిగా ఉండడంతో నాయకులు కాస్తంత ఖంగుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం కాస్తంత విజయవంతం కావడంతో బద్దకంగా మారడం తగదని హెచ్చరిస్తూ ఈ దూకుడును పనిలోనూ చూపించగలిగితేనే లక్ష్యం సాధించగల్గుతామని హెచ్చరించారని తెలుస్తోంది. , పార్టీ సభ్యత్వ నమోదు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో ఉండాలని చెబితే.. ఒక నియోజకవర్గంలో కూడా మెరుగ్గా ప్రోగ్రెస్‌ లేదని ఫైర్‌ అయ్యారు. వ్యవసాయానికి విూ ప్రాంతంలో విద్యుత్‌ విూటర్లు అమర్చుతుంటే విూరేం చేస్తున్నారని ప్రశ్నించారు. లోకల్‌ గా ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి, అక్రమాలపై రెగ్యూలర్‌ గా కార్యక్రమం చేయడంపై ఏ ఒక్కరికీ శ్రద్ధలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేతలు మానిటర్‌ చేయాల్సిన ఐదు జిల్లాల కో`ఆర్డీనేటర్‌ అమర్నాథ్‌ రెడ్డిని ప్రశ్నించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నేతలతో చంద్రబాబు జూమ్‌ విూటింగ్‌ ను నాయకులు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. తీరా సమావేశంలో ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది చంద్రబాబు తెలుసుకునే యత్నం చేయగానే అంతా విస్తుపోయారు. మొత్తానికి చంద్రబాబు నూతనో త్సాహం తో ఉరకలు వేస్తుండడంతో పాటు నాయకులను, కార్యకర్తలనూ మరింత ఉత్సాహంగా, దూకుడుగా ముందడుగు వేయాలని చిన్న హెచ్చరిక ఇవ్వడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *