పవన్ కళ్యాణ్ గెలుస్తాడో.. లేదో చెప్పడానికి నేనేమైనా బ్రహ్మంగారినా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విజయం సాధిస్తారో లేదో చెప్పడానికి నేనేం బ్రహ్మంగారిని కాదనేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు (Manchu Vishnu). తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రాజకీయాల ప్రస్తావన రాగా, పై విధంగా మంచు విష్ణు సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ గురించి పొలిటికల్‌గా కాకుండా సినిమాల పరంగా అయితే మాత్రం ఆయనొక సూపర్ స్టార్ అంటూ.. మంచు విష్ణు ప్రశంసలు కురిపించారు.

సినిమాల పరంగా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ పవరేంటో అందరికీ తెలుసు. వరుసగా ఫ్లాప్స్ వచ్చినా, ఆయన సినిమాలు విజయం సాధించకపోయినా.. తదుపరి సినిమాపై రెట్టింపు స్థాయిలో అంచనాలు, అదే స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. అది పవన్ కళ్యాణ్ కున్న స్టార్ పవర్’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక ఏపీ రాజకీయాలకు సంబంధించి పవన్ కింగా? లేదంటే కింగ్ మేకరా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘ప్రజలు (People) చాలా స్మార్ట్‌‌గా ఆలోచిస్తున్నారు. సినిమాలు చూస్తారు. ఎవరు నచ్చితే వారికి ఓటు వేస్తారు. రాజకీయాలలో మహామహులే ఓడిపోయి ఉన్నారు. నా జీవితం, గ్రామం, దేశాన్ని బాగుచేయగలరని నమ్మిన వారిని చూసి ప్రజలు ఓటేస్తారు. వాళ్లకు ఆ క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను.. ఇక కింగా? కింగ్ మేకరా? అనే దానికి ఇప్పుడే సమాధానం చెప్పలేను. కొన్ని నెలల తర్వాత సమాధానం చెప్పగలను’’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన దృష్టంతా తదుపరి చిత్రంపైనే ఉందని చెప్పిన మంచు విష్ణు.. రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా (MLA) పోటీ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *