దిగ్విజయ్‌ కు పోటీగా..హనుమాన్‌

భోపాల్‌, అక్టోబరు 16
మధ్యప్రదేశ్లో అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్‌. సీఎంకు పోటీగా ఓ ప్రముఖ నటుడిని బరిలో దింపింది 5 రాష్ట్రాల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతోంది. తాజాగా.. పలు రాష్ట్రాల్లో అభ్యర్థులకు సంబంధించిన తొలి జాబితాను ప్రకటించింది. వీటిల్లో మధ్యప్రదేశ్లో జాబితా ఆసక్తికరంగా మారింది. మరీ ముఖ్యంగా.. ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్కు పోటీగా.. ఓ ప్రముఖ నటుడిని కాంగ్రెస్‌ బరిలో దింపింది. ఇప్పుడు ఈ వార్తపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.144 అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం విడుదల చేసింది కాంగ్రెస్‌. విక్రమ్‌ మస్తాల్‌ అనే వ్యక్తిని సీఎం చౌహాన్కు పోటీగా దింపింది. ఈయన.. ఓ ప్రముఖ టీవీ నటుడు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పోటీ చేస్తున్న బుధ్ని నుంచే ఈయన కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.2008 టీవీ షో ‘రామాయణం’తో ఫేమస్‌ అయ్యారు విక్రమ్‌ మస్తాల్‌. అందులో హనుమంతుడి పాత్రకు పోషించారు. ఈ ఏడాది జులైలో కాంగ్రెస్లో చేరారు మస్తాల్‌. ఆయన్ని ఖండువా కప్పు స్వాగతించారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌. ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు నెలకొన్నాయో తెలిసిందే. కాగా.. ఆ సినిమాలో హానుమంతుడి కోసం రాసిన డైలాగ్స్పై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. విక్రమ్‌ మస్తాల్‌ కూడా.. సినిమా రచయితల చర్యలను తీవ్రంగా ఖండిరచారు.’’భారత సంస్కృతిని ప్రపంచానికి చూపించే విధానం ఇదేనా? నిజమైన రామాయణంలో హనుమతుడు ఇలాగే ఉంటే.. ప్రజలు ఆలయాలకు వెళ్లి ఆయన్ని కొలిచేవారా? ఆర్థిక ప్రయోజనాల కోసం విూరు ఈ సినిమా తీశారు. ఓమ్‌ రౌత్‌ (సినిమా దర్శకుడు)తో పాటు రచయితలను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ డైలాగ్లను వెంటనే సినిమా నుంచి తొలగించాలి,’’ అని మండిపడ్డారు విక్రమ్‌ మస్తాల్‌.రామాయణంతో పాటు అనేక సినిమాల్లోనూ నటించారు విక్రమ్‌ మస్తాల్‌. టాప్‌ గేర్‌ (2022), బ్యాటిల్‌ ఆఫ్‌ సారాగఢ్‌ (2017), ఆశ్రమ్‌ (2020)లో నటించి మెప్పించారుఇక ఆదివారం కాంగ్రెస్‌ విడుదల చేసిన 144 అభ్యర్థుల జాబితాలో 47మంది జెనరల్‌ కేటగిరీ వారు ఉన్నారు. 39మంది ఓబీసీ, 30 ఎస్టీ, 22ఎస్సీ, 1 ముస్లిం అభ్యర్థి సైతం ఉన్నారు. మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ తనయుడు జైవర్ధన్‌ సింగ్‌ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. రఘోఘాట్‌ సీట్‌ నుంచి ఆయన బరిలో నిలబడుతున్నారు. ఓ రాష్ట్ర సీఎంని ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిరచడం చాలా కష్టమైన విషయమే. ఈ నేపథ్యంలో విక్రమ్‌ మస్తాల్‌ గెలుస్తారా లేదా అన్నది వేచి చూడాలి.మధ్యప్రదేశ్లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. 116 మ్యాజిక్‌ ఫిగర్‌. నవంబర్‌ 17న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడతాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *