ఆ ఇద్దరి భేటీ వెనుక..పవన్‌

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ ద్వారా బీజేపీతో పొత్తు దిశగా తొలి అడుగు పడిరది. ఈ పొత్తుల వ్యవహారంలో సీట్ల సర్దుబాటు అంశంపైన జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. సీట్లపైన పవన్‌, చంద్రబాబు చర్చిస్తారని చెప్పటం ద్వారా పొత్తు ఖాయమైందని స్పష్టం చేసారు. ఇదే సమయంలో తన సీటు గురించి ప్రకటన చేసారు. టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన లాంఛనమే. బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు చర్చలు ప్రారంభించారు. ఢల్లీిలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తో భేటీ అయ్యారు. ఆ సమావేశానికి బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ తో మైత్రి దిశగా చంద్రబాబు నుంచి ప్రతిపాదన అందినట్లుగా సమాచారం. తెలంగాణలో బీజేపీకి తమ నుంచి సహకారం ఉంటుందని.. ఏపీలో తమకు బీజేపీ సహకారం కావాలని చంద్రబాబు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఇటు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా మనోహర్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. సీట్ల సర్దుబాటు వ్యవహారం రెండు పార్టీల అధినేతలు చర్చిస్తారని వెల్లడిరచారు. ఇప్పటికే జనసేనాని పవన్‌ సర్వే నివేదికలతో సిద్దం అయ్యారు. తాను ఎక్కడ పోటీ చేయాలనే అంశంతో పాటుగా తమ పార్టీ బలం..బలహీనతల పైన క్షేత్ర స్థాయి సమాచారం సేకరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి పవన్‌ తన వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా గోదావరి జిల్లాల నుంచి యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పుడు చంద్రబాబు ఢల్లీి యాత్రలో చోటు చేసుకుంటున్న పరిణామాల ఆధారంగా..అవసరం అయితే పవన్‌ మరోసారి బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. పవన్‌ ప్రతిపాదన కారణంగానే ఇప్పుడు చంద్రబాబు, అమిత్‌ షా భేటీ జరిగిందని.. మూడు పార్టీలు కలిసి 2014 ఎన్నికల తరహాలో మరో సారి వైసీపీ లక్ష్యంగా ఎన్నికల పొత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. నెలరోజుల పాటు సంతాప సభలు తెనాలి నుంచి మనోహర్‌: ఇటు మనోహర్‌ తాను తెనాలి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. టీడీపీ, జనసేన పొత్తులో తెనాలి సీటు పైన కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. టీడీపీ సీనియర్‌ నేత ఆలపాటి..మనోహర్‌ మధ్య సీటు ఎవరికి దక్కుతుందనే చర్చ సాగింది. ఇప్పుడు మనోహర్‌ స్వయంగా తన సీట పైన క్లారిటీ ఇచ్చారు. మనోహర్‌ జనసేనలో ప్రస్తుతం దాదాపుగా నెంబర్‌ టు స్థానంలో ఉన్నారు. మనోహర్‌ తెనాలి నుంచి పోటీ చేస్తానని చెప్పటం ద్వారా టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తొలి సీటు ఖరారైనట్లుగానే భావించాలని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెనాలిని మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దటం తన కలగా మనోహర్‌ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడిరచాల్సిన అవసరం ఉందన్నారు. దీంతో, ఇక పొత్తులు ఖాయం కావటంతో..సీట్ల ఖరారు పైన ప్రకటనలు మొదలయ్యాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *