ఈయన జ్యోతిష్యం నిజమైతే ఈ సారి ప్రపంచకప్ మనదే.. అసలు ఎవరా జ్యోతిష్కుడు? ఏం చెప్పారు?

గురువారం నుంచే భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కాబోతుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 2011 సీన్‌ను రిపీట్ చేసి టీమిండియా ఈ సారి ప్రపంచకప్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే టీమిండియా అభిమానులను సంతోష పరిచే వార్త ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రముఖ సైంటిఫిక్ జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో జోస్యం ప్రకారం ఈ సారి టీమిండియానే ప్రపంచకప్ గెలవబోతుంది. 1987లో జన్మించిన క్రీడాకారుడు కెప్టెన్‌గా ఉన్న జట్టు ఈ సారి ప్రపంచకప్ గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చి ఇంటర్వ్యూలో గ్రీన్ స్టోన్ లోబో మాట్లాడుతూ ‘‘1986/87లలో జన్మించిన క్రీడాకారులు కెప్టెన్లుగా ఉన్న జట్లు ఇటీవల మేజర్ టోర్నీలలో గెలుస్తున్నాయి. 1986లో పుట్టిన టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్, 1987లో పుట్టిన మరో టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్, 2018 ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ హ్యూగో లోరిస్ 1986లో జన్మించారు. 2022లో అర్జెంటీనాను ఫిపా వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కెప్టెన్ లియోనల్ మెస్సీ 1987లోనే జన్మించాడు.’’ అని తెలిపారు.

ఇక క్రికెట్‌లోనూ దీనికి లోబో ఓ ఉదాహరణ చూపించారు. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపిన ఆ జట్టు కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్ కూడా 1986లోనే జన్మంచాడని గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో ఈ సారి కూడా 1987లో జన్మించిన కెప్టెనే ప్రపంచకప్ గెలుస్తాడని ఆయన బలంగా చెబుతున్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా కూడా టైటిల్ ఫెవరేట్ల రేసులో ఉన్నప్పటికీ వారి కెప్టెన్ల జాతక చక్రం బాగాలేదంటున్నారు. దీంతో వారు ప్రపంచకప్ గెలిచే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. గ్రీన్ స్టోన్ లోబో చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం ఆయా జట్ల కెప్టెన్లు జన్మించిన సంవత్సరాలను పరిగణనలోకి తీసుకుంటే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ మాత్రమే 1987లో జన్మించారు. అయితే బంగ్లాదేశ్ జట్టు అంత బలంగా లేకపోవడంతో ప్రపంచకప్ గెలిచే అవకాశాలు లేవు. దీంతో ఇండియానే ప్రపంచకప్ వరించే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. “షకీబ్ అల్ హసన్ 1987లో జన్మించాడు. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్ అంత బాగా లేదు. అందుకే 1987లో పుట్టిన ఏకైక కెప్టెన్ మన రోహిత్ శర్మ మాత్రమే. అతను ప్రపంచకప్‌ను గెలుస్తాడు’ అని లోబో పేర్కొన్నారు. అయితే లోబో జ్యోతిష్యాన్ని అంత తేలికగా తీసిపడేయడానికి వీల్లేదు. ఎందుకంటే 2011, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లలో ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఆయన చెప్పిన జట్లే ప్రపంచకప్ విజేతలుగా నిలిచాయి. దీంతో మరోసారి గ్రీన్‌స్టోన్ లోబో చెప్పిన జ్యోతిష్యం నిజమవ్వాలని టీమిండియా అభమానులు కోరుకుంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *