యువగళంలో జనసేన జెండాలు

ఏపీలో కొత్త రాజకీయ పొత్తు పొడుస్తోందా..లేదంటే ఇప్పటికే రహస్య పొత్తు కుదిరిందా..ఎందుకంటే..టీడీపీ.. జనసేన వ్యవహారాన్ని చూస్తుంటే ఏపీ ఓటర్లకు ఏదీ అర్థం కావడం లేదు..పొత్తుల గురించి మాట్లాడనేలేదని జనసేనాని చెబుతారు. టీడీపీ అధినేత ఏదీ స్పష్టంగా చెప్పరు. ఎవరేమనుకుంటే అదే నిజం అన్నట్లుగా ఓ పీలర్‌ వదులుతారు.. కానీ లోకేష్‌ పాదయాత్రలో మాత్రం.. జనసేన జెండాలు ఎగురుతున్నాయి. ఇది దేనికి సంకేతం..పొత్తు పొడిచినట్లా..రహస్య ఒప్పందం కుదిరినట్లా.. ఇంతకీ చంద్రబాబు, పవన్‌ భేటీలో దేని గురించి మాట్లాడారన్నది ఇప్పటికే ఎవరి అర్ధంకాని విషయమే..ఏపీ రాజకీయం రంజుగా మారుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల పొత్తుల ఎత్తుల కత్తులు పదునెక్కుతున్నాయి. చంద్రబాబు పవన్‌ భేటీలో దేని గురించి మాట్లాడినా..పబ్లిక్‌ మాత్రం పొత్తు పొడిచిందనే అనుకుంటున్నారు. అటు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్‌.. బాబుతో కూడా మిత్రలాభం కోరుకుంటున్నారు. ఈ పరిణామం ఎలాంటి ఫలితాలనిస్తుందో కానీ..పవన్‌ మాత్రం చంద్రబాబును వదలడం లేదు. బాబు కూడా పవన్‌ను కోరుకుంటున్నారుఇద్దరి సమావేశం ఎన్నో అర్థాలకు దారి తీసింది. అయితే పవన్‌ మాత్రం పొత్తు విషయంపై క్లారిటీ ఇవ్వరు.. చంద్రబాబు చెప్పను గాక చెప్పరు. అంతా సస్పెన్స్‌.. కానీ ఏదో జరిగిపోయినట్లు ఓ పీలర్‌ జనాల్లోకి వదులుతారు. ఇందుకు నిదర్శనమే..లోకేష్‌ పాదయాత్రలో జనసేన జెండాల రెపరెపలు..కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరుగుతున్న లోకేష్‌ పాదయాత్రలో జనసేన జెండాలు మెరిశాయి. జనసేన కార్యకర్తలు యువగళం పాదయాత్రలో పాల్గొని హంగామా చేశారు. దీన్ని బట్టి..టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిందనుకోవాలా..లేదంటే ఏదో స్నేహం కోసం జనసేనాని..తన కార్యకర్తలను యువగళంలో జనసేన గళం వినిపించమని పంపించారా.. ఎంలా అర్థం చేసుకోవాలి జనసేనాధిపతి..మరోవైపు, పొత్తుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే చంద్రబాబు` పవన్‌ సమావేశం జరిగిందని చెబుతున్నారు జనసేనలో నెంబర్‌ 2 లీడర్‌ నాదెండ్ల మనోహర్‌..ఇదొక్కటే కాదు..భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు ఉంటాయని స్పష్టం చేశారు. విపక్షాల మధ్య ఓట్లు చీలకుండా జనసేన చూసుకుంటుందట..యువగళంలో జనసేన జెండాలు కనిపించాయంటే.. టీడీపీకి జనసేన సంఫీుబావమా..అదనపు బలమా..ఎన్నికలకోసం పొత్తు పొడిచిన బలగమా..మనోహర్‌ చెప్పినదాన్ని బట్టి చూస్తే..తమ్ముళ్లు, జనసేన కార్యకర్తలు కలిసిపోయినట్లే..రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచినట్లే.. అందుకు..ఎమ్మిగనూరులో జరుగుతున్న లోకేష్‌ పాదయాత్రలో మెరిసిన జనసేన జెండాలే నిదర్శనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *